వైయ‌స్‌ జగన్‌దే జనరంజక పాలన

2024–25 సామాజిక ఆర్థిక సర్వే చెప్పిన సత్యమిదే

చంద్రబాబు పాలనలో ఏడాది తిరగకుండానే ఎన్నో అప్పులు

2023–24 వరకు వాస్తవ బడ్జెట్‌ అప్పు రూ.4.91 లక్షల కోట్లే

2024–25 నాటికి రూ.5.64 లక్షల కోట్లకు పెరుగుదల 

జీఎస్‌డీపీలో 35.15 శాతానికి పెరిగిన అప్పు 

తగ్గిన రాబడి.. పారిశ్రామిక వృద్ధీ లేదు

రెవెన్యూ, ద్రవ్యలోటు, నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుదల 

జగన్‌ హయాంలో తగ్గిన పేదరికం.. మెరుగైన జీవనోపాధి

డీబీటీతో లీకేజీ లేకుండా లబ్ధిదారులకు ఆర్ధిక సాయం

వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో నాడు–నేడు ద్వారా భారీగా మౌలిక సదుపాయాలు కల్పన 

రైతుల కోసమే ‘సెకీ’ విద్యుత్‌ ఒప్పందం 

వ్యవసాయంలో ఆ ఐదేళ్లు గణనీయమైన ప్రగతి

 అమరావతి: వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అప్పులపై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి కూటమి ప్రభుత్వం నిరూపించింది. అంతేకాకుండా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే ఎక్కువ అప్పులు చేసినట్లు కూడా స్పష్టమైంది. 2024–25 సామాజిక ఆర్థిక సర్వేను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. 

ఇందులో కూటమి నాయకులు.. వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం ఉండగా అనేక అంశా­లపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది. మన బడి నాడు–నేడు కింద పాఠశాలల్లో రెండు దశల్లో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గణాంకాలతో సహా సామాజిక ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా అనేక పథకాల లబ్ధిదా­రులకు ఆర్థిక సాయం అందించడంతో లీకేజీ లేకుండా వారికి ప్రయోజనం అంది.. జీవనోపాధి మెరుగైందని,  పేదరిక శాతం తగ్గిందని స్పష్టమైంది.

జగన్‌ హయాంలోనే పేదరిక నిర్మూలన..
పేదరిక నిర్మూలనకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేసింది. సంక్షేమ, వైద్య, ఆరోగ్య పథకాలు, ఉపాధి అవకాశాల, సామా­జిక భద్రత, సాధికారత కార్యక్రమాల లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీతో గ్రామీణ పేదలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు లీకేజీలు, మధ్యవ­ర్తుల ప్రమేయం లేకుండా సకాలంలో సాయం అందింది. 

కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు పేదరికం తగ్గడానికి దోహదపడ్డాయి. పేదరిక నిర్మూలనలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ మెరుగైన పనితీరు కనబ­రిచింది. నీతి ఆయోగ్‌ 2023లో విడుదల చేసిన బహుళ పేదరిక సూచికల్లో ఏపీలో పేదరికం 50 శాతం తగ్గింది. 2015–16 నాటి ఈ స్కోరు 0.053 ఉండగా, 2019–21లో 0.025కు తగ్గింది.

2023–24 సుస్ధిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ సరసమైన స్వచ్ఛ­మైన ఇంధనం అందించడంలో 1వ స్థానంలో ఉందని, స్థిరమైన అభివృద్ధి కోసం నీటి వనరులను సంరక్షించడం, స్థిరంగా ఉప­యోగించడంలో రెండో ర్యాంకు, పేదరిక నిర్మూ­లనలో మూడో ర్యాంకు, ఉత్పత్తుల బాధ్యతాయుత వినియోగంలో నాలుగో ర్యాంకులో ఉంది.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కంటే కూటమి సర్కారు ఏడాది పాలనలోనే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు భారీగా పెరిగాయి. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాం కన్నా కూటమి పాలనలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు భారీగా తగ్గిపోయాయి.

కూటమి ప్రభుత్వంలో గనుల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 2023ృ24లో రూ.3,425 కోట్లు రాబడి వస్తే 2024ృ25లో అది రూ.2,031 కోట్లే.  

కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధి అంతకు­ముందు ఆర్థిక ఏడాది కన్నా తగ్గింది. 2023ృ24లో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక వృద్ధి 7.42 శాతం ఉండగా, 2024ృ25లో 6.71 శాతానికే పరిమితమైంది.

2023ృ24 ఆర్థిక సంవత్సరం వరకు వాస్తవ బడ్జెట్‌ గణాంకాల ప్రకారం జీఎస్‌డీపీలో 34.58 శాతం అప్పులు. 2024ృ25లో సవ­రించిన అంచనాల మేరకు కూటమి ప్రభుత్వం జీఎస్‌డీపీలో 35.15 శాతం అప్పులు చేసింది.

ఇవిగో సాక్ష్యాలు..
పేదరిక నిర్మూలన:  జగన్‌ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలుచేసింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రత్యక్ష నగదు బదిలీ జరిగింది. ఇతర రాష్ట్రాలకన్నా పేదరికం 50శాతం తగ్గింది.

బడుల రూపురేఖలు మారాయి: 15,713 పాఠశాలల్లో రెండు దశల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించింది.
రైతులకు స్వర్ణయుగం: 10,778 ఆర్బీకేల ఏర్పాటు వినూత్న ప్రయోగం.. అవి అందించిన సేవలు రైతులకు బాగా ఉపకరించాయి. పంటల దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గ్యాప్‌ సర్టిఫికేషన్‌తో రైతులకు ఎమ్మెస్పీకి మించి ఆదాయం లభించింది. ప్రకృతి వ్యవసాయం కూడా గణనీయంగా పెరిగింది..
సెకీ విద్యుత్‌ రైతుల కోసమే: రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ కోసమే గత ప్రభుత్వం సెకీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఏపీఈఆర్‌సీ అనుమతించింది.

అప్పులే కూటమి ఘనత.. నింగిలో నిత్యావసరాలు: కూటమి సర్కార్‌ ఏడాది తిరక్కుండా రూ. 53వేల కోట్ల బడ్జెట్‌ అప్పులు చేసింది.. (బడ్జెటేతర అప్పులతో కలిపితో1.25 లక్షల కోట్లకు పైమాటే..) ద్రవ్యలోటు, రెవెన్యూలోటు భారీగా పెరిగింది.. 
రాబడి బాగా తగ్గింది.  పారిశ్రామికాభివృద్ధీ తగ్గింది.. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి.

గత నెల 28న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో మొత్తం అప్పుల చార్ట్‌ను తొలగించారు. అయితే, ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వేలో ఈ ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్‌ అప్పులను పేర్కొన్నారు. దీనిప్రకారం చూస్తే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న అప్పుల కన్నా ఈ ఆర్థిక ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. 

2023-24 వరకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.4,91,734 కోట్లు ఉండగా.. 
2024-25లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులతో అది రూ.5,64,488 కోట్లకు చేరింది.

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఇంగ్లిష్‌ ల్యాబ్, స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీలు, కౌంపౌండ్‌ వాల్‌ సహా తొలి దశలో 15,713 పాఠశాలల్లో రూ.3,859.12 కోట్లతో 9 రకాల నిర్మాణాలను చేపట్టారు.

రెండో దశలో 22,344 పాఠశాలల్లో రూ.8 వేల కోట్లతో 11 రకాల మౌలిక సదుపాయాలను చేపట్టారు. (వీటిని పట్టిక రూపంలో సర్వేలో పేర్కొన్నారు).  

 

ఆ ఐదేళ్లూ గణనీయ ప్రగతి 

YS Jagan Govt Significant progress in those five years in Andhra Pradesh

సీహెచ్‌సీల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం

రికార్డు స్థాయిలో 2019–20లో 175 లక్షల టన్నుల దిగుబడులు

విత్తు నుంచి పంట విక్రయం వరకు.. ప్రకృతి సాగుకు ప్రోత్సాహం మొదలు యాంత్రీకరణ వరకు.. కౌలు చట్టం నుంచి మద్దతు ధర వరకు.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2019–24 మధ్య కాలం స్వర్ణయుగం అని తేలింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా రాష్ట్రం గణనీయ పురోగతి సాధించిందని టీడీపీ కూటమి సర్కారు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే –2024 స్పష్టం చేసింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సాధించిన పురోగతిని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. అందులోని ముఖ్య అంశాలు పరిశీలిస్తే..

⇒ 2018–19లో 150 లక్షల టన్నులున్న ఆహార పంటల దిగుబడులు 2019లో రికార్డు స్థాయిలో 175 లక్షల టన్నులకు పెరిగాయి. 2019–24 మధ్య సగటున 161.20 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి.

⇒ ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 45.59 లక్షల ఎకరాలకు పెర­గగా,  2023–24లో రికార్డు స్థాయిలో 365.92 లక్షల టన్ను­లు దిగుబడులు వచ్చాయి. నేషనల్‌ ఆయిల్‌ పామ్‌ మిషన్‌­లో 2023–24లో రికార్డు స్థాయిలో 2.27 లక్షల హెక్టార్లలో సాగు ద్వారా 17.63 లక్షల టన్నుల దిగుబడులు నమోదైంది.

⇒ 2023–24లో 2548.74 లక్షల గుడ్ల ఉత్పత్తితో ఏపీ నంబర్‌ వన్‌గా నిలవగా, మాంసం (10.68 లక్షల టన్నులు) ఉత్పత్తిలో ఐదో, పాల (139.94 లక్షల టన్నులు) ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది.

⇒ గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ద్వారా రైతులకు మార్కెట్‌ ధరకు మించి ఆదాయం వచ్చింది. ప్రకృతి సాగుదారులు 4 లక్షల నుంచి 9.53 లక్షలకు పెరిగారు.

ఆర్బీకేలు నిజంగా ఓ వినూత్నం
రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) నిజంగా ఓ వినూత్న ప్రయోగమని ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారు.
⇒ విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు చేదోడుగా నిలిచేందుకు ఒకేసారి 10,778 ఆర్‌బీకేలతో ఈ వ్యవస్థ ఏర్పాటైందని చెప్పుకొచ్చారు. 

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుగ్రాసం, సంపూర్ణ మిశ్రమ దాణా, ఆక్వా ఫీడ్‌ వంటి సాగు ఉత్పాదకాలను గ్రామ స్థాయిలో రైతులు కోరిన 24 గంటల్లో వారి ముంగిట అందించడం, ఆధునిక సాగు విధానాలు, సలహాలు, సూచనలు అందిస్తూ అగ్రి ఇన్‌పుట్‌ షాపులుగా, ఫార్మర్‌ నాలెడ్జ్‌ సెంటర్స్‌గా రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. 

నియోజకవర్గ స్థాయిలో అగ్రి ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్స్, ఆక్వా, వెటర్నరీ ల్యాబ్స్‌ ఏర్పాటుతో నాణ్యమైన సాగు ఉత్పత్తుల పంపిణీ సులభతరమైంది. –రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా.. మార్కెట్‌లో ధర లేని సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేసింది.

ఏఐఎఫ్‌ ద్వారా మౌలిక వసతులు
⇒ వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి (ఏఐఎఫ్‌) ద్వారా 2022–24 మధ్య గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా రూ.16 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. 

⇒ పీఏసీఎస్‌లను బహుళ ప్రయోజిత సదుపాయాల కేంద్రాలు (ఎంపీఎఫ్‌సీ)గా తీర్చిదిద్దారు.  రూ.736 కోట్లతో 695 గోదాముల నిర్మాణం ద్వారా 3.98 లక్షల టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. 

⇒ రికార్డు స్థాయిలో 2,037 పీఏసీఎస్‌ల డిజిటలైజేషన్‌తో పాటు 207 పీఏసీఎస్‌లను ఎఫ్‌పీవోలుగా అభివృద్ధి చేశారు. ఈ–­పీఏసీ­ఏస్‌లుగా మార్పుతో ఆన్‌లైన్‌ లావాదేవీలకు మార్గం సుల­భ­తరమైంది. జన ఔషధ కేంద్రాలు, పెట్రోల్‌ బంకులు, కా­మన్‌ సర్వీస్‌ సెంటర్లుగా పీఏసీఏస్‌లను తీర్చిదిద్దారు. రిజి­స్ట్రార్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీస్‌ను కంప్యూటరైజ్‌ చేశారు.

⇒ చేపల ఉత్పత్తిలో 31 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 30 శాతంతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్థానిక వినియోగం పెంచేందుకు డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ ద్వారా ఫిష్‌ ఆంధ్రకు బ్రాండింగ్‌ తీసుకొచ్చింది. అప్సడా, ఏపీ ఫిష్‌ సీడ్, ఫీడ్‌ యాక్ట్‌లతో పాటు ఏపీ బొవైన్‌ బ్రీడింగ్‌ రెగ్యులేషన్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇన్‌సెమినేషన్‌ సర్వీస్‌ యాక్ట్, భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా పంట సాగు హక్కుదారుల చట్టం వంటి సంస్కరణలకు నాంది పలికింది.

కూటమి కనికట్టు
కూటమి ప్రభుత్వం వచ్చాక 2024–25లో వ్యవసాయ యాంత్రీకరణ కింద ఒక్క పరికరం కూడా పంపిణీ చేసిన పాపాన పోలేదు. కానీ, ఈ ఏడాది ఏకంగా రూ.75.80 కోట్ల సబ్సిడీతో 42,864 మంది రైతులకు వ్యక్తిగత పరికరాలు ఇచ్చినట్టుగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. 

80 శాతం సబ్సిడీపై 875 కిసాన్‌ డ్రోన్స్‌ ఇచ్చేసినట్టుగానూ ప్రస్తావించారు. కాగా, ఇదే రిపోర్టులో 2021–24 మధ్య ఆర్బీకేలకు అనుసంధానంగా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణను గత ప్రభుత్వం ప్రోత్సహించిందని కొనియాడడం గమనార్హం.  

రైతుల కోసమే 'సెకీ' విద్యుత్‌

SECI Solar Power Agreement For Only Farmers benefits

7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు డిస్కంలు అనుమతి కోరాయి

వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ కోసమే ఈ ఒప్పందం

ఇందుకోసం ఏపీ గ్రామీణ వ్యవసాయ విద్యుత్‌ సరఫరా సంస్థ పేరుతో ప్రత్యేక నోడల్‌ ఏజెన్సీ

ఆర్థిక సర్వే–2024, వనరుల ప్రణాళికలో అంగీకరించిన కూటమి ప్రభుత్వం

ఇన్నాళ్లూ ఇదే ఒప్పందంపై చంద్రబాబు, పచ్చ మీడియా తప్పుడు ప్రచారం  

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఏపీఈఆర్‌సీ) ఇటీవల ఆమోదించిన డిస్కంల ఆదాయ, అవసరాల నివేదికలో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు అనుమతించింది. ఆ సందర్భంలోనే సెకీ ఒప్పందంపై ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించి, ఒప్పందాన్ని రద్దు చేసేందుకు తగిన కారణాలేమీ కనిపించడం లేదంటూ స్పష్టం చేసింది. దీంతో సెకీ ఒప్పందంపై కూటమి చేస్తున్న విమర్శలు, కరపత్రం రాసుకొచ్చిన కథనాలు అసత్యాలని తేలిపోయింది. 

తాజాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే–2024 కూడా సెకీ ఒప్పందం గురించి మరింత స్పష్టత ఇచ్చింది. ‘వనరుల ప్రణాళిక’లో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అంగీకరించింది. 2024–25 నుంచి 2028–29 వరకు (5వ నియంత్రణ కాలం), 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకు ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు సమర్పించిన విద్యుత్‌ వనరుల ప్రణాళికకు 2023 జూన్‌లో ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ ఏ విధంగా వస్తుందనే వివరాలున్న వీటిలో ‘సెకీ’తో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఒప్పందం కూడా ఉంది.

అవే భవిష్యత్తుకు భరోసా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 డిసెంబరులో విజయవాడ సమీపంలోని నార్ల తాతా­రావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీటీపీ­ఎస్‌)లో 800 మెగావాట్ల (స్టేజ్‌–5) యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభించిందని కూటమి సర్కారు తెలిపింది. ఈ కేంద్రం నుంచి 25 ఏళ్ల పాటు వంద శాతం విద్యుత్‌ కొనుగోలుకు ఏపీజెన్‌కో 2022 అక్టోబరులో ఒప్పందం కుదర్చుకుందని పేర్కొంది. 

ఇదికూడా వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వంలోనే జరిగింద్ధి. ఏపీ పంప్డ్‌ స్టోరేజ్‌ (పీఎస్పీ) ప్రమోషన్‌ పాలసీ–2022 ద్వారా రాష్ట్రంలో 29 ప్రదేశాల్లో 33,240 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు టెక్నో–కమర్షియల్‌ ఫీజిబులిటీ రిపోర్ట్స్‌ సిద్ధం చేసినట్లు ఆర్థిక సర్వే సాక్షిగా తేటతె­ల్లమైంది. ఇది గత ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు నిదర్శనం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక పీఎం సూర్యఘర్‌ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటోంది. 

ఆచరణలో మాత్రం పురోగతి సాధించడం లేదని సర్వే తేల్చి­చెప్పింది. ఈ పథ­కానికి 3 డిస్కంలలో కలిపి 16,35,672 మంది చేత రిజిస్టర్‌ చేయించారు. వారిలో 9,79,665 మంది చేత దరఖాస్తులు పెట్టించారు. కేవలం 10,278 మందికే రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టమ్‌ అమర్చారు. 

పథకం అట్టర్‌ ఫ్లాప్‌ అని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. కేవలం గత ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన విద్యుత్‌ రంగ ప్రగతిని తమదిగా చెప్పుకొనే ప్రయత్నం మినహా ఆర్థిక సర్వే –2024లో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనేందుకు ఏమీ లేకపోవడం విశేషం.

‘సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెకీ)తో 7వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాను కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వ్యవసాయ విద్యుత్తు సరఫరా సంస్థ (ఏపీఆర్‌ఏపీఎస్‌సీవోఎం) పేరుతో ప్రత్యేక నోడల్‌ ఏజెన్సీని ప్రభుత్వం నియమించింది. 

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీఐ) మాన్యుఫ్యాక్చరింగ్‌ లింక్డ్‌ స్కీమ్‌ నుంచి 7 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ కొనుగోలు కోసం రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కం) అనుమతి కోరాయి. దానికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించింది’
– ఏపీ సామాజిక ఆర్థిక సర్వేలో కూటమి ప్రభుత్వం  

Back to Top