అమరావతి: ఫ్యాన్ గాలికి టీడీపీ పునాదులు కదులుతున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో పడుతున్న అడుగులను చూసి చంద్రబాబు పార్టీ నాయకుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ సాక్షిగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆటంకాలు, అవరోధాలు తట్టుకొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు. హత్యాయత్నం జరిగినా.. ప్రజలే తన ప్రాణంగా జననేత పాదయాత్ర చేస్తున్నారు. 2017 నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకుంది. మరో మూడు రోజుల్లో ఈ నెల 9వ తేదీన ప్రజా సంకల్పయాత్ర ఇచ్ఛాపురంలో ముగియనుంది. ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మూడ్రోజుల పాటు సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. వైయస్‌ఆర్ సీపీ సంఘీభావ యాత్రలకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపుకు సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ముందుగా పట్టణంలోని గుంటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తూ బ్రహ్మనాయుడు ముందుకుసాగారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రజలు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని కదిరి వైయస్‌ఆర్ సీసీ ఇన్‌చార్జి సిద్ధారెడ్డి అన్నారు. కదిరిలో వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు సంఘీభావ యాత్ర చేపట్టారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అనంత రైతాంగానికి న్యాయం జరగాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం దారుణమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలకు గిట్టుబాట ధర కరువు. వేరుశనగ, టమాట ధర దిగజారిపోయిందన్నారు. గుంతకల్లులో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పెనుగొండలో శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. బ్రహ్మరథం, కరువు కొరల్లో చిక్కుకున్న అనంతను ఆదుకుంటానని మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయం. ఫ్యాన్ గాలికి టీడీపీ పునాదులు కదలడం ఖాయమని రాప్తాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలంలో ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర చేపట్టారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైయస్ జగన్ సీఎం కావాలని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ కోటి మందికిపైగా కలవడం వారి సమస్యలు వినడం, వారికి భరోసా కల్పించడం. అక్కున చేర్చుకోవడం జరుగుతుందన్నారు. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ అరాచకాలు సృష్టిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో అంబటి ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా ఇనిమెట్లలో వైయస్‌ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ పాదయాత్ర చేస్తుంటే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు, సత్తెనపల్లిలో కోడెల అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. టీడీపీ పాలన నుంచి త్వరలోనే విముక్తి కలుగుతుందన్నారు. నాలుగున్నరేళ్ల పాటు పాలన ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం వంటి వందల హామీలు ఇచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ధనలక్ష్మి, యువజన విభాగం నేత శరత్‌బాబు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. కూనవరం నుంచి భీమవరం, నర్సింగపేట వరకు పాదయాత్ర సాగింది. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. వైయస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.