కైకలూరు.. సామాజిక హోరు

బాబుది సామాజిక మోసం, జగనన్నది సామాజిక న్యాయం: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

దేశంలో సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక సీఎం జగనే: మంత్రి జోగి రమేష్‌

జగనన్న రాకముందు, వచ్చిన తర్వాత.. అనేలా పాలన: మంత్రి విడదల రజని

అణగారిన వర్గాలను రాజ్యసభకు పంపిన ఘనత జగనన్నది: ఎంపీ మోపిదేవి వెంకటరమణ

పేదలను కుటుంబసభ్యులుగా భావించిన సీఎం జగన్‌: ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

 కైకలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర

కైకలూరు: బడుగు, బలహీన వర్గాలు కైకలూరులో కదం తొక్కాయి. రాజ్యాధికారం సాకారం చేసిన జగనన్నను గుండెల్లో పెట్టుకున్నామని.. తలెత్తుకొని జై జగన్‌ అంటూ నినదించాయి. చరిత్రలో చూడని విధంగా సామాజిక సాధికారత చేతల్లో చూపించిన జగనన్నకు కృతజ్ఞతలు తెలిపాయి. కొల్లేరు సరస్సు లాంటి స్వచ్ఛమైన మనసున్న కైకలూరు వాసులంతా వేలాదిగా రోడ్లపైకి తరలి వచ్చి జగనన్న సైన్యానికి ఆత్మీయ స్వాగతం పలికారు. కైకలూరులో సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, విడదల రజని, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. 

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.....

– రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అంటున్న జనం.
– మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా అమలు చేస్తున్న జగనన్న.
– జయమంగళ వెంకటరమణకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తానని మోసం చేసి తన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు.
– అన్యాయం జరిగిన చోట న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ జగనన్న జయమంగళ వెంకటరమణను ఎమ్మెల్సీగా చేశారు. 
– తెలుగుదేశంలో సామాజిక న్యాయం లేదు. కానీ జగనన్న పాలనలో నాలుగున్నరేళ్లుగా సామాజిక న్యాయం వర్ధిల్లుతోంది. 
– నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత జగనన్నది.
– చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పని చేసి ఒక్క బీసీని అయినా రాజ్యసభకు పంపించాడా? బాబుకు మద్దతు పలికే బీసీ నేతలు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు?
– కేబినెట్‌లో సామాజిక న్యాయం చేసి 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన ఘనత జగనన్నది. చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకోవాలి?
– 17 ఎమ్మెల్సీల్లో 14 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. ఇలా చంద్రబాబు ఇచ్చాడా? సామాజిక న్యాయం అంటే ఇదే. 
– పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు అవ్వాలని కోరుకున్న సీఎం జగన్‌. 
– బాబు హయాంలో చదువుల్లో రాష్ట్రానిది 15వ స్థానం. నేడు 3వ స్థానం.
– రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. 
– అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని సీఎం జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నా పచ్చ మీడియా విషం చిమ్ముతోంది.

మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ....

– బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేద అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఒక్కతాటిపైకి వచ్చి జగనన్న పక్షాన ఉన్నామని నిరూపించారు.
– స్వతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని సామాజిక ధర్మాన్ని జగనన్న చేసి చూపాడని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చెబుతున్నారు. 
– 14 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి తాను ఇలా చేశానని చెప్పే ధైర్యం ఉందా? 
– కైకలూరులో జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇచ్చిన జగనన్న.
– మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభలో కూర్చోబెట్టిన ఘనత మన జగనన్నది.
– మంత్రివర్గంలో 17 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే.
– జ్యోతిరావు పూలే, అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ ఆలోచన విధానాలను ఆచరణలో చూపించిన జగనన్న.
– 2014లో ఇచ్చిన మేనిఫెస్టోకి సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల్లో ఓటు అడగాలి.
– 2019 వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన ఘనత జగనన్నది. 

మంత్రి విడదల రజని మాట్లాడుతూ...

– చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించి వాళ్ల కాలనీలు ప్రత్యేకంగా ఉండేవి. అది సామాజిక అంటరానితనం. 
– జగనన్న వచ్చాక అందరికీ కలిపి జగనన్న కాలనీలో ఒకే దగ్గర ఉంచుతున్నారు. ఇది సామాజిక సాధికారత. 
– చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలను చిన్నచూపు చూసి అవహేళనగా మాట్లాడారు. అది పెత్తందారీ వైఖరి. 
– ఈరోజు జగనన్న వచ్చాక అదే బీసీలను అందలాలు ఎక్కించారు. ఇది సామాజిక సాధికారత. 
– మైనార్టీలకు బాబు హయాంలో అవకాశాలు ఇవ్వకుండా ఆత్మగౌరవం దెబ్బతీశారు. అది సామాజిక వివక్ష.
– జగనన్న హయాంలో మైనార్టీలకు ఏకంగా డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇది సామాజిక సాధికారత. 
– గిరిజనులను పట్టించుకోకుండా కొండలకే పరిమితం చేస్తూ మోసం చేసిన చంద్రబాబు. అది సామాజిక వెనుకబాటుతనం. 
– జగనన్న వచ్చాక గిరిజనులకు అన్ని సేవలు, భరోసా దక్కింది. ఇది సామాజిక సాధికారత. 
– బడుగు బలహీన వర్గాలు జగనన్న వచ్చే ముందు, జగనన్న వచ్చాక అని మాట్లాడుకొనేలా పాలన సాగుతోంది. 
– బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల బాగోగుల కోసం డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.4.80 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చారు. 
– ఇందులో 80 శాతానికిపైగా లబ్ధి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకే. 
– సచివాలయ వ్యవస్థ తెచ్చి ఉద్యోగాలిచ్చారు. ఇందులోనూ 80 శాతం ఈ వర్గాలకే. 
– ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా కార్పొరేట్‌ వైద్య సేవలు.
– ప్రభుత్వ సేవలన్నీ ఇంటి వద్దకే వస్తున్నాయి. రేషన్, పెన్షన్‌ ఇంటివద్దే అందుతోంది.
– మనకోసం పరితపిస్తూ ముందుచూపుతో నడుస్తూ, నడిపిస్తున్న జగనన్నకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంతా మద్దతుగా నిలవాలి.

ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ....

– జగనన్న పరిపాలనలో సామాజిక సాధికారత సాధించాం. 
– అంబేద్కర్, జ్యోతిరావు పూలే కన్న కలలను సాకారం చేసిన ఏకైక సీఎం జగనన్న.
– మనం పథకాలు కావాలని అడగలేదు, అమ్మ ఒడి అడగలేదు. సున్నా వడ్డీ, చేయూత, ఆసరా అడగలేదు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా జగనన్న నిర్ణయాలు తీసుకున్నారు. 
– ఒక్కో ఇంటికి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా ఆర్థిక సాయం అందింది. అందుకే తలసరి ఆదాయం గతంకంటే మెరుగైంది. 
– ఓటు బ్యాంకుకే పరిమితమైన వర్గాలకు ప్రభుత్వ పదవులు, నామినేటెడ్‌ పదవుల్లో  అత్యున్నత స్థానం కల్పించిన సీఎం జగన్‌.
– రాజ్యసభ స్థానాలకు అమ్ముకొనే సంస్కృతికి భిన్నంగా అణగారిన వర్గాలకు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది.
– ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సముచిత స్థానం కల్పించిన జగనన్న.
– ఇక్కడ పోస్టల్‌ అడ్రస్‌ కూడా లేని వారు రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారు. 
– టీడీపీ అంపశయ్యపై ఉంది. దాన్ని బతికించాలని పవన్‌ తహతహలాడుతున్నాడు.
– పదవులు వద్దని, చంద్రబాబును సీఎం చేయాలని పరితపించే రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి పవన్‌.

ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ...

– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీల్లోని పేద వర్గాలను తన కుటుంబసభ్యులుగా భావించిన సీఎం జగన్‌.
– రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలన్నింటికీ జగనన్న అండగా ఉండి సంక్షేమ పథకాలు అందించారు. 
– నీతివంతమైన పాలన అందిస్తున్నారు. అవినీతికి తావు లేదు. జన్మభూమి కమిటీలు, దొంగల కమిటీలు ఇప్పుడు లేవు.
– రెండేళ్లు కోవిడ్‌ ఉన్నా ఏ సంక్షేమ పథకాన్నీ ఆపకుండా ప్రజలకు అందించిన ఘనత జగనన్నది.
– పేదవాడి పిల్లల్ని సీఎం జగన్‌ చదివిస్తున్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నారు. 
– కైకలూరులో పేద అక్కచెల్లెమ్మలకు 15 వేల ఇంటి స్థలాలు ఇచ్చారు. 
– నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రూ.746 కోట్లు అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి గారిది. 

తాజా వీడియోలు

Back to Top