వాలంటీర్లకు వందనం..!

గాంధీజీ కలలు కన్న రాజ్యాన్ని చూడాలంటే ఆంధ్రప్రదేశ్‌కు రండి.   'గ్రామ స్వరాజ్యమే' లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పాలనను చూడండి. భారత దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు , అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర అధికారులు ఏపీలోని వాలంటీర్, గ్రామ పంచాయతీ వ్యవస్థపై అధ్యయనం చేసి శభాష్ అన్నారు.  తెలంగాణ రాష్ట్రం కూడా గ్రామ పంచాయతీ, వాలంటీర్ వ్యవస్థపై అధ్యయనానికి ఒక కమిటీని పంపాలని నిర్ణయించింది. "గ్రామంలోనే అన్నీ" అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుంది. 'గ్రామ స్వరాజ్య 'నినాదం స్వాతంత్ర్య వచ్చినప్పటి నుంచి పుస్తకాలకు,  నినాదాలకే పరిమితమైంది. 'గ్రామ స్వరాజ్యం' నినాదంలోని లోతును, అర్ధంపరమార్ధం గ్రహించి అమలు దిశగా అడుగులు వేస్తున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. ఆ గ్రామ స్వరాజ్య సైనికులుకైనా వాలంటీర్లను గుర్తించి వారికి సత్కారం చేయడం సీఎం వైఎస్‌ జగన్‌లోని గొప్ప మనసును కళ్లకు కడుతుంది.

ఎన్నికల హామీలు నీళ్ల మూటలయ్యే కాలమిది. కానీ..ఎన్నికల హామీ అంటే ప్రజలకిచ్చిన ప్రమాణంగా భావించి ముందుకెళ్తున్నారు సీఎం జగన్‌. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ఎన్నికలను ఎదుర్కొన్న వైఎస్ జగన్‌ , అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులు వేశారు.  అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆగస్ట్ 15, 2019న  వాలంటీర్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టారు.  గ్రామీణ, అర్బన్‌లో కలిపి 2 లక్షల 66వేల 092 మంది వాలంటీర్లను నియమించారు. దేశ చరిత్రలో ఇదో రికార్ట్. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం అన్నది దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడు జరగలేదు.  2లక్షల 66వేల 092 మందిలో 2లక్షల 17 వేల 650 మంది వాలంటీర్లకు అవార్డులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వారి సేవలు ప్రాతిపదికగా అవార్డులు ఇవ్వనున్నారు.

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఒక సంచలనం. వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశాయి. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు "గోతాలు మోసే ఉద్యోగమంటూ" హేళన చేశారు. "మగాళ్లు లేనప్పుడు తలుపులు కొడతారంటూ" ఎద్దేవా చేశారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో తన స్థాయిని మరిచి "వాలంటీర్ల అంతూ చూస్తా" అంటూ బెదిరిస్తున్నారు. ప్రతిపక్షాలు బెదిరించినా వాలంటీర్లు మాత్రం తమ విధి నిర్వహణలో వెనకడుగు వేయడం లేదు. కరోనా సమయంలో వాలంటీర్లు సైనికుల వలే పని చేశారు. గ్రామాల్లోకి , పట్టణాల్లోకి  కొత్త వారు వస్తే గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్‌లో ఉన్నవారి బాగోగులు చూసుకున్నారు. కరోనా సోకినవారికి నైతిక ధైర్యమిస్తూ అండగా ఉన్నారు. కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం కేంద్రం ప్రశంసలు అందుకుందంటే వాలంటీర్ల ఎనలేని సేవలే కారణం.

ప్రతినెలా సూర్యుడు ఉదయించక ముందే అవ్వాతాతలకు వాలంటీర్లు పింఛన్ అందిస్తున్నారు.  పొలాల్లో ఉంటే పొలం వెళ్లి పించన్ ఇస్తున్నారు. ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో ఉంటే ఆస్పత్రికి వెళ్లి పింఛన్ ఇస్తున్నారు. ఆరోగ్యం  బాగాలేకపోతే భుజాల మీద మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. ఆధార కార్డ్ ఆధారంగా పలు సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందజేయడంలో వాలంటీర్ల పాత్రను ఎంత పొగిడినా తక్కువే. గ్రామాల్లో వృద్ధులు, రైతులు, అక్షరం తెలియనివారికి వాలంటీర్‌ వ్యవస్థ దిక్సూచిగా పని చేస్తుంది. వాలంటీర్ ముఖం చూడకుండా, మాట్లాడకుండా, వాలంటీర్‌కు తమ సమస్యలు చెప్పుకోకుండా గ్రామస్తులు   ఉండలేకపోతున్నారు.  ప్రభుత్వ పథకాల గురించి తెలియక పోయినా, పథకాలు అందక పోయినా వాలంటీర్ల దగ్గరకు గ్రామస్తులు పరుగులు పెడుతున్నారు. 

23 నెలల పాలన కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించింది .  లక్ష కోట్ల రూపాయలు లబ్దిదారులను గుర్తించి, డబ్బులు పంపీణి చేయడంలో వాలంటీర్లది కీలక పాత్ర.  గ్రామ సచివాలయాల కేంద్రంగా మరింత మెరుగైన సేవలు అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది. లబ్దిదారులకు 48 గంటల్లోనే సేవలు అందేలా జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్‌ క్లినిక్‌లు, ఇళ్ల పట్టాల పంపిణీలో వాలంటీర్లు విశ్రమించకుండా పని చేస్తున్నారు.

2014 -19 మధ్య చంద్రబాబు పాలనలో గ్రామానికి రెండు, మూడు బెల్ట్ షాపులు ఉండేది. తెలుగు దేశం కార్యకర్తలు దగ్గరుండి సామాన్యుల జేబులకు చిల్లుపడేలా  తాగించేవారు. కానీ..సీఎంగా వైఎస్ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక్క సంతకంతో బెల్ట్ షాపులు ఎత్తేశారు. బెల్ట్ షాపులు ఎత్తివేతలో కూడా వాలంటీర్లు పోలీసులకు సహకరించి కీలక పాత్ర పోషించారు. 

వాలంటీర్ల సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారు సంకల్పించారు. వాలంటీర్లను సన్మానించి , నగదు పారితోషికం ఇవ్వాలనే నిర్ణయం అద్భుతం. వాలంటీర్లను మూడు రకాలుగా సన్మానించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మొదటి కేటగిరి 

ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏడాదికిపైగా సేవలు అందించిన వాలంటీర్లను  'సేవ మిత్రా' అవార్డ్ తో సత్కరించనున్నారు.  వీరికి రూ.10వేల నగదు బహుమతితోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్‌ బహుకరిస్తారు.

రెండో కేటగిరి
ఇంటింటి సర్వే, పింఛన్లు, డోర్ డెలివరీ, ఆరోగ్య శ్రీ కార్డ్‌లు తదితర కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రతి మండలం,  ప్రతి మునిసిపాలిటీ , ప్రతి నగర పాలక పరిధిలో పదేసీ మంది చొప్పున వాలంటీర్లను గుర్తించి 'సేవా రత్న' అవార్డ్‌తో సత్కరించనున్నారు.  వీరికి రూ.20వేల నగదుతోపాటు  సిల్వర్ మెడల్,  సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ బహుకరిస్తారు.

మూడో కేటగిరి 
తమకు కేటాయించిన  50 కుటుంబాలకు బాగా చేరవై అత్యుత్తమ సేవలు అందించిన వారికి ' సేవా వజ్ర'అవార్డ్ ఇవ్వనున్నారు.  వీరికి రూ.30వేలు చొప్పున నగదు ఇస్తారు.  గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జీ బహుకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 875 మందిని 'వజ్ర రత్న'లగా ఎంపిక చేశారు. 

మూడు కేటగిరిలకు ఎంపిక కాని వాలంటీర్లకు కూడా బ్యాడ్జ్‌లు బహుకరించనున్నట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 12 న ప్రారంభమై ఏప్రిల్ 28వరకు వాలంటీర్లకు సత్కార కార్యక్రమాలు జరుగుతాయి.

వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చయబోతుంది. ముఖ్యంగా గ్రామాలు దిశను వాలంటీర్ వ్యవస్థ మార్చేయబోతుంది. గ్రామ సచివాలయాలను ప్రజల దగ్గరకు తీసుకుబోవడంలో  వాలంటీర్లు పాత్ర మరువలేనిది. అందుకే..కెనడా, యూకేలు కూడా వాలంటీర్ వ్యవస్థను తమ దేశంలో  ప్రవేశ పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.కెనడా, యూకేలే కాదు రాబోయే రోజుల్లో  చాలా దేశాలు తమ ప్రతినిధులను ఏపీ పంపించి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల పని తీరుపై నివేదికలు తెప్పించుకోనున్నాయి. 

 బాపూజీ  మాటలను రాజ్యాంగానికే పరిమితం చేసిన పాలకులను ఇప్పటి వరకు చూశాం. కానీ..ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గాంధీజీ మాటలను పాలనలో భాగం చేయడం చూస్తున్నాం. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ దేశానికే కాదు, ప్రపంచానికే పాలనలో పాఠాలు నేర్పుతుంది అనడంలో సందేహం లేదు.
 

Back to Top