ఎన్టీఆర్‌ మాటలను గుర్తుచేసుకునే అర్హత టీడీపీకి లేనే లేదు!

అమ‌రావ‌తి: అధికారంలో ఉన్నవాళ్లు సమాజాన్నిమోసగించే విషయంపై నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు చెప్పిన మాటలను ఆ  పార్టీ నేడు గుర్తు చేసుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తక్కువ కాలంలో ఎన్టీఆర్‌ రాజకీయాలను అవగాహన చేసుకున్నారంటూ ఆ ప్రజానాయకుడికి ఈ దివాళాకోరు పార్టీ ప్రశంసాపత్రం ఇవ్వడం కూడా తెలుగువారికి మింగుడుపడని విషయం. పార్టీ స్థాపించిన  రెండన్నరేళ్ళలోపే 1984 ఆగస్టు–సెప్టెంబర్‌లో  మొదటి వెన్నుపోటును తన ఆర్థిక మంత్రి నుంచి రామారావు ఎదుర్కొన్నారు. కానీ ప్రజల అభిమానంతో దానిని తిప్పికొట్టగలిగారు.
60 ఏళ్లు నిండుతున్న సమయంలో 1982లో సొంత పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ మరో 11 ఏళ్లకే రెండో బలమైన వెన్నుపోటుకు బలైపోయారు. అధికారంతోపాటు ఆరోగ్యం కోల్పోయారు. సొంత అల్లుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన 1995 ఆగస్టు తిరుగుబాటు విజయవంతమైంది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 14 ఏళ్లలోనే  రామారావు రెండు తిరుగుబాట్లను ఎదర్కొనడంతో ఆయనకు ఈ కొద్ది కాలంలోనే 50 ఏళ్ల రాజకీయానుభవం వచ్చేసింది.
తన మొదటి ఆర్థిక మంత్రి, ‘కోపైలట్‌’ అర్ధాంతరంగా పొడిచిన వెన్నుపోటును ఎన్టీఆర్‌ తట్టుకుని నిలబడగలిగారు. తన చివరి ఆర్థికమంత్రి అయిన అల్లుడు నారా చంద్రబాబు నాయడు కొట్టిన దెబ్బకు అధికారంతోపాటు చివరికి ప్రాణాలే కోల్పోయారు. ఇలా ఆలస్యంగా పార్టీ పెట్టిన 14 సంవత్సరాల లోపే రాజకీయ జీవితంతోపాటు ఎన్టీఆర్‌ జీవనయానం కూడా ముగిసింది. కొద్ది కాలంలోనే సాధించిన రాజకీయ అవగాహన ఎన్టీఆర్‌ కు ఉపయోగపడకుండా పోయింది.
 

Back to Top