వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైయస్ జగన్ తన రాజ్యాంగబద్ధ ధర్మాన్ని త్రికరణ శుద్ధితో పాటించారు. ‘కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం.. చివరికి పార్టీలు కూడా చూడం.. మీరు ఎవరికి ఓటేశారో అన్నది మాకు సంబంధంలేదు. ప్రజలందరికీ నా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం కల్పిస్తాం’.. అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైయస్ జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా వైయస్ జగన్ ఇవే మాటలు ఉద్ఘాటిస్తూ..‘కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నాం. ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధి అందని వారికి కూడా అందజేస్తున్నాం. అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడం. కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు అందజేస్తున్నాం. పెన్షన్ల సంఖ్య మొత్తం 64 లక్షల 27వేలకు చేరుకుంది. గత ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్ ప్రస్తుతం రూ.2750కి చేరింది. జగనన్న చేదోడు ద్వారా 43,131 మందికి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఇంటింటా ప్రతీ ఒక్కరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మనది. ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేసే బాధ్యత నాది. దాన్ని నిలబెట్టుకుంటూ వివిధ కారణాల వల్ల పథకాలు అందుకోలేకపోయిన వారికి లబ్ధి చేకూరుస్తున్నాం’ అని వైయస్ జగన్ స్పష్టం చేశారు. తన ఐదేళ్ల పదవీ కాలంలో అదే విధానాన్ని చిత్తశుద్ధితో అమలు చేసిన ఘనత వైయస్ జగన్ మోహన్‌రెడ్డికే దక్కుతుందని పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దగాకోరు @ చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడుపల్లిలో ఈ నెల 1వ తేదీ చంద్రబాబు ఏమన్నారంటే.. ‘వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పనులు చేయకూడదు’.. అని ఆదేశించారు. అంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఆయన చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి పూర్తి విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. సీఎంగా రాజ్యాంగబద్ధమైన తన బాధ్యతలను ఉల్లంఘించి పక్షపాత నాయకుడిగా ఘనతకెక్కారు. పదవీ స్వీకరణ ప్రమాణం ఇలా.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’.. అని ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తారు. ఆయనతో ఆ విధంగా పదవీ స్వీకార ప్రమాణాన్ని గవర్నర్ చేయించిన తరువాతే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ ప్రమాణానికి కట్టుబడి పాలించే వారే నిజమైన నాయకులు అవుతారు. ఆ కోవకు చెందిన వారే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.