జ‌న స‌మ్మోహితుడు ఈ జగన్మోహనుడు 

రాజశేఖరుని  ఆశీస్సులు జనామోదానికి తోడై, సృష్టించిన ఓట్ల సునామీ,  తెలుగుదేశాన్ని చిన్నాభిన్నంచేసి తీరంతెలియని దూరానికి నెట్టివేసింది. అదే సమయంలో జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ బాధ్య‌త మరింత పెరిగింది.  

సచివాలయ పరిపాలనపై పట్టు,  దూరదృష్టి ఉన్నవ్యక్తి, అజాతశత్రువు, మచ్చలేని మంచి మనిషి అజేయ కళ్ళం గారికి, రాజకీయాలకతీతంగా అలోచించి, అడ్మినిస్ట్రేషన్ బాధ్య‌తలు అప్పచెప్పడం జగన్ గారి నాయకత్వ లక్షణానికి మచ్చు తునక. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజల్లోకి మంచి సంకేతాలు పంపి , జగన్ పరిపాలనా దక్షతపై నమ్మకాన్ని పెంచాయి.  

జగన్ ఢిల్లీ యాత్రలో చీఫ్ సెక్రటరీ పాత్ర,  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై వివరణ, పార్టీ ఘనవిజయాన్ని తోడై, మోదీ వద్ద , బీజేపీలోనూ, జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాశం కలుగజేసాయి. ప్రధానమంత్రి గంటకు పైన  జగన్ తో గడపటం, అనేక విషయాలపై  లోతైన  చర్చలు జరపడం, తదుపరి జరగవలసిన విషయాలపై నిర్ణయాలు చకచకా తీసుకోవడం, గాడి తప్పిన రాష్ట్ర పాలన గాడిలో పడిందనడానికి చక్కని ఉదాహరణ.  

ప్ర‌ధాన మంత్రి మోదీని కలిసి వ‌చ్చిన రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే పెండింగ్‌లో ఉన్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం బిల్లులు విడుద‌ల కావ‌డం శుభ‌ప‌రిణామం. ఈ జగన్మోహనుని పరిపాలనా తొలి అంకం, రానున్న రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే పారదర్శక పాలనకు పునాది. ప్రజలందరం జగన్ గారిని నిండుమనసుతో ఆశీర్వదించి , ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఆహ్వానిద్దాం.

Back to Top