అనకాపల్లి జిల్లా : ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార యాత్ర జనం మమేకంతో జైత్రయాత్రగా సాగుతోంది. ఐదో రోజున అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి సాధికార యాత్ర చేరుకుంది. నియోజకవర్గంలోని కోటపాడుకు బస్సు చేరుకోగానే ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్, పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హాజరయ్యారు. మంత్రుల బృందం నియోజకవర్గంలోని కోతపాడులో జగనన్న సురక్ష ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రజలను కలసి సురక్ష కేంద్రంలో అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఏ కోడూరులో నాడు--నేడు పాఠశాల పనులను పరశీలించారు. ఈ సందర్భంగా సాధికార యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జైలు నుంచి వచ్చి నిజాయితీ గెలిచిందని చెప్పుకుంటారా: చంద్రబాబుపై వ్యాఖ్యలపై మంత్రి ధర్మాన ఆగ్రహం మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, జగన్ సీఎం అయ్యాక అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేసారు. సీఎం అయిన తర్వాత తొలుత అందరూ జగన్ కు అవగాహన లేదని విమర్శలు చేసారన్నారు. ఇప్పుడిప్పుడే ఆ సంస్కరణల ఫలితమేమిటో తెలిసి వస్తోందని వివరించారు. జగన్ అమలు చేస్తున్న పథకాల అవసరాన్ని గమనించి చంద్రబాబు కూడా అమలు చేస్తానంటున్నారని హేన చేసారు. మేము ఇస్తున్నవన్నీ చంద్రబాబు ఇస్తానంటున్నాడు.. అవన్నీ ఇప్పుడే జగన్ పాలనలో పొందుతున్న వారు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేస్తారు అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా అని నిలదీసారు. రాష్ఠ్రంలో ఏ ధరలు పెరిగినా అవి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయనేది ప్రజలు గుర్తించాలన్నారు. జైలు నుంచి వచ్చిన బాబుకు నిజాయితీ గెలిచిందని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. 2014లో మహిళలందరూ తనకు ఓటు వేసి గెలిపిస్తే రుణాలన్నీ మాఫీ చేస్తానని మోసం చేసాడని, . తర్వాత మళ్లీ అవకాశం ఇవ్వమని అడిగాడని గుర్తు చేసారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇష్టానుసారంగా హామీలు ఇస్తాడన్నారు. గతంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులకు వెళ్లవారని, ఇప్పుడు పేదల అవసరాలను ప్రభుత్వం తీరుస్తుంటే కోర్టుకు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో చాలా ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలు పెంచలేకపోయాయని, . సీఎం జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనూహ్యంగా జీవన ప్రమాణాలు పెంచారని వివరించారు. . స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా జీవన ప్రమాణాలు పెరగడం జగన్ పాలనలోనే సాధ్యమవుతోందన్నారు. ప్రజల నుంచి వచ్చిన నాయుకుడు జగన్ సమాజంలో అనేక మార్పులు తెచ్చి ప్రతీ కుటుంబానికి గౌరవం తెస్తున్నారని వ్యాఖ్యానించారు. లోకేశ్ వంటి సైకోలు అవగాహన లేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వర్గీయ వైఎస్ ప్రజల కోసం ఒక్క అడుగు వేస్తే, మరో ముందుడుగు జగన్ వేస్తున్నారని వివరించారు. మరో 20 ఏళ్లు ఇలాంటి పాలన సాగితే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిచెంది తిరుగులేని విధంగా సాగుతుందనడంలో సందేహం లేదన్నారు. స్పష్టమైన ఆలోచనలతో ప్రజాస్వామ్యయుతంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం ఆత్మాభిమానం చంపుకోకుండా బ్రతకాలన్నదే జగన్ ఆశయమని గుర్తుచేసారు. 2024 సీఎం జగన్ వన్స్ మోర్: ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ, వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్రలకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అనూహ్య స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేసారు. రైతు కుటుంబంలో పుట్టి సర్పంచ్ నుంచి డిప్యూటీ సీఎంగా ఎదిగిన బూడి ముత్యాల నాయుడే సీఎం జగన్ అమలు చేసిన సామాజిక సాధికారతకు నిదర్శనమని వివరించారు.. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ జరగలేదని గుర్తు చేసారు. రెండు లక్షల ముఫ్పైవేల కోట్లు పేదలకు నేరుగా అందచేసిన ఘనత సీఎం జగన్ దే నని ఉద్ఘాటించారు. 73 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న చంద్రబాబుకు కంటి చూపు పోయిందని లాయర్ చెబితే న్యాయస్థానం అనారోగ్య కారణంతో బెయిల్ ఇస్తే నిజం గెలిచిందని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు నిజాయితీ పరుడువని న్యాయస్థానం చెప్పలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారన్నారు. చంద్రబాబు మనవుడు దేవాన్ష్ కు విదేశాలకు తాత వెళ్లారని చెప్పామన్నారని, మరి విదేశాల నుంచి వచ్చినట్లైతే ఎయిర్ పోర్టుకు తీసుకు వెళ్లాలి కానీ, జైలుకు ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలని గుడివాడ అమర్ నిలదీసారు. చంద్రబాబులా దేవాన్ష్ తయారు కాకూడదన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం ఖాయమని ఉద్ఘాటించారు. . 2024 జగనన్న వన్స్ మోర్. ఖాయం అని అమర్ నాథ్ నినదించారు. ఎవరు మేలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి: ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర డిప్యూటీ సీఎం రాజన్నదొర మాట్లాడుతూ, మన గురించి ఎవరు ఆలోచిస్తున్నారు.. ఎవరు మేలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంతో ఉన్నారంటే సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పరిపాలనే కారణమని ఉద్ఘాటించారు. ఇతర పార్టీలు చెబుతున్న మాటలు నమ్మితే రాబోయే రోజుల్లో కష్టాలు, నష్టాలు చవి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. బలహీవన వర్గాలను గుర్తించి ఉన్నత పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ దే అన్నారు. . నాలుగు లక్షల కోట్లకు పైగా 12 కోట్ల మంది లభ్దిదారులకు జగన్ అందచేసారని వివరించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే రాష్ట్రంలో సీఎం జగన్ కు, మాడుగులలో బూడి ముత్యాల నాయుడుకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని హాయిగా ఉండటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని వివరించారు. పథకాల పేరుతో చంద్రబాబు దొంగల ముఠా దోపిడీ : డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయడు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు పథకాల పేరుతో దోపిడీ చేసాయని విమర్శించారు. సీఎం జగన్ అర్హులైన వారందరినీ గుర్తించి నేరుగా పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేస్తున్నారన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ ఉన్నత పదవులు కట్టబెట్టా రన్నారు. వైఎస్ ఆర్ తర్వాత ఆయన స్ఫూర్తితో ప్రజల కోసం పరిపాలన చేస్తున్న నేత జగన్ మాత్రమేనని కొనియాడారు. చిన్నారుల విద్య కోసం పాఠశాల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి చదవుల వరకు సీఎం జగన్ బాధ్యత తీసుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్జానం అందుబాటులోకి తీసుకువచ్చి చదవిస్తున్నారన్నారు. ఇంగ్లీషు మీడియం పెడతామంటే చంద్రబాబు అలీబాబా దొంగల ముఠా అంతా కలసి హేళన చేసారని,. పేదలుఉన్నత చదవులు చదవకూడదని అడ్డుకునే ప్రయత్నం చేసినా సరే జగన్ వెనుతిరిగి చూడకుండా ఇంగ్లీషు మీడియంను అమలు చేసారన్నారు. స్వర్గీయ వైఎస్ ఆర్ పుణ్యమా అని ఇందిరమ్మ పథకంతో ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలతో పేదల తలరాతలు మారిపోయాయన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దొంగ చంద్రబాబును పోలీసులు పట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టడాన్ని చూసి తమకు గతంలో చేసిన మాయలను, మోసాలను ప్రజలు గుర్తు చేసుకున్నారన్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్టమంతటా ఆనందించిందన్నారు. మాడుగుల వైసీపీకి కంచుకోటగా, క్రమశిక్షణ కలిగిన నియోజకవర్గంగా సీఎం జగన్ దృష్టిలో ఉందన్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ, రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు, జగనన్న సురక్షతో పేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్న సంకల్పంతో జగన్ పని చేస్తున్నారు. వై నాట్ 175 నినాదాన్ని మాడుగుల నుంచి సమర శంఖం పూరించినట్లుగా సీఎం జగన్ కు వినిపించాలని పిలుపునిచ్చారు. మాడుగుల నుంచి వార్ వన్ సైడ్ గా డిసైడ్ చేసి వైసీపీని గెలపించి జగనన్న నినాదాన్ని నిజం చేసి చూపించాలని సత్యవతి నినదించారు.