రైతన్నలకు వెన్నుదన్నుగా సీఎం వైయ‌స్ జగన్ 

వరుసగా ఐదో ఏడాది.. నేడు రెండో విడత వైయ‌స్ఆర్‌ రైతు భరోసా సాయం

పెట్టుబడి కోసం ఏ రైతన్న అప్పులపాలు కాకుండా వైయస్ఆర్ రైతు భరోసా సాయం..!
 

 అమ‌రావ‌తి: రైతన్నకు తోడుగా జగనన్న.. పెట్టుబడి కోసం ఏ రైతన్న అప్పులపాలు కాకుండా వైయస్ఆర్ రైతు భరోసా ద్వారా మూడు విడతల్లో ఏటా రూ.13,500  పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. వ్యవసాయం దండగ అనే గత పరిస్థితులను సమూలంగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నలకు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలుస్తూ చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా.. రైతన్నలకు సాయం అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల సాయం అందిస్తామన్న హామీకి మిన్నగా.. ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున అంటే మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే రైతన్నకు అదనంగా రూ.17,500 చొప్పున పెట్టుబడి సాయం అం­దిస్తున్నారు.

ఖరీఫ్‌ పంట వేసే ముందు మేలో రూ.7,500, అక్టోబర్‌–­నవంబర్‌ నెల ముగిసే లోపే ఖరీఫ్‌ కోతలకు, రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే వేళ జనవరి/ఫిబ్రవరిలో రూ.2 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (అటవీ), దేవదాయ భూ సాగుదారులకు భూ యజమానులతో సమానంగా రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తాజాగా జమచేస్తున్న రూ.2,204.77 కోట్లతో కలిపి వైయ‌స్ఆర్‌ రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.65,500 చొప్పున ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. 

వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైయ‌స్ఆర్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
 ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం
 శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగనమోహన్‌రెడ్డి

Back to Top