లా నేస్తంతో నాలో కాన్ఫిడెన్స్‌ పెరిగింది

జూనియ‌ర్ న్యాయ‌వాది అమూల్య‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ లా నేస్తం పథకం నాకు చాలా ఉపయోగపడింద‌ని, ఈ ప‌థ‌కంతో నాలో కాన్ఫిడెన్స్‌ పెరిగింద‌ని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జూనియ‌ర్ న్యాయ‌వాది అమూల్య పేర్కొన్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ లా నేస్తం – వరుసగా నాలుగో ఏడాది కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో రూ. 1,00,55,000 సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి  సీఎం వైఎస్‌ జగన్ నిధులు జ‌మ చేశారు. ఈ సందర్భంగా వర్చువల్‌గా జూనియర్‌ న్యాయవాదులు మాట్లాడారు.

అమూల్య, లా నేస్తం లబ్ధిదారు, జూనియర్‌ న్యాయవాది, ఎన్‌టీఆర్‌ జిల్లా

నమస్కారం సార్, నేను బెజవాడ బార్‌ అసోసియేషన్‌లో ఏడాది నుంచి జూనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నాను, నేను మంచి క్రిమినల్‌ లాయర్‌ అవ్వాలన్నది లక్ష్యం, మాది మధ్యతరగతి కుటుంబం, మా తల్లిదండ్రులు, చుట్టూ ఉన్నవారంతా మంచి ఉద్యోగం చేసుకోక కోర్టుల చుట్టూ తిరుగుతావు ఎందుకని, మంచి శాలరీ వచ్చే ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటుంటారు, కానీ నా లక్ష్యం చేరుకోవాలనే ఆశయంతో నేను ముందుకెళుతున్నాను, గ్రాడ్యుయేషన్‌ పూర్తవగానే నా పేరెంట్స్‌కు సాయం చేయాలని, నా ఖర్చులకు నేను సంపాదించాలని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో లా నేస్తం పథకం నాకు చాలా ఉపయోగపడింది, దీంతో నాలో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. ఈ స్టైఫండ్‌ ద్వారా నాకు చాలా ఉపయోగపడుతుంది, నా పేరెంట్స్‌ మీద డిపెండ్‌ అవకుండా నా కాళ్ళ మీద నేను నిలబడిగలిగాను అంటే ఈ స్కీమ్‌ కారణం, పాదయాత్రలో మీకు మా సమస్యలు చెప్పగానే మీరు స్కీమ్‌ గురించి చెప్పడం, ఆ తర్వాత ప్రభుత్వంలోకి రాగానే అమలుచేయడంతో మేం చాలా సంతోషంగా ఉన్నాం, ధ్యాంక్యూ సార్‌.

సీహెచ్‌. వెన్నెల, జూనియర్‌ న్యాయవాది, గుంటూరు

సార్, నేను జూనియర్‌ అడ్వకేట్‌ను, మా తల్లి టైలరింగ్‌ చేస్తుంది, మా తండ్రి ప్రేవేట్‌ ఉద్యోగి, నేను 2021 నుంచి లా నేస్తం తీసుకుంటున్నాను, ఈ డబ్బు జ్యూడిషియల్‌ ఎగ్జామ్స్‌ ఫీజు కట్టుకోవడానికి, మెటీరియల్‌ తీసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఉన్నత చదువుల కోసం మీరు ఇస్తున్న సపోర్ట్‌ చాలా ఉపయోగంగా ఉంది. మా అందరి తరపునా మీకు ధన్యవాదాలు. మా కుటుంబానికి చాలా ఆర్ధిక సాయం అందుతుంది, మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా రాష్ట్రంలో అనేకమంది లబ్ధిపొందుతున్నారు, మా అమ్మకు ఇంటి పట్టా వచ్చింది, మీరు చదువుకు చాలా ప్రాధాన్యతనిస్తున్నారు, విద్యార్ధులకు మంచి పథకాలు ప్రవేశపెట్టారు, విదేశాల్లో చదువుకోవడానికి కూడా మీరు సాయం చేస్తున్నారు, పెన్షన్, రేషన్‌ ఇంటి దగ్గరే ఇస్తున్నారు, ఉన్నత ఆలోచనలతో మీరు ముందుకెళుతున్నారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పేద విద్యార్ధులకు ఉచితంగా సాయం చేయాలనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, ధ్యాంక్యూ సార్‌.

Back to Top