‘నారా’కం నుంచి బ‌య‌ట‌కు

చంద్ర‌బాబు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై సొంత పార్టీలోనే తిరుగుబావుట‌

టీడీపీ నుంచి ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్న ప్ర‌జాప్ర‌తినిధులు

బ‌య‌టప‌డుతున్న చంద్ర‌బాబు భండారం

నిగ్గుతేలుతున్న నిజాలు
 

 ‘నారా’రాజ‌కీయంలో ఎంత అరాచ‌క‌త్వం ఉందో మ‌రింత‌గా బ‌య‌ట‌ప‌డుతోంది. ప్ర‌తిప‌క్షం విమ‌ర్శించ‌డం కాదు, ప్ర‌జ‌లు అనుభ‌వించ‌డం కాదు...ఇప్పుడు స్వ‌యంగా ఆ పార్టీనేత‌లే బ‌య‌ట‌కొచ్చి మ‌రీ నిజాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. ఇక అలాంటి  ‘నారా’క‌ కూపంలో ఉండ‌లేమ‌ని పార్టీనీ, ప‌ద‌వుల‌ను విడిచిపెట్టి వ‌స్తున్నారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేసి, ఆశ‌ల‌ను ద‌గాచేసి, మోసాల‌తో, కుల‌ఝాఢ్యంతో అవినీతిలో కూరుకుపోయిన అధికార టీడీపీకి ఓ న‌మ‌స్కారం పెడుతున్నారు. ప్ర‌తిప‌క్షం నుంచి అధికార‌ప‌క్షంలోకి ప‌ద‌వుల‌ను ఆశించో, ప్ర‌లోభాల‌కు లొంగో వెళ్ల‌డాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని సాధించుకున్న నాయ‌కుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నాస‌రే ఆ నీడ‌కు చేర‌డ‌మే స‌రైన నిర్ణ‌యం అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు. 
లై డిటెక్ట‌ర్ ఉప‌యోగిస్తే
చంద్ర‌బాబు అవ‌కాశ‌వాద‌, కుల రాజ‌కీయాల‌ను చూసి విసుగెత్తిన కొంద‌రు టీడీపీ నేత‌లు ప్ర‌తిపక్ష నేత‌లు త‌మ అధినేత‌తో విబేధించి ప్ర‌తిప‌క్షం వైపు చూస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండీ అన్ని వ‌ర్గాల‌కూ స‌మ‌న్యాయం జ‌ర‌గాల‌ని కోరినా చంద్ర‌బాబు హ‌యాంలో అది ఆశించి భ‌గ‌ప‌డ‌టం త‌ప్ప లాభం ఉండ‌ద‌ని అర్థం చేసుకున్నా అంటున్నారు ఎం.పీ అవంతి శ్రీ‌నివాస్. బాబు సంగ‌తి తానే కాద‌ని త‌మ పార్టీలో ఎవ్వ‌రిని లై డిటెక్ట‌ర్ టెస్ట్ చేసినా ఇలాగే చెబుతార‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారాయ‌న‌. 
కులానికి క‌ట్ట‌బెట్టి
చంద్ర‌బాబు త‌న‌కు కుల‌పిచ్చి లేద‌ని చెప్ప‌డం ప‌చ్చి అబ‌ద్ధం అన్నారు టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆమంచి కృష్ణ మోహ‌న్. ఆయ‌న చుట్టూ ఉన్న అధికారిక కోట‌రీ అంతా సొంత సామాజిక వ‌ర్గం కాదా అని ప్ర‌శ్నించారు. సీఎమ్ పీఎస్ నుంచి మొద‌లు పోలీసు అధికారుల వ‌ర‌కూ అంచెలంచ‌ల్లో క‌మ్మ‌వారిని నియ‌మించుకున్నార‌ని ఆధారాల‌తో స‌హా వివ‌రించారు. ప్రోగ్రామింగ్స్ క‌మిటీ ఛైర్మ‌న్, ఏపీపీఎస్సీ చైర్మ‌న్, సెంట్ర‌ల్ సివిల్ స‌ర్వీసెస్ నుండి డిప్యుటేష‌న్ మీద వ‌చ్చిన ఇర‌వై మంది ఐఎఎస్ ల‌లో 15 మంది బాబుగారి సొంత గూటివాళ్లే. ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ కంటే కులానికి బాబు చేసుకున్న సేవే ఎక్కువ అంటూ సూటిగా చంద్ర‌బాబు నిజ‌స్వ‌రూపాన్ని ఎండ‌గ‌ట్టారు ఆమంచి. 
అబ‌ద్ధాల కోట‌లు బ‌ద్ద‌లు 
చంద్ర‌బాబు ఇంత‌కాలంగా చెబుతున్న అబ‌ద్దాలు, అభివృద్ధి న‌మూనాలు, చూపుతున్న గ్రాఫిక్కుల గురించి ఆ పార్టీను వీడి బ‌య‌ట‌కొచ్చిన నేత‌లు ఇప్పుడు నిర్భ‌యంగా చెబుతున్నారు. ఈ రాష్ట్రానికి జ‌నం మెచ్చిన జ‌గ‌న్ త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని అంటున్నారు. ప్ర‌జ‌లు మెచ్చిన నాయ‌కుడికే పీఠం అని, అది వైఎస్ జ‌గ‌నే అని అంటున్నారీ నేత‌లు.

తాజా ఫోటోలు

Back to Top