రాష్ట్ర రహదారులకు మహర్దశ

రహదారుల నిర్మాణాల్లోనూ రివర్స్ టెండరింగ్కు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. దెబ్బతిన్న రహదారుల నిర్మాణానికి తక్షణం రూ.625 కోట్లు వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. 3,100 కి.మీల రహదారుల అభివృద్ధి పనులపై మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు. అమరావతి - అనంతపురం ఎక్స్ప్రెస్వే పనులకు భూసేకరణకు లైన్ క్లియర్ చేసారు. 676 శిథిలమైన వంతెనల స్థానంలో కొత్త వంతెనల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇందుకోసం రూ.6,400 కోట్లు ఖర్చుకానుంది. గత ప్రభుత్వ హయాంలో మూడున్నరేళ్లకు కూడా పూర్తి కాని దుర్గగుడి వంతెనను జనవరికల్లా పూర్తి చేస్తామని అధికారులు సీఎం గారికి తెలిపారు. అత్యుత్తమ ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం, నిర్వాహణ ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా రహదారులు, మండలాలను కలిపే రోడ్లను వేగంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
రహదారుల నిర్మాణమే కాదు ప్రజా రవాణా - సురక్షితమైన ప్రయాణాల విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటున్నారు. 12లక్షల కి.మీకుపైగా తిరిగిన కాలం చెల్లిన 3,600 బస్సులను వెంటనే మార్చాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీఆర్డీసీ బలోపేతం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు 13 జిల్లాల్లో వెయ్యి కిలోమీటర్ల మేర డెమొకారిడార్ల నిర్మాణానికి నివేదిక సిద్ధం చేస్తున్నారు. 2020 నాటికి 15% రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రభుత్వ లక్ష్యం. దీనిపై రెండు నెలల్లోపే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.  ఆ దిశలో డెమోకారిడార్ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. మలుపులు, గుంతలు లేకుండా, అంబులెన్స్ అందుబాటులో ఉండేలా నిర్మించే డెమోకారిడార్ల నిర్మాణం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.  
సౌకర్యవంతమైన, సురక్షితమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. 

 

Read Also:  పవన్‌ సినిమాలు వదిలినా.. యాక్టింగ్‌ వదల్లేదు

Back to Top