అమరావతి: అవినీతి నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, తవ్వకం, నిల్వ, పంపిణీలో పారదర్శకత, అందుబాటులో కావాల్సినంత ఇసుక, సరసమైన ధరలే లక్ష్యంగా కొత్త ఇసుక విధానం ప్రభుత్వం తీసుకువచ్చింది. కాంట్రాక్టరు ఎంపిక కోసం పారదర్శక విధానాన్ని పాటించారు. ఇసుక తవ్వకం, నిల్వ, పంపిణీల కోసం కాంట్రాక్టర్ ను గుర్తించే పనిని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎం.ఎస్.టి.సి.కి అప్పగించారు. ఇందులో భాగంగా అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు బిడ్డింగ్ ప్రక్రియలో నైపుణ్యం, సమర్ధత, సాంకేతికత, ఆపరేషన్స్లో అపార అనుభవం, నైపుణ్యం ఉన్న సంస్థలు పాల్గొనేలా బిడ్ సెక్యూరిటీగా రూ.120 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల సాంకేతిక సమర్థతలను ఎం.ఎస్.టి.సి పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఆర్థిక బిడ్లను ఆహ్వానించింది. పోటీలో ఎక్కుమంది పాల్గొనేందుకు వీలుగా స్వీకరణకు గడువును కూడా పెంచారు. అన్ని ప్రముఖ దినపత్రికల్లో టెండర్ల ప్రకటనలు ఇవ్వడం ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. బిడ్ల దాఖలులో సంకోచాలు, భయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు ఆన్లైన్ పద్ధతిలో టెండర్లు స్వీకరించడమైంది. పోటీగా పలు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. తద్వారా బిడ్డింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడమైంది. ఈ ప్రక్రియలో జేపీ గ్రూపునకు చెందిన జయ్ ప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థను ఎం.ఎస్.టి.సి. ఎంపిక చేసింది. ఇసుకను నిర్వహించే కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.120 కోట్ల | రూపాయల ఫెర్మార్మన్స్ గ్యారంటీ(బ్యాంకు గ్యారంటీ)ని కూడా స్వీకరించారు. ఈ సంస్థ ప్రతి 15రోజులకు ఒకసారి, ముందస్తుగానే తదుపరి 15 రోజులకు సంబంధించి డబ్బును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది జరిగిన ఇసుక తవ్వకాలు సుమారు 1.6 కోట్ల మెట్రిక్ టన్నులుపైనే కాగా, తాజా ఇసుక విధానం ద్వారా ఏడాదిలో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు, సరఫరాను కనీస లక్ష్యంగా కాంట్రాక్టు సంస్థకు నిర్ణయించడమైంది. దీనివల్ల కొరత లేకుండా విరివిగా వినియోగదారులకు ఇసుక అందుబాటులో ఉంటుంది. ఆన్లైనా ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాల్సిన అవసరంలేదు. సర్వర్లు మొరాయించడం, నెట్‌వర్క్ సమస్యలు, ఉద్దేశ పూర్వకంగా ఇసుకను బ్లాక్ చేయడం, కృత్రిమ కొరతను సృష్టించడం లాంటి అక్రమాలకు చెక్ పడుతుంది. ఎక్కడ ఇసుక దొరుకుతుందనే ఇబ్బందులు అవసరం లేదు. నేరుగా రీచ్ వద్దకు వెళ్లి, నాణ్యతను స్వయంగా పరిశీలించి ఇసుకను కొనుక్కోవచ్చు. నచ్చిన వాహనాన్ని తీసుకెళ్లి.. డబ్బు చెల్లించి రశీదు పొంది ఇసుక తెచ్చుకోవచ్చు. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. వినియోగదారుడికి వాహనం అందుబాటులో లేకపోతే రీచ్ లవద్దే కాంట్రాక్టు సంస్థ స్టాండ్ బైగా వాహనాలను ఇసుకను తీసుకెళ్లొచ్చు ఉంచుతుంది. వాటి ద్వారా ఇసుకను తీసుకెళ్లవచ్చు. తాజా ఇసుక విధానం ప్రకారం మెట్రిక్ టన్నుకు రూ.475 లు చెల్లిస్తే చాలు. ఎంత కావాలంటే అంత ఇసుకను తెచ్చుకోవచ్చు. ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీల ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఇసుక వ్యాపారి అయినా కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధిక ధరకు విక్రయించే వీలు లేదు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా రవాణా ఖర్చులతో కలిపి ప్రభుత్వం ధరలు నిర్ణయించి ప్రకటిస్తుంది ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కన్నా అధిక ధరకు ఎవరైనా విక్రయిస్తే వెంటనే 14500 కాల్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఇసుక అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఇసుక రీచ్ వద్ద మెట్రిక్ టన్నుకు రూ.475లు చెల్లించగానే అందులో రూ.375లు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది రూ. మిగిలిన రూ.100లు నిర్వహణ ఖర్చులు కింద కాంట్రాక్టర్‌కు చెందుతాయి. ఏడాదికి కాంట్రాక్టు సంస్థకు నిర్ణయించిన ఇసుక సరఫరా లక్ష్యం 2 కోట్ల మెట్రిక్ టన్నులు. టన్నుకు రూ. 475 చొప్పున మొత్తం విలువ రూ.950 కోట్లు. ఇందులో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సింది. రూ.765 కోట్లు. మిగిలిన సొమ్ము యంత్రాలు, పరికరాలు, పంపిణీ కింద నిర్వహణా ఖర్చులు కింద కాంట్రాక్టు సంస్థకు వెళ్తాయి. మొత్తం విలువ రూ.950 కోట్లు. అయితే, ఇందులో రూ.2 వేల కోట్ల అవినీతికి ఆస్కారం ఎక్కడ నుంచి వచ్చింది. నదుల పక్కనే ఉన్న గ్రామాల్లో సొంత అవసరాల కోసం ఎడ్లబళ్ల ద్వారా ఇసుకను తెచ్చుకునే అవకాశం ఉంటుంది గ్రామ సచివాలయాలద్వారా కూపన్లు తీసుకుని వీరు ఇసుకను పొందవచ్చు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలకు, ఆర్ అండ్ ఆర్ కాలనీలకు, రీచ్లకు సమీపంలో నివసించే వారికి రాయితీపై ఇసుక కొనసాగుతుంది.. వారికి కూపన్ విధానం కొనసాగుతుంది. గతంలో మాదిరిగా అవినీతికి ఆస్కారం ఉండదు. ఉచితం పేరు వందల కోట్లు దోపిడీకి అవకాశం లేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరిగేలా వైయస్ జగన్ సర్కార్ కొత్త విధానం రూపకల్పన చేసింది. నూతన ఇసుక విధానంతో ప్రజలకు కష్టాలు తీరనున్నాయి.