ఓ పక్క పుష్కలంగా వర్షపాతం, మరో పక్క ఎగువ రాష్ట్రాల నుంచి పోటెత్తిన వరద. గత దశాబ్ద కాలంగా లేనివిధంగా మూడు సార్లు శ్రీశైలం, నాగార్జున సాగర్, క్రుష్ణా బ్యారేజీలకు రెండు సార్లు పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేంతగా జలసిరులు రాష్ట్రాన్ని కళకళలాడించాయి. మరి ఇంతగా నీటి వనరు దొరికినా రాష్ట్రంలోని జలాశయాలు పూర్తి స్థాయిలో నిండలేదు. కారణం గత పాలకుల తప్పిదాలు. పట్టిసీమ పేరుతో దోచుకోవడం, పోలవరంలో కమీషన్లు దండుకోవడానికి తప్ప సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి చూపకపోవడమే ఈ పరిస్థితికి కారణం. తాజా వరద గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ చంద్రబాబు చెబుతున్న నీటి లెక్కలన్నీ నీటి మూటలే అని తేలుస్తున్నాయి.
నీటి లెక్కలు
2017 నుండీ రాయలసీమకు 100 టీఎంసీలకు పైగా నీళ్లిచ్చామని డప్పు కొట్టారు చంద్రబాబు. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు దాదాపు నెల కిందటే నిండినా ఇప్పటికీ ప్రాజెక్టులు 50శాతం నిండలేదు. కాలవల సామర్థ్యం పెంచకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పోతిరెడ్డిపాడు నుండి బానకచెర్లకు 44,000 వరదనీరు పారిస్తే కాలువ పక్కన ఉన్న పొలాలు మునిగిపోతున్నాయి. వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్, SR1, సోమశిల, కండలేరు, SRBC, గాలేరు నగరి, గోరకల్లు, అవుకు, గండికోట, జీడిపల్లి, గొల్లపల్లి జలాశయాలు నిల్వ సామర్థ్యం కంటే తక్కువ టీఎంసీలను కలిగి ఉన్నాయి. దీనంతటికీ కారణం కాల్వల సామర్థ్యం సరిగ్గా లేకపోవడమే అన్న విషయాన్ని తన సమీక్షల ద్వారా గుర్తించారు సీఎం వైయస్ జగన్.
ఇకపై వరద నీటిని వ్రుధాగా సముద్రం పాలు చేయకూడదని, కాల్వల సామర్థ్యం పెంచడం, కొత్త ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా వరదనీటిని వడిసిపట్టి రాయలసీమ రైతుల సాగునీటి కష్టాలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచేలా అధికారులను ఆదేశించారు. వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్ కాలువ లైనింగ్ సమస్యలు తీర్చనున్నారు. ఎన్నో ఏళ్లుగా సీమ ప్రజలు ఎదురుచూస్తున్న తుంగభద్రమీద గుండ్రేవుల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు. 2008లో వైయస్సార్ శంకుస్థాపన చేసి 407 కోట్లు నిధులు విడుదల చేసిన జలదరాశి, రాజోలి జలాశయాల పనులు తర్వాతి పాలకుల వల్ల మరుగున పడిపోయాయి. ఈజలాశయాల నిర్మాణం పూర్తయితే నంద్యాల, పాణ్యం, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో సాగు సమస్యలు తీరిపోయినట్టే.
సీమ కోసమే కాదు పల్నాటి కోసమూ వైయస్ జగన్ సాగునీటి ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. వరికపూడిశిల ఎత్తిపోతల పరిధిని 24,000 ఎకరాల నుంచీ లక్ష ఎకరాల ఆయకట్టుకు విస్తరిస్తున్నారు. క్రఈష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజీ దిగువన మూడు జలాశయాల నిర్మాణానికి సంసిద్ధత తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండు దశలకూ అనుమతులు ఇచ్చారు.
వచ్చే నవబంరు, డిసెంబరు కల్లా జలదరాశి, రాజోలి జలాశయాలకు శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తూ, పాతవాటి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, కాల్వల పూడికతీతల ద్వారా నీటి నిల్వలు పెంచుతూ లక్షలాది ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తోంది. తండ్రి వైయస్సార్ ఆశయాల సాధనలో, రాష్ట్రాన్ని కరువు రహితంగా, రైతును రాజుగా మార్చే దిశలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి పాలన సాగుతోంది.