నేటి నుంచి ‘సామాజిక సాధికార యాత్ర’

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ చేసిన మేలును వివరిస్తాం..  

మంత్రులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతల స్పష్టీకరణ.. 

తొలి విడతలో 39 నియోజకవర్గాల్లో యాత్ర 

తాడేపల్లి:  దేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు(మైనార్టీ వ్యవహారాలు) జియావుద్దీన్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతునాయక్‌లు ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ చేసిన మంచిని వివరించి.. ఆయా వర్గాలను ఏకం చేయాలన్న లక్ష్యంతో సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రను వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిందన్నారు.

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న వైయ‌స్ఆర్‌సీపీ సామాజిక సాధికార యాత్ర పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం సామాజిక సాధికార యాత్ర బస్సుకు పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు విడతలుగా సామాజిక సాధికార యాత్ర జరుగుతుందన్నారు. తొలి విడత యాత్ర గురువారం ప్రారంభమవుతుందని.. నవంబర్‌ 9న ముగుస్తుందని చెప్పారు.

రోజూ మూడు ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఈ యాత్ర జరుగుతుందని.. సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. తొలి విడతలో మూడు ప్రాంతాల్లోని 39 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుందని వివరించారు. యాత్రలో పేదలందరినీ ఏకం చేసి పెత్తందార్లపై రణభేరి మోగిస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల సంగ్రామంలో.. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దన్నుగా నిలిచి, పెత్తందార్లను మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. మీడియాతో ఎవరేమన్నారంటే..  

పేదలు వృద్ధిలోకొస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటా!  
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును వివరించడానికే సామాజిక సాధికార యాత్ర చేపట్టాం. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడితే.. పేద పిల్లలు వృద్ధిలోకి వస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పెత్తందార్లు గగ్గోలు పెట్టారు. చివరకు సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే.. అక్కడికి వారొస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పెత్తందార్లు ఏకంగా కోర్టుల్లో వాదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆలయాల్లోకి కూడా పెత్తందార్లు రానివ్వలేదు.

జగనన్న సీఎం అయ్యాక పేదలకు అవే ఆలయ కమిటీల్లో పదవులిచ్చారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి, తర్వాత తప్పించుకునే వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి జగనన్న. తమ పక్షాన నిలిచిన జగనన్నకు పేదలు దన్నుగా నిలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న దళిత విద్యార్థులతో పవన్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడగలరా?
    – ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

చంద్రబాబు అవమానిస్తే.. సీఎం జగన్‌ అక్కున చేర్చుకున్నారు...
ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు దళితులను అవహేళన చేస్తే.. కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ సింహభాగం పదవులిచ్చి అక్కున చేర్చుకుని ఆత్మగౌరవం నిలిపిన నేత సీఎం వైఎస్‌ జగన్‌. దళితుల మీద చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదు. జగనన్న పాలనలో పేదల బతుకులు మారాయి.

సామాజిక సాధికార యాత్ర పేరుతో మేం పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే.. నిజం గెలవాలనే పేరుతో జైల్లో ఉన్న వ్యక్తి కోసం భువనేశ్వరి యాత్ర చేస్తున్నారు. గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూసింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆ వర్గాలను పేదరికం నుంచి గట్టెక్కించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దీని వల్లే రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. వైఎస్సార్‌సీపీ పేదల పార్టీ. ఈ ప్రభుత్వం పేదలది. 
– మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

అర్హతే ప్రామాణికం 
రాష్ట్ర వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించాలనే తపనతో సీఎం జగన్‌ పనిచేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా వివక్షకు తావులేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చుతున్నారు. కరోనా సమయంలో తిండిలేక అనేక రాష్ట్రాల్లో ప్రజలు చనిపోయారు. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ పుణ్యమాని ఏపీలో అలాంటి పరిస్థితి రాలేదు.
– కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి

సామాజిక న్యాయం నినాదం కాదు.. అది ఓ విధానం.. 
సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానం అని స్పష్టం చేసి.. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. పేదల పక్షాన సీఎం జగన్‌ నిలబడితే, చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. పేదలు బాగుపడాలంటే జగనే మళ్లీ సీఎం కావాలి. పేదలంతా కలిసి పెత్తందార్లను ఎదుర్కోవడానికే ఈ యాత్ర చేపట్టాం.  
– జియావుద్దీన్, మాజీ ఎమ్మెల్యే 

175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి  
జగనన్న పాలన జనం మెచ్చిన పాలన. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్‌ సామాజిక న్యాయా న్ని, ధర్మాన్ని పాటిస్తున్నారు. మంత్రివర్గంలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. టీడీపీ హయాంలో బీసీ అంటే బిజినెస్‌ క్లాస్‌.. జగనన్న పాలనలో బీసీలను  సమాజానికి బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా మార్చారు. అలాంటి జగనన్న కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. గురు వారం æనుంచి 175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి మోగించబోతున్నాం. పెత్తందార్ల కోటలను బద్ధలు కొట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మంతా సంఘటితంగా ముందుకెళుతున్నాం.

సీఎం జగన్‌ నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పేద లకు–పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంలో చేయి చేయి కలిపి.. జగనన్నకు అండగా నిలుద్దాం. ని జం గెలవాలని యాత్ర చేపట్టిన భువనేశ్వరి నిజా లు చెప్పాలి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికా రాన్ని దక్కించుకున్నప్పటి నుంచి 2019 వరకూ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అనేక కుంభకో ణాలకు పాల్పడ్డారు. పాపం పండింది, అవినీతి బయటపడింది కాబట్టే రాజమండ్రి జైల్లో ఉన్నా రు. అందుకే భువనేశ్వరి నిజం గెలవాలని కాకుండా చంద్రబాబు పాప పరిహార యాత్ర చేయాలి. 
– జోగి రమేష్, గృహనిర్మాణ శాఖ మంత్రి

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను బాబు ఓటు బ్యాంకుగానే చూశారు
రాష్ట్ర జనాభాలో సుమారు 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలున్నారు. వారి అవసరాలను గుర్తించడం పాలకుల ప్రాథమిక కర్తవ్యం. ఆయా వర్గాలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నడూ ఆలోచించలేదు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల్లో వెలుగులొచ్చాయి. సంక్షేమాభివృద్ధి పథకాలతో వారి జీవన ప్రమా­ణాలు మెరుగవుతున్నాయి. సామాజిక ఆవశ్య­కతను నొక్కిచెప్పేందుకే ఈ యాత్రను చేపట్టాం. 
– హనుమంతు నాయక్, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు.

పెత్తందారులను ఎదుర్కొనే యాత్ర ఇది..
  వైయ‌స్ఆర్‌సీపీ చేసేది సామాజిక సాధికార యాత్ర అని ఆ పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పేదలందరూ కలిసి పెత్తందారులను ఎదుర్కొనే యాత్ర ఇది.. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని, సాధికార న్యాయాన్ని తెలియజేసేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తున్నట్లు వివరించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక సాధికార యాత్ర ద్వారా వెనుకబడిన(వెన్నెముక) వర్గాల సాధికారత కోసం జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మేలు, చేయబోతున్న మేలు గురించి తెలియజేయనున్నట్లు చెప్పారు.

రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి మూడు దశల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. మొదటి దశ ఈ నెల 26 నుంచి నవంబర్‌ 9వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో 39 నియోజకవర్గాలను కవర్‌ చేయటమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని తెలిపారు. బస్సు యాత్ర రాష్ట్రంలోని ఇచ్చాపురం(శ్రీకాకుళం జిల్లా), సింగనమల (అనంతపురం జిల్లా), తెనాలి(గుంటూరు జిల్లా)లో ప్రారంభమవుతుందని వివరించారు. ఆయా నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారితో మమేకమవుతూ యాత్ర సాగుతుందని  చెప్పారు.

సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. జగనన్న పాలనలో కేబినెట్‌ కూర్పు దగ్గర నుంచి 68 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కలి్పంచారని తెలిపారు. స్పీకర్‌ స్థానం నుంచి మండలి చైర్మన్‌ దాకా ఇలా ఒకటి రెండు కాదు.. జనరల్‌ స్థానాలను సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇచ్చి గౌరవించిన జగనన్నకు జేజేలు పలుకుతూ సామాజిక సాధికార యాత్రను కొనసాగించనున్నామని చెప్పారు.  

నిజం గెలవబట్టే చంద్రబాబు జైల్లో.. 
నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని, నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలని కోరుకుంటే బాబు జీవితంలో జైలు నుంచి బయ టకురాలేరని వైవీ అన్నారు. భువనేశ్వరి చేపడుతున్న నిజం గెలవాలి యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవినీతికి పాల్పడి చంద్రబాబు జైలుకెళ్లారు.. ఆ చెడ్డ పేరు కప్పిపుచ్చుకునేందుకు తెలివిగా నిజం గెలవాలని చంద్రబాబు సతీమణి యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కూడా తెలివైన వారేనన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మటం లేదన్నారు. బాబు అవినీతి చేశారు.. అందుకే జైలు కెళ్లారు అని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.  

Back to Top