జగన్నామ సంక్షేమ సంవత్సరం–2022

2022 రౌండప్ కథనం

 
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాల‌న‌లో 2022వ సంవ‌త్స‌రం అనేక చారిత్ర‌క నిర్ణ‌యాలు, అద్భుత‌మైన సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అందాయి. 2022 జ‌గ‌న్నామ సంక్షేమ సంవ‌త్స‌రంగా ప్ర‌జ‌లు చెప్పుకుంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో 2022 సంవత్సరంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు–సంక్షేమ పథకాల టైమ్‌లైన్‌:
    
    యావత్‌ మానవాళి జీవితాలను అతలాకుతలం చేసిన కోవిడ్‌ విపత్కర పరిస్థితుల నుంచి నెమ్మదిగా బయటపడుతూ, ఆ పీడకల నుంచి తేరుకుంటూ ప్రారంభమైన 2022వ సంవత్సరం– ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సంక్షేమ–అభివృద్ధి–సంస్కరణల పరిపాలన ఆలంబనగా నిలిచింది.  పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారి సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, శాచురేషన్‌ విధానంలో పథకాలను అందించింది. ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంస్కరణలతో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో పయనించేందుకు 2022వ సంవత్సరం కీలకంగా నిలిచింది.  సంక్షేమంతో పాటు రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, తద్వారా యువతకు ఉపాధి అందించడంలో ఈ ఏడాది కీలకంగా మారింది. అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు యువతకు ఉపాధి కల్పించాయి. 

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు 2022లో చేపట్టిన ప్రధానమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇవిః

01.01.2022
అవ్వాతాతలకు కొత్త సంవత్సరం కానుక...పింఛన్‌ పెంపు
    తాను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవ్వాతాతలకు రూ. 2250 చొప్పున పింఛన్‌ను ప్రతి నెలా ఒకటో తేదీన అందిస్తూ వస్తున్నారు. 2022 సంవత్సరం మొదటి రోజే కొత్త సంవత్సరం కానుకగా అవ్వాతాతల పింఛన్‌ను రూ.2250 నుంచి రూ. 2500 చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి అవ్వాతాతల పింఛన్‌ ను మరో రూ. 250 పెంచి,  రూ. 2,750 ఇవ్వబోతున్నారు. 

10.01.2022
ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక ఆక్సిజన్‌ సౌకర్యాలు
    కోవిడ్‌ పేషెంట్లకు వెంటనే ఆక్సిజన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి సారధ్యంలో రాష్ట్రంలోనే ఆక్సిజన్‌ తయారీ సామర్ధ్యాన్ని పెంచడంలో భాగంగా రూ.426 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 93600 ఎల్‌పీఎం(లీటర్‌ పర్‌ మినిట్‌) సామర్ధ్యం గల 144 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లతో పాటు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు, ఎల్‌ఎంవో ట్యాంకులు, ఆక్సిజన్‌ పైప్‌లైన్లు ఏర్పాటును తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు వర్చువల్‌గా ప్రారంభించారు. 

25.01.2022
అగ్రవర్ణాల అక్కచెల్లెమ్మలకు అండగా ‘‘ఈబీసీ నేస్తం’’
    మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓబీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 3,92,674 మంది అక్క చెల్లెమ్మలకు రూ.589 కోట్లు ఆర్ధిక సాయాన్ని అందించే ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు సిఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.

08.02.2022
రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ కుటుంబాలకు ‘జగనన్న చేదోడు’
    వరుసగా రెండో ఏడాది కూడా ‘జగనన్న చేదోడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 లక్షల మంది అర్హులైన రజక,నాయీబ్రాహ్మణ,దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రెండో ఏడాది రూ.285.35 కోట్ల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి వారి ఎకౌంట్లలో జమచేశారు.

17.02.2022
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కీలక జాతీయ రహదారులు ప్రారంభం
    రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.21,557 కోట్ల విలువైన  మొత్తం 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. విజయవాడలో కీలకమైన బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌–2తో పాటు రాష్ట్రంలో పూర్తయిన ఇతర ప్రాజెక్టులను విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చొరవతో రాష్ట్రంలోని కీలకమైన మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేస్‌ మంజూరుతో పాటు పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హమీ ఇచ్చారు. వీటితో పాటు 30 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, మరి కొన్ని నేషనల్‌ హైవేస్‌ ప్రాజెక్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించగలిగింది. 

28.02.2022
చిరువ్యాపారుల ముఖాన చిరునవ్వులు ‘‘జగనన్న తోడు’’
    జగనన్న తోడు పథకం మూడో విడుత రుణాలను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. మూడో విడత 5,10,462  మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు.

01.04.2022
బాలింతలకు బాసటగా ‘‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’’లు
    కాన్పు తర్వాత బాలింతలకు బాసటగా నిలవాలని  ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 500 ఎయిర్‌ కండిషన్డ్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను విజయవాడ బెంజ్‌ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ తల్లిబిడ ్డ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఏటా 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఇంటికి సురక్షితంగా చేర్చడంతో పాటు ప్రసవానంతరం వారి విశ్రాంతి సమయంలో రూ.5వేలు అందిస్తుంది. 

04.04.2022
విశాల ప్రయోజనాలు, పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా ‘‘జిల్లాల పునర్విభజన’’
ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాల నుంచి పరిపాలనను ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో  కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 26 జిల్లాలుగా మార్చారు.

07.04.2022
సేవా సైన్యం ‘వాలంటీర్లు’కు సలాం
    రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సత్కరించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు  వరుసగా రెండో ఏడాది కూడా ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులను ప్రదానం చేశారు. 

08.04.2022
ఉన్నత విద్యకు ఆలంబనగా ‘‘జగనన్న వసతి దీవెన’’
    ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాలలో అమలు చేశారు. మొత్తం 10,68,150 మంది విద్యార్థులకు రూ. 1,024 కోట్లు జగనన్న వసతి దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.  

21.04.2022
పరిశ్రమల ప్రగతికి సోపానం ‘గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌’
    తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిమ్‌ కాస్టిక్‌ సోడా తయారీ పరిశ్రమను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రూ.2700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ప్రత్యక్షంగా 1300 మందికి, పరోక్షంగా 1150 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు.

22.04.2022
అక్కచెల్లెమ్మలకు అండగా ‘వైఎస్సార్‌ సున్నావడ్డీ’
    రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ రూ. 1,261 కోట్లను వారి వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జమ చేశారు. వరుసగా మూడో ఏడాది క్రమం తప్పకుండా సిఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.  

28.04.2022
అన్ని అడ్డంకులు తొలగి విశాఖ పేదలకు ఇళ్లపట్టాలు
    కోర్టుల్లో వేసిన కేసులు తొలగించుకుని విశాఖపట్నంలోని పేదలందరికీ ఇళ్లపట్టాల పంపిణీ ఓ పండుగలా జరిగింది. ఒకే సారి 1.43 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ జిల్లా సబ్బవరంలో ప్రారంభించారు. మొత్తం రూ. 10 వేల కోట్ల విలువైన ఆస్థిని అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నట్లు సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ తెలిపారు.

13.05.2022
గంగపుత్రులకు వరం ‘మత్స్యకార భరోసా’
    రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,08,755 మంది మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకుండా ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున దాదాపు రూ. 109 కోట్లను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించారు. కోనసీమ జిల్లా మురుమళ్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన మత్స్యకార భరోసా సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. 

17.05.2022
పునరుత్పాదక ఇంధన వనరుల్లో మైలురాయి
    కర్నూలు జిల్లాలో గ్రీన్‌ కో సంస్థ చేపట్టిన సమీకృత పునరుత్పాదక ఇందన తయారీ ప్రాజెక్టును ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి, గుమ్మిటం తాండా 5,230 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ తయారీ ప్రాజెక్టుకు గ్రీన్‌ కో శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో రూ.15 వేల కోట్లను వెచ్చించనుంది. రివర్స్‌ పంప్డ్‌ స్టోరేజీ ఎనర్జీ విన్నూత్న ప్రక్రియతో పాటు సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులో సమ్మిళతమై ఉంటాయి. 

19.05.2022
ఇక పశువులకూ అంబులెన్స్‌లు
    రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం వద్ద ‘డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ’ కార్యక్రమం కింద పశువులకూ అంబులెన్స్‌ సేవలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో 340 పశు అంబులెన్సులను రెండు విడుతలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

22.05.2022 నుంచి 25.05.2022 వరకు
సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌  దావోస్‌ పర్యటనతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు
    ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజుల పాటు దావోస్‌లో కీలక పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సుల్లోనూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం సహకారం అనే అంశాలను వివరించి రాష్ట్రానికి పెట్టబడులు వచ్చేందుకు బాటలు వేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ పర్యటన కారణంగా సుమారు రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ ప్రపంచ స్థాయి సంస్థలు ఆసక్తిని ప్రదర్శించాయి. 

07.06.2022
రైతన్నకు సాంకేతిక సాయం ‘వైఎస్సార్‌ యంత్రసేవా పథకం’
    వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద రైతన్నలకు ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లను అందించే మెగా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో ప్రారంభించారు. దీనిలో భాగంగా రూ. 2016 కోట్ల వ్యయంతో  10,750 యంత్రసేవా కేంద్రాల్లో రూ.15 లక్షల విలువైన పరికరాలు, 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల విలువ గల కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్‌ స్థాయి యంత్రసేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. 

14.06.2022
నష్టపోయిన రైతుకు సకాలంలో ఉచిత పంటలబీమా
    వరుసగా మూడో ఏడాది ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతన్నలకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో ప్రారంభించారు. ఏరువాకకు సిద్ధమవుతున్న అన్నదాతలకు అండగా 2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు రూ. 2,977.82 కోట్ల బీమా సొమ్మును ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

23.06.2022
పారిశ్రామిక ప్రగతికి సోపానం దిశగా పలు ప్రాజెక్టులకు భూమిపూజలు
    ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో రెండు అతి పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు భూమిపూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో హిల్‌టాప్‌ సెజ్‌ డెవలెప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రై వేట్‌ లిమిటెడ్‌ (అపాచీ)కి సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏర్పేడు మండలం వికృతమాలలో మరాకో, టీసీఎల్, ఫాక్స్‌లింక్, డిక్సన్‌ టెక్‌ వంటి çపలు సంస్థలకు కూడా సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ భూమిపూజ చేశారు. మొత్తం ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ. 4వేల కోట్ల పెట్టుబడులు వస్తుండగా, సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

27.06.2022
చదువే ఆస్తిగా..అమ్మలకు ఆసరాగా ‘‘అమ్మ ఒడి’’
    వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 82,31,502 మంది విద్యార్థినీ విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ... 43,96,402 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,595 కోట్ల నిధులను నేరుగా జమ చేశారు.

04.07.2022
ప్రధాని శ్రీ నరేంద్రమోడీతో కలిసి మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ
    అజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

05.07.2022
‘‘జగనన్న విద్యాకానుక’’తో బడికెళ్లడం ఇక వేడుక
    వరుసగా మూడో ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోనిలో అందజేశారు. విద్యాకానుక కిట్ల కోసం 47,40,421 మంది విద్యార్థులకు గాను రూ. 931.02 కోట్ల నిధులను వెచ్చించారు. 

15.07.2022
ఆటో డ్రైవర్లకు అండగా ‘‘వైఎస్సార్‌ వాహనమిత్ర’’
    ఆటో డ్రైవర్‌లకు బాసటగా వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్రను విశాఖపట్నంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ అందించారు. 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.261.51 కోట్లను ఆటోడ్రైవర్ల ఖాతాల్లో సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ జమ చేశారు.

20.07.2022
రామాయపట్నం పోర్టుకు భూమిపూజ
    శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. 36 నెలల్లో ఈ పోర్టు మొదటి దశ పనులు పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలిదశలో 25 మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో 4 బెర్తుల నిర్మాణం పూర్తి చేస్తారు. రెండో దశ కూడా పూర్తయ్యే నాటికి మొత్తం 19 బెర్తులు ఈ పోర్టులో అందుబాటులోకి రానున్నాయి. 

29.07.2022
‘కాపునేస్తం’తో అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వు
    వరుసగా మూడో ఏడాది కూడా వైఎస్సార్‌ కాపునేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలులో అమలు చేశారు. ఆయన చేతుల మీదుగా 3,38,792 మంది కాపు,బలిజ,తెలగ,ఒంటరి కులాల్లోని అక్కచెల్లెమ్మలకు రూ.508.18 కోట్లను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఒక్క బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

03.08.2022
చిరువ్యాపారులకు వరం ‘‘జగనన్న తోడు’’
    ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వరుసగా మూడో ఏడాది జగనన్న తోడు కార్యక్రమాన్ని అమలు చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.395 కోట్ల రుణాలను వారి ఎకౌంట్లలో జమ చేశారు.

16.08.2022
పారిశ్రామిక ప్రగతికి వేదికగా విశాఖ
    అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో కీలకమైన ఏటీసీ టైర్స్‌ తో పాటు పలు పరిశ్రమలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. జపాన్‌కు చెందిన యకోహోమా కంపెనీకి చెందిన ఈ ఏటీసీ టైర్ల సంస్థ ద్వారా సుమారు 2వేల మందికి ఉపాధి లభించడంతో పాటు ఆ సంస్థ రూ.2,200 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ సంస్థతో పాటు మరో 7 సంస్థలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ భూమిపూజలు నిర్వహించారు.

20.08.2022
సీజేఐగా పదవీవిరమణ చేస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణకు ఘనంగా వీడ్కోలు
    సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి తెలుగు తేజం జస్టిస్‌ ఎన్వీ రమణ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఆయనకు ఘనంగా వీడ్కోలు నిర్వహించింది. విజయవాడ కోర్టు భవనాల ప్రారంభోత్సవంలో జస్టిస్‌ రమణతో పాటు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ కూడా పాల్గొన్నారు.

25.08.2022
నేతన్నలకు ఆపన్న హస్తం ‘‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’’
    నేతన్నలను ఆదుకునేందుకు వరుసగా నాలుగో ఏడాది 80,546 మంది నేతన్నల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున నగదును ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ పెడన నియోజకవర్గం తోటమాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 193.31 కోట్లు ఖర్చు చేసింది. 

26.08.2022
పర్యావరణ పరిరక్షణలో పార్లే ఫర్‌ది ఓషన్స్‌తో ఒప్పందం
    సముద్రాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించే అంతర్జాతీయ స్థాయి సంస్థ పార్లే ఫర్‌ది ఓషన్స్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ రానున్న ఆరేళ్లలో 20 వేల మందికి ఉపాధి కల్పించడంతో పాటు రూ.16వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎంవోయూ విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో జరిగింది. ఇదే వేదికపై నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్‌ బ్యానర్లు నిషేధిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

26.08.2022
మైక్రోసాఫ్ట్‌లో యువతకు నైపుణ్య శిక్షణ    
    రాష్ట్రంలోని 35,980 మంది యువతకు ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న మైక్రోసాఫ్ట్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ ఇప్పించింది. విశాఖపట్నం నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మైక్రోసాఫ్ట్‌లో శిక్షణ తీసుకున్న యువతకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు.  

06.09.2022
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలు జాతికి అంకితం
    సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడంతో పాటు, తక్కువ సమయంలో ఆ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. దీనితో పాటు నెల్లూరు బ్యారేజీని కూడా సీఎం ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా సుమారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

23.09.2022
కుప్పంలో అక్కచెల్లెమ్మలకు ‘వైఎస్సార్‌ చేయూత’
    ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయూత లబ్ధిని వరుసగా మూడో ఏడాది కూడా చిత్తూరు జిల్లా కుప్పంలో బటన్‌ నొక్కి  అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రంలోని 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,949.44 కోట్ల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి వారి ఖాతాల్లో జమచేశారు.

30.09.2022
పేద వధూవరులకు ‘‘వైఎస్సార్‌ కళ్యాణమస్తు’, ‘షాదీ తోఫా’’
    వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాన్ని     ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు íసీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ తెలిపారు.

17.10.2022
వరుసగా నాలుగో ఏడాది అన్నదాతలకు అండగా ‘వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌’
    వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద నాలుగో ఏడాది మొదటి విడతగా ఈ ఏడాది మే 16న ఏలూరు జిల్లా గణపవరంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు ఒక్కో రైతుకు రూ. 5,500 నిధులను వారి వారి అకౌంట్లో జమచేశారు. దీనికోసం మొత్తం రూ. 3,758 కోట్ల నిధులను రైతులకు అందజేశారు.
    రెండో విడతగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ పాల్గొని రూ.4 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశారు. దీనికోసం 50.92 లక్షలమంది రైతన్నలకు రూ. 2,096.04 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. 

20.10.2022
చుక్కల భూమి కష్టాలకు చరమగీతం పాడిన íసీఎం శ్రీ వైఎస్‌ జగన్‌
    ఏ ముఖ్యమంత్రీ తీసుకోలేని కీలక నిర్ణయం తీసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి షరతులు కలిగిన భూములు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా వెసులుబాటు కల్పించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ భూమి కలిగిన యజమానులకు లాంఛనంగా హక్కు పత్రాలను పంపిణీ చేశారు.

01.11.2022
రెండో ఏడాదీ ‘వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’, ‘వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డులు
    వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సత్కరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలు రెండో ఏడాది కూడా అందించారు. రాష్ట్ర గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వరుసగా రెండో ఏడాది కూడా ఈ అవార్డులను ప్రదానం చేశారు. 

04.11.2022
పర్యావరణ హిత ఇంధన తయారీకి ఏపీ రెడ్‌ కార్పెట్‌
    తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో  అస్సాగో ఇండస్ట్రీస్‌ సంస్థకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. రూ.260 కోట్ల పెట్టుబడితో రోజుకు రెండు లక్షల లీటర్ల బయో ఇథనాల్‌ను ఈ సంస్థ తయారు చేయనుంది. 

11.11.2022
పల్నాడులో ఐటీసీ గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌
    పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ప్రఖ్యాత సంస్థ ఐటీసీ కీలకమైన స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ గ్లోబల్‌ స్పైసెస్‌ పార్క్‌ను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మిర్చి, పసుపును ప్రాసెస్‌ చేసేందుకు ఐటీసీ మొదటి దశలో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టింది.

12.11.2022
ప్రధాని సమక్షంలో హోదాపై గళమెత్తిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌
    విశాఖ వేదికగా రూ.10 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీ నరేంద్రమోడి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రధాని సమక్షంలో రాష్ట్రానికి విభజన తర్వాత జరుగుతున్న అన్యాయం, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులపై ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గట్టిగా గళమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం మరో మారు స్పష్టం కోరుతూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 

21.11.2022
నరసాపురంలో ‘ఆక్వా యూనివర్సిటీ’కి శంకుస్థాపన
    ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 200 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ అందుబాటులోకి రానుంది. దీనితో పాటు బియ్యపుతిప్పలో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకూ సిఎం శంకుస్థాపన చేశారు.

23.11.2022
వందేళ్ల రికార్డుల ఆధునికీకరణకు ‘‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష’’
    ‘‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష’’ పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఈ ఏడాది రెండు సార్లు నిర్వహించారు. 
    తొలుత జనవరి 18వ తేదీన 51 గ్రామాల్లో 12776 మంది భూయజమానుల 21,404 భూకమతాలకు సంబంధించిన 29,563 ఎకరాల భూమిని రీసర్వే చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి భూ రికార్డులను యజమానులకు వర్చువల్‌గా అందజేశారు. 
    రెండో విడతగా 2వేల గ్రామాల్లోని 7,92,238 మంది భూ యజమానుల హక్కు  పత్రాలను అధునికీకరించి శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంపిణీ చేశారు.

28.11.2022
ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ
    2021 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన పంటలకు అదే సీజన్లో పరిహారం అందిస్తూ 5,97,311 మంది రైతన్నలకు లబ్ది చేకూర్చారు. రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్ల లబ్ధితో మొత్తం రూ.571.57 కోట్లు అందిచారు. 2022 ఫిబ్రవరి 15వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ లబ్ధిని తన క్యాంపు కార్యాలయం నుంచి రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. 
    రెండో సారి 2022 జులై నుంచి అక్టోబర్‌ మధ్యలో వివిధ కారణాల వల్ల పంట నష్టపోయిన 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించారు. ఇదే రోజు రబీ 2020–21, ఖరీఫ్‌ 2021లో పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 8,22,411 మంది అన్నదాతలకు రూ. 160.55 కోట్ల పంట రుణాలను కూడా అందించారు.

30.11.2022
విద్యార్థులకు వరం ‘‘జగనన్న విద్యాదీవెన’’
    ఈ ఏడాది నాలుగు సార్లు ఆయా త్రైమాసికాలకు సంబంధించిన జగనన్న విద్యాదీవెన సొమ్మును క్రమం తప్పకుండా వారి తల్లులు ఖాతాల్లో జమచేశారు. 
    2021 సంవత్సరంలోని అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికం కోసం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 10.82 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన జగనన్న విద్యాదీవెన రూ.709 కోట్లు వారి ఎకౌంట్లలోకి జమ చేశారు. 
    2022 జనవరి నుంచి మార్చి వరకూ 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్ల ఫీజ్‌ రీఎంబర్స్‌మెంటును తిరుపతిలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 
    ఏప్రిల్‌ నుంచి జూన్‌ త్రైమాసికానికి వారికి ఇవ్వాల్సిన ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ రూ.694 కోట్లను బాపట్లలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
    జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్ల నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమచేశారు. 

04.12.2022
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ముకు ఘన సత్కారం
    రాష్ట్రపతిగా మొట్టమొదటి సారి రాష్ట్రానికి వచ్చిన శ్రీమతి ద్రౌపతి ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

21.12.2022
విద్యార్థులకు ఉచిత ట్యాబ్స్‌
    ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బైజూస్‌ కంటెంట్‌తో సిద్ధం చేసిన ట్యాబ్స్‌ను 8వ తరగతి విద్యార్థులకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,564 మంది 8వ తరగతి విద్యార్థులకు, 59,176 మంది సబ్జెక్ట్‌ టీచర్లకు రూ.688 కోట్ల విలువైన శాంసంగ్‌ ట్యాబ్‌లను అందజేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఈ ట్యాబ్‌లను విద్యార్థులకు అందజేశారు. 
–––––––––––
 వికేంద్రీకరణ– మారుతున్న గ్రామాల రూపురేఖలు:
    
వికేంద్రీకరణతో ఆంధ్రప్రదేశ్‌ స్వరూపమే మారింది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఎన్నో మార్పులు ఈ ఏడాది చోటుచేసుకున్నాయి. పరిపాలన ప్రజల గడప వద్దకే వచ్చి చేరింది.
– 13 జిల్లాలు 26 జిల్లాలు అయ్యాయి, కుప్పంతో సహా రెవెన్యూ డివిజన్‌ లు పెరిగి పరిపాలన మరింత సులభమైంది. 
–పాలకులు సేవకులుగా మారారు. గ్రామ స్థాయి వార్డు మెంబరు నుంచి మంత్రి మండలి వరకు అడుగడుగునా సామాజిక న్యాయం గొప్పగా అమలవుతోంది. 
– విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ బడులు, ఆసుపత్రులు కార్పొరేట్‌ కు దీటుగా మారాయి.  ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ చదువులు వచ్చాయి. ప్రతి ఇంటికీ ఫ్యామిలీ డాక్టర్‌ వచ్చారు. వీటితోపాటు మరెన్నో సంస్కరణలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఈ ఏడాదే శ్రీకారం చుట్టారు. 

– ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సామాజిక న్యాయం గొప్పగా ఈ ఏడాదే అమలయింది.   
– జగన్‌ గారి కేబినెట్‌ లో దాదాపు 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులు వచ్చింది ఈ సంవత్సరమే..
–13 జిల్లాలు 26  జిల్లాలకు పెరిగింది ఈ ఏడాదే. 
– 51 రెవెన్యూ డివిజన్లు 77 కు పెరిగిందీ ఈ సంవత్సరమే.
– ఫ్యామిలీ డాక్టర్‌ వచ్చింది ఈ సంవత్సరమే.
– అవ్వాతాతలకు పెన్షన్‌ పెంపు ఈ సంవత్సరమే..
– వందేళ్ళుగా సాధ్యం కానిది, వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష  పథకం కింద భూములు రీ సర్వే చేసి, భూహక్కు పత్రాలు జారీ అయిందీ  ఈ సంవత్సరమే.
– ఆరోగ్యశ్ర్రీలో 3255 ప్రొసీజర్స్‌ కు పెరిగింది ఈ సంవత్సరమే..
– గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారయిందీ ఈ సంవత్సరమే.
– 6511 పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది ఈ సంవత్సరమే..
– 5 లక్షల మంది విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేస్తోంది ఈ సంవత్సరమే.
– విద్యార్థులకు ఉపయుక్తమైన బైజూస్‌ తో ఒప్పందం చేసుకుంది ఈ సంవత్సరమే..
– 500 ఎయిర్‌ కండిషన్డ్‌  తల్లిబిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ వాహనాలు ప్రారంభించింది ఈ సంవత్సరమే..
– 340 డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌ లు ప్రారంభించింది ఈ సంవత్సరమే.. 
– వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకం అమలు అయ్యింది ఈ సంవత్సరమే. 

గ్రామస్థాయిలో, పట్టణాల్లో వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల నుంచి కొత్త జిల్లాలు.. మూడు ప్రాంతల సమగ్రాభివృçద్ధే ధ్యేయంగా మూడు రాజధానుల నిర్ణయంతో జగన్మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం సమన్యాయమే లక్ష్యంగా పనిచేస్తోంది.

ప్రతి గ్రామంలోనూ మార్పుః
        నేడు ప్రతి గ్రామంలోనూ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఒక పంచాయతీ భవనం కావాలన్నా, స్కూలు భవనం నిర్మించాలన్నా స్థానిక ప్రజాప్రతినిధులు కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రజా ప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి.  ఇప్పుడు అవేమీ లేకుండా, గ్రామంలో అడుగు పెట్టగానే, ఒక సచివాలయం,  ప్రతి గ్రామంలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూల్‌. మరో నాలుగు అడుగులు వేస్తే.. ఒక ఆర్బీకే కేంద్రం, ఒక విలేజ్‌ క్లినిక్,  ఒక డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. 

    నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. త్వరలో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ రాబోతున్నాయి. ఆ విధంగా గ్రామాలు రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. సచివాలయాల మొదలు విలేజ్‌ క్లినిక్స్‌ వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర విభజన సందర్భంలో శివరామకృష్ణన్, ఆ తర్వాత ఆయా కమిటీలు చేసిన సిఫార్సులు, సలహాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు–  మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా,  ప్రస్తుత రాజధానిగా ఉన్న అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తూ నిర్ణయించారు. అయితే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. అమరావతి రైతుల యాత్రల పేరుతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేయగా, ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రజల్లో వ్యతిరేక రావడంలో యాత్రను విరమించుకున్నారు. 

కొత్త జిల్లాలుః 
    పాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ 04.04–.2022న ప్రారంభించారు. 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో పునర్‌వ్యవస్ధీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది.

బడులలో, ఆసుపత్రుల్లో నాడు–నేడుః
పేద, సామాజిక వర్గాల తలరాతలు మార్చే విధంగా, వారు చదువుకుంటున్న ప్రభుత్వ బడులన్నీ  నాడు–నేడుతో పూర్తిగా రూపురేఖలు మార్చుతున్నారు.  విద్యార్థులకు ఇంగ్లీషు–మాతృ భాషల్లో, బైలింగువల్‌ టెక్స్‌›్టబుక్స్‌ను ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లిషు ఉండే విధంగా సులభంగా అర్ధమయ్యేలా పూర్తిగా తీసుకొచ్చారు. బడులన్నిటినీ పూర్తిగా ఇంగ్లిషు మీడియంలోకి మార్చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొచ్చారు. బడుల రూపురేఖలు మారాయి. అలానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక వసతులతోపాటు, పూర్తిస్థాయి వైద్య, నర్సింగ్‌ సిబ్బంది ఏర్పాటు చేసి పేదలకు సేవలందిస్తున్నారు. 
– రాష్ట్ర వ్యాప్తంగా 45వేలకు పైగా ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు, ప్రీ ప్రైమరీలు, ఫౌండేషన్‌ స్కూల్స్‌ గా మారుతున్న అంగన్‌ వాడీలు, హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద 57వేల స్కూళ్లు, హాస్టళ్ల రూపురేఖలు మారుతున్నాయి.ఇందుకోసం రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.  తొలి దశలో భాగంగా, 15,715 పాఠశాలల్లో రూ.3,700 కోట్ల నిధులతో సమూలమైన మార్పులు తెచ్చారు. ఈ పాఠశాలల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం స్మార్ట్‌ టీవీలు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు పెడుతున్నారు. నాడు – నేడు రెండో దశ కింద 22,344 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో రూ.8వేల కోట్లతో సకల సదుపాయాలు కల్పించనున్నారు. 

విద్యావ్యవస్ధలో సంస్కరణలు....
–మూడున్నరేళ్లలో విద్యమీద ఖర్చు రూ.55 వేల కోట్లు..
ఈ మూడున్నరేళ్ల కాలంలో ఈ పథకాల మీద మీ జగనన్న ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అక్షరాలా రూ.55వేల కోట్లు. 
 రాష్ట్రంలో ప్రతి బిడ్డా పోటీ ప్రపంచంతో నిలవాలని, గెలవాలనే మంచి ఆలోచనతో మొత్తం విద్యావ్యవస్ధలోనే సంస్కరణలు తీసుకొచ్చాం. వాటిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ పూర్తి రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పేదవర్గాల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడం ఒక హక్కుగా వాళ్లు పొందగలిగే పరిస్థితిని తీసుకువచ్చాం. ఈ దిశగా అడుగులు వేస్తూ.. గతంలో చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం కాలంలో 2017–18, 2018–19కు సంబంధించి రూ.1778 కోట్లు  బకాయిలు పెడితే వాటినీ ఈ ప్రభుత్వం చెల్లించింది.

మూడున్నరేళ్లలో రెండు పథకాలకే రూ. 12 వేల కోట్లు పైగా... 
ఈ తక్కువ కాలంలోనే కేవలం జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా రూ.9052 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.3349 కోట్లు పిల్లల చదువులకు ఏమాత్రం ఇబ్బంది రాకూడనే ఉద్దేశంతో .. చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు సైతం తీరుస్తూ... కేవలం ఈ రెండు పథకాలకు రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టింది ఈ ప్రభుత్వం. 
 

సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌:
– ప్రభుత్వ బడుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. గతంలో క్లాస్‌ టీచర్‌కే అవకాశం లేని పరిస్థితుల నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. గతంలో పాఠ్యాంశాలను అదే సబ్జెక్టులో నిపుణుడైన టీచర్‌ బోధించే పరిస్థితి లేదు. మూడోతరగతి నుంచి 10వ తరగతి వరకూ సబ్జెక్ట్‌ టీచర్స్‌ కాన్సెప్ట్‌ సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 
– రాష్ట్రంలో తొలిసారిగా  బడులు ప్రారంభమ్యయే తొలిరోజునే విద్యాకానుక కిట్‌ ఇస్తున్నారు. ఇందులో భాగంగా స్కూల్‌ బ్యాగు, బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు ఇస్తున్నారు. 

బైజూస్‌ తో ఒప్పందంః
అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌ తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 16.06.2022 ఒప్పందం కుదుర్చుకుంది.  ప్రపంచంతో పోటీపడేలా మన పిల్లలను సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి జగన్‌ గారి సమక్షంలో ఒప్పందంపై ప్రభుత్వం, బైజూస్‌ ప్రతినిధుల సంతకాలు చేశారు. 

విద్యార్థులకు ట్యాబ్‌ లుః
–  ప్రభుత్వ స్కూళ్లలో చదివే 8వతరగతి విద్యార్ధులకు ఇరవైనాలుగు గంటలపాటు ఉపయోగపడే విధంగా ట్యాబులు, ఈ–కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని 21 డిసెంబర్‌ న లాంఛనంగా ప్రారంభించారు.  4.6 లక్షల మంది 8వతరగతి చదువుతున్న విద్యార్ధులతో పాటు 60 వేల మంది 8వతరగతి బోధించే ఉపాధ్యాయులకు ఉచితంగా శామ్‌సంగ్‌ ట్యాబులు పంపిణీ చేస్తున్నారు. 
ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా, ట్యాబును ఇంటిలో కూడా వినియోగించుకునేలా, ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ అందుబాటులో ఉండేలా సెక్యూర్‌ డిజిటల్‌ కార్డుతో బైజూస్‌ సంస్ధ కంటెంట్‌తో ట్యాబులు ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.668 కోట్ల వ్యయం చేస్తోంది. దీనితో పాటు రూ.778 కోట్ల విలువైన బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా ఇస్తున్నారు. 

 ప్రతి పంచాయతీలోనూ వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలుః
    ప్రాథమిక, మాథ్యమిక విద్యతోపాటు డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా, ప్రతి గ్రామ పంచాయతీలోనూ వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేసి హై స్పీడ్‌ క్వాలిటీ ఇంటర్నెట్‌ సౌకర్యంతో కంప్యూటర్లను సమకూర్చాలని సీఎం గారు ఆదేశించారు. మొదటి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు చేపట్టారు.

వైద్యరంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులుః
– ఆరోగ్యశ్రీలో మరిన్ని వైద్య చికిత్సలు చేర్చి వాటిని 3,255కి పెంచారు. గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతున్న చికిత్సల సంఖ్య 1059 నుంచి 3,255కు పెరిగాయి. 
– అంటే, గత ప్రభుత్వంతో పోలిస్తే వైయస్‌.జగన్‌ గారి సర్కారు పెంచిన  చికిత్సలు 2,196.  చంద్రబాబు హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు మాత్రమే.
–   ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లు
–  ఆరోగ్య ఆసరా కోసం(2021–22లో) సుమారు రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 
– దీంతో పాటు 2021–22లో 104 వాహనాల కోసం వెచ్చించిన సొమ్ము రూ.114.05 కోట్లు
– 108 వాహనాల కోసం రూ.172.78 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 
– మొత్తంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆసరా, 108, 104ల కోసం చేసిన  ఖర్చు రూ. 3481.70 కోట్లు.
– చంద్రబాబు హయాంలో కన్నా దాదాపు మూడురెట్లు అధికంగా ఈ ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. 
– నాడు–నేడు కింద.. వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడం కోసం రూ.16,255 కోట్లు వ్యయం చేస్తున్నారు.
– కొత్తగా ఆస్పత్రులు, ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో మొత్తం 11,888 పనులు చేపట్టగా, వాటిలో ఇప్పటి వరకు 4,851 పనులు పూర్తి చేయడం జరిగింది. 
– విలేజ్, వార్డు క్లినిక్స్‌ మొదలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్‌), జిల్లా ఆస్పత్రులు (డీహెచ్‌).. చివరకు టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ నాడు–నేడు కింద అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 
– ప్రతి చోటా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయి. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైద్య రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

మరో 17 మెడికల్‌ కాలేజీలుః
–  రాష్ట్రంలో గతంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే.. మరో 17 మెడికల్‌ కాలేజీలను ఈ ప్రభుత్వం మంజూరు చేసింది.
– పాడేరు, విజయనగరం, నర్సీపట్నం, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుకొండ, ఆదోని, నంద్యాల, పార్వతీపురంలో వైద్య, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు.
– ఇప్పటికే ఉన్న 11 కాలేజీలను సమగ్రంగా మార్చడంతో పాటు, కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కట్టడం కోసం అక్షరాలా రూ.12,268 కోట్లు వ్యయం చేస్తున్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌:
    ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్‌సీ, ఒక సీహెచ్‌సీ లేదా ఒక పీహెచ్‌సీ, ఒక ఏరియా ఆస్పత్రి ఉండేలా చూస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు. ఒక 104 అంబులెన్స్‌ ఉంటుంది. 
– అంటే ప్రతి మండలంలో నలుగురు వైద్యులు, రెండు 104 అంబులెన్స్‌ సర్వీస్‌లు ఉంటాయి.
–    ప్రతి పీహెచ్‌సీలో ఉండే ఇద్దరు వైద్యుల్లో ఒకరు రోజు విడిచి రోజు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)తో ఒక్కో  గ్రామం సందర్శించి, అక్కడే వైద్య సేవలందిస్తారు. ఆ విధంగా ప్రతి గ్రామానికి ఆ వైద్యుడు నెలలో రెండుసార్లు సందర్శించే అవకాశం వస్తుంది. 

– దీని వల్ల మెజారిటీ జబ్బులకు గ్రామాల్లోనే వైద్యం అందుతుంది. వైద్యుడితో గ్రామస్తులకు అనుబంధం ఏర్పడి, అది ఒక ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌గా మారుతుంది.
– ప్రజలకు అత్యంత సమర్థంగా వైద్య సేవలు అందుతాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ అడుగులు వేస్తుండగా, మరోవైపు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి.  ఈ మూడున్నరేళ్లలోనే వైద్యఆరోగ్యశాఖలో 46 వేలకు పైగా పోస్టులు ఆస్పత్రుల్లో భర్తీ చేశారు.
.............

మీ భూమి–మా హామీ
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 23.11.2022న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం.. మీ భూమి–మా హామి పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ప్రారంభించారు. 100 సంవత్సరాల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 2 వేల గ్రామాల్లో రైతులకు జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ చేశారు. అలానే  2 వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించారు.
దశల వారీగా  వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష పథకాన్ని చేపడుతూ... రెండో దశ పిబ్రవరి– 2023లో మరో  నాలుగువేల గ్రామాలకు సంబంధించిన రైతులందరికీ పూర్తిగా భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.  మూడో దశలో మే 2023 నాటికల్లా 6వేల గ్రామాల్లో, పట్టణాలలో భూహక్కు పత్రాలను పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ఆగష్టు 2023 నాటికి మరో 9వేల గ్రామాలు, పట్టణాలకు సంబంధించి రైతులందరికీ భూహక్కు పత్రాలను అందిస్తారు. 
– మొత్తంగా 17,584 రెవెన్యూ గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ భూములన్నింటికీ సమగ్ర సర్వే పూర్తి చేసి, భూరికార్డులన్నీ ప్రక్షాళన చేసి డిసెంబరు 2023 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. 

రాష్ట్రంలో ప్రతి కమతానికి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబరు. 
ఒకసారి రాష్ట్ర మొత్తంగా భూములన్నీ పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడుందో... లాటిట్యూడ్‌ అండ్‌ లాంగిట్యూడ్‌ అంటే అక్షాంశాలు, రేశాంఖాలు ఆధారంగా మార్కింగ్‌ చేయడమే కాకుండా.. ప్రతి ఒక్క కమతానికి  నిర్దిష్టంగా ఒక యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబరు కూడా ఈ సర్వే కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కమతానికి ఫిజికల్‌గానూ, డిజిటల్‌ గానూ దాన్ని పూర్తిగా నిర్ణయించి, క్యూఆర్‌ కోడ్‌తో ల్యాండ్‌ మ్యాపింగ్‌  చేసి, దాన్ని  భద్రంగా పెడతారు. ఆ భూమికి సరిహద్దు రాళ్లు  పెడుతున్నారు. ఆ తర్వాత రైతుకు ప్రభుత్వపరంగా హక్కుగా భూహక్కు పత్రం వంటి అన్నిరికార్డులను ప్రక్షాళన చేసి ఇవ్వబోతున్నారు. దీంతో తమ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటారన్న భయం పూర్తిగా రైతుల్లోంచి కానీ, ప్రజల్లో నుంచి కానీ తొలగిపోతుంది. డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. లంచాలకు పూర్తిగా అవకాశం లేకుండా ప్రక్షాళన జరుగుతుంది.

22(ఏ)1 కింద ఉన్న నిషేధిత భూముల సమస్యకు పరిష్కారంః
నిషేధిత భూముల జాబితా నుంచి డీ నోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను 20.10.2022న కృష్ణా జిల్లా అవనిగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు రైతులకు అందించారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా.. భూములకు సంబంధించి పక్కాగా సరిహద్దులు, కచ్చితమైన రికార్డులు లేకపోవడం వల్ల ఎటువంటి కష్టాలను చూస్తున్నామో అందరికీ తెలుసు. భూయాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల అనేక రకమైన సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పరిష్కారం చూపారు. 
.........
కొత్త సంవత్సరం–వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ప్రతి నెలా రూ.2750
– కొత్త సంవత్సరం నుంచి అవ్వాతాతలకు వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక ప్రతి నెలా రూ. 2,750 అందనుంది. డిసెంబరు 13న జరిగిన కేబినెట్‌ లో ఈ మేరకు నిర్ణయించారు. అవ్వాతాతలకు పెన్షన్‌ ను రూ.3వేలు వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన మాట తూచ తప్పకుండా.. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2250కు పింఛన్‌ పెంచుతూ సంతకం చేసి, మూడున్నర సంవత్సరాలు అవుతుంది.
..........
వైయస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమంఃఎన్నికల వాగ్దానం కాకపోయినా..
    అగ్రవర్ణాల్లోని పేదవాళ్లకు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో దాదాపుగా 3.93 లక్షల మంది మహిళలకు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని 25.01.2022 ప్రారంభించి, తొలివిడతగా రూ.589 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లల్లోకి జమచేశారు. వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణాల్లోకి అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రతి ఏటా రూ.15వేల చొప్పున  3 ఏళ్లలో రూ.45వేలు అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నారు. ఇది మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్న సంకల్పంతో వైయస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. వాస్తవానికి ఇది ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానం కాదు. మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. అయినా  ఈబీసీ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, అగ్రవర్ణాల్లోని పేదవాళ్లకు మేలు చేయాలని, పేదవాడు ఎక్కడున్నా.. పేదవాడే..., వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. 
..........
విద్యార్థులకు మరో వరం.. జగనన్న విదేశీ విద్యా దీవెనః
    విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు.. 11.07.2022, విద్యార్థులకు మరో వరం ప్రకటించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభిస్తూ, ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు ఇచ్చారు.  ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తింపు చేశారు. 
ఈ పథకం కింద, గతానికి, ఇప్పటికీ తేడా ఏమిటంటే.. గత టీడీపీ ప్రభుత్వం  2016–17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలు పెట్టి దిగిపోయింది. చంద్రబాబు సర్కారు సమయంలో ఆర్ధికంగా వెనకబడ్డ అగ్రకులాలకు ఈ పథకాన్ని వర్తింప చేయలేదు. ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం వర్తింపుచేస్తుంది. గతంలో సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి  వర్తింపు చేస్తే... ఆదాయ పరిమితి పెంచి, ఇప్పుడు రూ.8 లక్షల లోపు ఉన్నవారికీ వర్తింపు చేస్తుంది.  గతంలో ప్రపంచంలోని కొన్నిదేశాలకే వర్తింపు చేసిన ఈ పథకాన్ని, ఇప్పుడు ప్రపంచంలోని ఎక్కడైనా 200 అత్యుత్తమ యూనివర్శిటీలకు వర్తింపు చేస్తుంది.  చంద్రబాబు హయాంలో ఎస్సీలకు రూ. 15 లక్షలు, ఎస్టీలకు రూ. 15 లక్షలు, కాపులకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.10 లక్షలు, మైనార్టీలకు రూ.15 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటే.  ఇప్పుడు టాప్‌ 100 యూనివర్శిటీల్లో సీటు వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపు చేస్తోంది.  101 నుంచి 200 లోపు ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షల వరకూ ఫీజులను చెల్లిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో 300 మంది ఎస్సీలకు, 100 మంది ఎస్టీలకు, 400 మంది కాపులకు, 1000 మంది బీసీలకు , 500 మంది మైనార్టీలకు పరిమితులు విధిస్తే.. ఇప్పుడు టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎంతమంది సీట్లు సాధించినా పథకాన్ని వర్తింప చేస్తోంది.
.......
డాక్టర్‌ వైయస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ః
– డాక్టర్‌ వైయస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల్లో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను, 01.04.2022న విజయవాడలోని బెంజి సర్కిల్‌లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు  జెండా ఊపి ప్రారంభించారు.
.......
రెండో అధికార భాషగా ఉర్దూః
– ఉర్దూను రెండో అధికార భాషగా ముఖ్యమంత్రి జగన్‌ గారు ప్రకటించడం పట్ల ముస్లిం, మైనార్టీ ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. 
......
వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫాః
        వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాన్ని 30.09.2022న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ గారు ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల, పేద అమ్మాయిల వివాహాలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు పథకాన్ని, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైయస్సార్‌ షాదీ తోఫా ప్రారంభించారు. దీంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేశారు. 
–––.........
గ్రీన్‌ ఎనర్జీః
గ్రీన్‌ ఎనర్జీ రంగంలో  05.09.2022న రూ.81వేల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటితోపాటు మరిన్ని పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. గ్రీన్‌ ఎనర్జీలో దేశానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తుంది. గ్రీన్‌ ఎనర్జీ రంగం అభివద్ధి వల్ల, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతోపాటు, భారీ సంఖ్యలో ఉద్యోగాలు, రైతులకు మేలు జరుగుతుంది.

– 23.06. 2022: తిరుపతి ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో మూడు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్‌ గారు ప్రారంభించారు.  మరో మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేశారు.
– దాదాపు రూ.1230 కోట్ల పెట్టుబడితో టీవీప్యానెళ్లు, మొబైల్‌ డిస్‌ప్లే ప్యానెళ్లు తయారుచేసే టీసీఎల్‌ యూనిట్‌ను ప్రారంభించారు. 3200 మందికి ఉపాధినిస్తున్నారు. ఈ యూనిట్‌లో 80 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇస్తున్నామని ప్రకటించారు.  

– ఫాక్స్‌లింక్స్‌ అనే మరో సంస్థ యూఎస్‌బీ కేబుళ్లు, సర్క్యూట్‌బోర్డులను తయారుచేస్తోంది. దాదాపుగా రూ.1050 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీని పూర్తిచేసింది. దీని ద్వారా మరో 2వేల మందికి ఉపాధిని తిరుపతిలోనే కల్పిస్తోంది.

– అదే విధంగా సన్నో ఒప్పోటెక్‌ అనే మరో సంస్ధ సెల్‌ఫోన్లు కెమెరా లెన్స్‌లు తయారుచేస్తోంది. రూ.280 కోట్ల పెట్టుబడితో  ఈ ఫ్యాక్టరీ కూడా పూర్తయ్యింది. తద్వారా 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. 
దాదాపుగా 6400 మందికి ఉద్యోగాలు.

– మరో మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన కూడా చేశారు. ఈఎంసీలో డిక్సన్‌ టెక్నాలజీస్‌ యూనిట్‌కు శంకుస్థాపన. దాదాపుగా రూ.110 కోట్లతో ఈ సంస్ధ.. నిర్మాణాలు చేపట్టంది. 850 మందికి ఉద్యోగాలు వస్తాయి.
.........
అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్‌ యాప్ః
– అవినీతి నిరోధానికి  సీఎం గారి ఆదేశాలమేరకు ఏసీబీ తయారు చేసిన యాప్‌ ను ముఖ్యమంత్రి జగన్‌ గారు 01.06.2022న ప్రారంభించారు. ఏసీబీ 14400 –పేరుతో యాప్‌ను రూపొందించారు.  ఈ యాప్‌ ద్వారా అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును 
తీసుకువస్తున్నామని సీఎంగారు చెప్పారు. 
..........

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంః
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 11–05–2022 న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు ప్రారంభించారు.  గడపగడపకూ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు, ఆ విజ్ఞాపనల పరిష్కారంకూడా అత్యంత ముఖ్యమైనది,  ప్రజలకు మంచి చేశాం... చరిత్రలో ముద్రవేశాం అని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. 
........

నూతన మంత్రివర్గం ప్రమాణాస్వీకరంః
 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు 11–04–2022న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చోటు కల్పించారు. అంటే, 70 శాతం పదవులు వారికే ఇచ్చారు.  కొత్త మంత్రివర్గంలో బీసీలు, మైనారిటీలు 11 మంది, ఎస్సీలు 5గురు, ఒక ఎస్టీ ఉన్నారు. 
.......
దిక్కులు పెక్కటిల్లేలా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీః
దివంగత మహానేత జయంతి నాడు(08.07.2022) గుంటూరు జిల్లా– నాగార్జునయూనివర్సిటీ ఎదురుగ్గా వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించారు. పావురాల గుట్టలో మొదలైన సంఘర్షణ..
ఇక్కడ ఈ రోజు మీ ఉత్సాహాల మధ్య, మన పార్టీ గురించి.. ఎక్కడ నుంచి మొదలుపెట్టాం, ఎక్కడకు వచ్చామన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే.. సెప్టెంబరు 25వ తారీఖు, 2009లో అంటే 13 యేళ్ల క్రితం పావురాలుగుట్టలో ఈ సంఘర్షణ మొదలైంది అని ముఖ్యమంత్రి జగన్‌ గారు అన్నారు. 

ఓదార్పుతో ఓ రూపం...
 ఓదార్పుయాత్రతో ఓ రూపం సంతరించుకుని, 2011 మార్చిలో వైయస్సార్సీపీ.. ఓ పార్టీగా ఆవిర్భవించింది. 11 యేళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీకోసం, నాన్నగారి ఆశయాల సాధన కోసం మనందరి ఆత్మాభిమానం కోసం.. అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించారని జగన్‌ గారు అన్నారు.  
.............

రెండో ఏడాది అవార్డుల ప్రదానంః
విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో 01–11–2022న వరసుగా రెండో ఏడాదీ వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌ –2022 అవార్డులను ముఖ్యమంత్రి జగన్‌ గారు ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, ఆత్మీయ అతిథిగా శ్రీమతి వైయస్‌.విజయమ్మ హాజరు అయ్యారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులకు (౩౦ సంస్ధలకు) గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌లు అవార్డులుఅందజేశారు. 
........... 

– జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పరిపాలనలో ఏ ఒక్క పథకానికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పనిలేదు.
–సంక్షేమ పథకాలు మంజూరు కావాలంటే.. ఎవరి సిఫార్సులు అక్కర్లేదు. ఎవరికీ కమీషన్లు ఇవ్వాల్సినపనిలేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని అంతకన్నా లేదు.
– ప్రతి పథకానికి ఒక రేటు పెట్టి, గతంలో పేదలను పీక్కుతిన్న జన్మభూమి కమిటీలు ఈ ప్రభుత్వంలో లేవు. 
– పింఛను దగ్గర నుంచి విత్తనం, ఎరువుల వరకు ఏది కావాలన్నా గతంలో మాదిరిగా భారీ క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సిన పనిలేదు. 
– పథకాల అమలుకు– కులం, మతం, ప్రాంతం, పార్టీలతో అసలే పనిలేదు. రాజకీయ జోక్యం అంతకన్నా లేదు.
– ఒక్క ఆంధ్రప్రదేశే కాదు.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా.. ముఖ్యమంత్రి బటన్‌ నొక్కగానే.. నేరుగా కామన్‌ మ్యాన్‌ అంటే... అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, రైతన్నలకు, యువతకు, విద్యార్థులకు... వారి బ్యాంకు ఖాతాల్లో  నేరుగా సంక్షేమ పథకాల నిధులు జమ అవుతున్నాయి.

గత టీడీపీ ప్రభుత్వంలో అడుగడుగునా లంచాలే....
         గతంలో పింఛన్‌ ఇచ్చింది రూ.1000, అది రావాలంటే మొట్టమొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీకి చెందినవారు అని. ఇక రెండో ప్రశ్న మూడు నెలల పెన్షన్‌ సొమ్ము జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప పెన్షన్‌ రాని పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో ఇళ్లు మంజూరు కార్యక్రమమే అరకొరగా జరిగేది. ఇల్లు మంజూరు కావాలంటే రూ.20వేలు జన్మభూమి కమిటీలకు లంచంగా ఇస్తే తప్పితే మంజూరు కావు. ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు కావాలన్నా కింద నుంచి పైస్థాయి వరకూ లంచాలే. ఒక గ్రామంలో వెయ్యి మంది అర్హులు ఉంటే..  అందులో ఇద్దరికో, ముగ్గురికో ఇచ్చేవారు. అది కూడా రూ.50 వేలు సబ్సిడీ ఇస్తే అందులో రూ.20 వేలు లంచం తీసుకునేవారు. పెన్షన్‌తో పాటు ఏ పథకం కావాలన్నా లంచాలే. ఇళ్లు, చివరకి మరుగుదొడ్లు మంజూరు కావాలన్నా లంచాలే. పంట బీమా కావాలన్నా, చివరకు రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నే లంచాలే. 

        ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారింది. సంక్షేమ పథకాలకు లంచం అడిగే పరిస్థితే ఉత్పన్నం కాకుండా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు రూట్‌ లెవల్‌ నుంచి ప్రభుత్వ వ్యవస్థలను సంస్కరించారు. సంక్షేమ పథకం పొందటం అన్నది పేద వాడి హక్కుగా మార్చారు. 

 గత చంద్రబాబు ప్రభుత్వంలో డీపీటీ(అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో..) అమలైంది. జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పరిపాలనలో డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌), నాన్‌ డీబీటీ అమలవుతోంది. 
డీబీటీ, నాన్‌ డీబీటీల ద్వారా జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వంలో మూడున్నరేళ్ళలో ఖర్చు పెట్టింది అక్షరాలా రూ.3.30 లక్షల కోట్లు,  10 కోట్లకు పైగా ప్రయోజనాలు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వం– 2022– పథకాలు– కార్యక్రమాలు:

ఇది జగనన్న సంక్షేమ ప్రభుత్వం. బడుగు, బలహీన, మైనార్టీ, పేద వర్గాల బాగు కోరే ప్రభుత్వం. అందుకే 2022లో 62 లక్షల మందికిపైగా అవ్వాతాతలకు పింఛన్‌ పెంపుతో మొదలైన సంక్షేమం.. ఈ ఏడాది పొడవునా అప్రతిహతంగా కొనసాగుతోంది. సంక్షేమంతోపాటు పలు అభివృద్ది కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలు, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఇది. 

2019 జూన్‌ నుంచి ఈ ఏడాది నవంబరు వరకు అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), పరోక్ష బదిలీ (నాన్‌ డీబీటీ) ద్వారా ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ.3.30 లక్షల కోట్లు. వాటి వివరాలు ఇలా..

డీబీటీ:–          రూ. 1,85,000 కోట్లు
నాన్‌ డీబీటీ:–   రూ. 1,45,000 కోట్లు. 
మొత్తం(రూ.):– రూ. 3.30 లక్షల కోట్లు

బీసీ వర్గాలకు చేకూరిన లబ్ది రూ.1,63,981.28కోట్లు.. మొత్తం అందిన ప్రయోజనాల సంఖ్య 5,04,65,332.

డీబీటీ:–            రూ. 86,552.18 కోట్లు
నాన్‌ డీబీటీ:–     రూ. 77,429.10 కోట్లు
మొత్తం(రూ.):– రూ. 1,63,981.28 కోట్లు

ఎస్సీ వర్గాలకు చేకూరిన లబ్ది రూ.58,344.43కోట్లు.. మొత్తం అందిన ప్రయోజనాల సంఖ్య 1,72,82,806.

డీబీటీ:–          రూ. 29,394.77 కోట్లు    
నాన్‌ డీబీటీ:–    రూ. 28,949.66 కోట్లు
మొత్తం(రూ.):– రూ. 58,344.43 కోట్లు
ఎస్టీ వర్గాలకు చేకూరిన లబ్ది రూ.15,658.02కోట్లు.. మొత్తం అందిన ప్రయోజనాల సంఖ్య 53,89,459.

డీబీటీ:–           రూ. 9,210.56 కోట్లు
నాన్‌ డీబీటీ:–     రూ. 6,447.46 కోట్లు
మొత్తం(రూ.):– రూ. 15,658.02 కోట్లు

మైనార్టీ వర్గాలకు చేకూరిన లబ్ది రూ.13,996.90కోట్లు.. మొత్తం అందిన ప్రయోజనాల సంఖ్య 45,60,522.

డీబీటీ:–           రూ. 7,125.01 కోట్లు
నాన్‌ డీబీటీ:–    రూ. 6,871.89 కోట్లు
మొత్తం(రూ.):– రూ. 13,996.90 కోట్లు

కాపు వర్గాలకు చేకూరిన లబ్ది రూ.27,470.05కోట్లు.. మొత్తం అందిన ప్రయోజనాల సంఖ్య 72,02,562.

డీబీటీ:–           రూ. 17,459.42 కోట్లు
నాన్‌ డీబీటీ:–    రూ. 10,010.63 కోట్లు
మొత్తం(రూ.):– రూ. 27,470.05 కోట్లు

ఇతర పేద వర్గాలకు చేకూరిన లబ్ది రూ.41,362.03కోట్లు.. మొత్తం అందిన ప్రయోజనాల సంఖ్య 1,71,17,955.

డీబీటీ:–          రూ. 29,428.43 కోట్లు
నాన్‌ డీబీటీ:–    రూ. 11,933.61 కోట్లు
మొత్తం(రూ.):– రూ. 41,362.03 కోట్లు.

పథకాల వారీగా చేసిన వ్యయం, ప్రయోజనం పొందిన వారి వివరాలు చూస్తే..:

డీబీటీ పథకాలు:
జగనన్న అమ్మ ఒడి:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.19617.53 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన తల్లుల సంఖ్య 44,48,865.

27.06.2022న – జగనన్న అమ్మ ఒడి– వరసగా మూడో ఏడాది అమలు.
– శ్రీకాకుళం, కోడి రామ్మూర్తి స్టేడియమ్‌లో కార్యక్రమం. ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు మేలు చేస్తూ, 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేసిన సీఎం. 

జగనన్న వసతి దీవెన:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.3349.57 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన విద్యార్థులు 18,77,863.

08.04.4022 న వసతి దీవెన కింద రెండో విడత చెల్లింపులు:
– కొత్తగా ఏర్పాటు చేసిన నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో 2021–22 విద్యా సంవత్సరంలో 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

జగనన్న విద్యా దీవెన:
–ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.9051.57 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన తల్లుల సంఖ్య 24,74,544.

16.03.2022 న– జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈ విద్యా సంవత్సరంలో 10.82 లక్షల విద్యార్థులకు రూ.709 కోట్లను మరో త్రైమాసిక చెల్లింపులు చేశారు. 
– ఈ విద్యా సంవత్సరంలో 2021 అక్టోబరు–డిసెంబరు. త్రైమాసిక ఫీజు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ.
05.05.2022న – తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన సభలో జగనన్న విద్యాదీవెన కింద విద్యా సంవత్సరంలో మరో త్రైమాసిక చెల్లింపులు:
– జనవరి–మార్చి 2022 త్రైమాసికానికి సంబంధించి దాదాపు 10.85 లక్షల విద్యార్ధులకు రూ.709 కోట్లు చెల్లింపు:
05.07.2022 న– జగనన్న విద్యా కానుక– వరసగా మూడో ఏడాది పథకం అమలు:
–కర్నూలు జిల్లా అదోనిలో కార్యక్రమం. ఈ ఏడాది 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ.931.02 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్లు అందజేత:
11.08.2022 న– బాపట్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో విద్యాదీవెన త్రైమాసిక చెల్లింపులు.
– 11.02 లక్షల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద, వారి తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. 
30.11.2022 న–  అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన కార్యక్రమంలో  జగనన్న విద్యాదీవెన– మరో త్రైమాసిక చెల్లింపులు.
–  11.02 లక్షల విద్యార్థులకు మేలు చేస్తూ, తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ.

విదేశీ విద్యా దీవెన:
–ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.112.46 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య 1645.

వైయస్సార్‌ రైతు భరోసా:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.25,971.33 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 52,38,517.
16.05.2022.
వెయస్సార్‌ రైతు భరోసా– 4వ ఏడాది. తొలి విడత ఆర్థిక సాయం:
– ఏలూరు జిల్లాలో పర్యటన. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి  50.10 లక్షల రైతు కుటుంబాలకు రూ.3757.70 కోట్లు జమ చేసిన సీఎం:
17.10.2022 న– నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన కార్యక్రమంలో వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌– వరసగా నాలుగో ఏడాది రెండో విడత చెల్లింపులు.
– 50.92 లక్షల రైతుల ఖాతాల్లో రూ.4 వేల చొప్పున రూ.2,096.04 కోట్లు జమ. 

వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.1442.66 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 73,82,607.
22.04.2022 న – ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో  వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం వరసగా మూడో ఏడాది అమలు
 9.76 లక్షల స్వయం సహాయక మహిళల బ్యాంక్‌ రుణాలపై రూ.1261 కోట్ల వడ్డీ చెల్లింపు. 

వైయస్సార్‌ ఉచిత పంటల బీమా:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.6684.83 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 44,27,641.
14.06.2022న– శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌ గారు పర్యటన.
– వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా– వరసగా మూడో ఏడాది అమలు. 
– 2021 ఖరీఫ్‌ పంట నష్టపోయిన 15.61 లక్షల రైతులకు ఈ ఖరీఫ్‌ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్ల బీమా పరిహారం చెల్లింపు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.1834.83 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 20,39,823.
28.11.2022 న– రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ. వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు. వరుసగా మూడో ఏడాది.
– క్యాంప్‌ ఆఫీస్‌లో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా రూ.200 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి:

మత్స్యకార భరోసా:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.418 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన మత్స్యకారుల సంఖ్య 1,19,875.
13.05.2022న – మత్స్యకార భరోసా– వరసగా 4వ ఏడాది సాయం.
– కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ గారు పర్యటన. ఐ.పోలవరం మండలం మురమళ్లలో చేసిన సీఎం:
– 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.109 కోట్ల ఆర్థిక సాయం. 

వైయస్సార్‌ సున్నా వడ్డీ (స్వయం సహాయక బృందాలు ):
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.3615.28 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన మహిళల సంఖ్య 1,02,16,410.

వైయస్సార్‌ పెన్షన్‌ కానుక:
– ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.61,538.86 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందుతున్న వారి సంఖ్య 62,79,486 మంది.
– వైయస్సార్‌ పెన్షన్‌ కానుకను గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 2022 జనవరి 1 నుంచి రూ.250 పెంచి, రూ. 2,500 చేసిన ముఖ్యమంత్రి జగన్‌ గారు.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నుంచి మరో రూ.250 పెంచి, పెన్షన్‌ ను రూ. 2, 750 చేస్తున్నట్లు కేబినెట్‌ సమావేశంలో ప్రకటించారు. 
– దాంతో జనవరి 1, 2023 నుంచి పింఛను సొమ్ము అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలకు రూ. 2,750 అందనుంది. 
– మొత్తం 62 లక్షల పెన్షన్లకు నెలకు సుమారు  రూ.1786 కోట్లు ప్రభుత్వం వ్యయం చేయనుంది.

వైయస్సార్‌ చేయూత:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.14,110.62 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 26,39,703 మంది.
23.09.2022 న – చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కార్యక్రమంలో చేయూత– మూడో ఏడాది అమలు.
– 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4949.44 కోట్లు జమ.

వైయస్సార్‌ ఆసరా:
–ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.12,757.97 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 78,74,438 మంది.

వైయస్సార్‌ బీమా:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.1681.93 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 1,03,171 మంది.

వైయస్సార్‌ కాపు నేస్తం:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.1492 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 3,38,792 మంది.
29.07.2022 న– కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమం. వైయస్సార్‌ కాపునేస్తం– మూడో విడత చెల్లింపులు. 
– 3,38,792 మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.508.18 కోట్లు జమ. 

వైయస్సార్‌ నేతన్న నేస్తం:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.776.13 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 81,783 మంది.
25.08.2022 న– కృష్ణా జిల్లా పెడనలో జరిగిన కార్యక్రమంలో వైయస్సార్‌ నేతన్న నేస్తం– 4వ ఏడాది అమలు.
–80,546 మందికి రూ.193.31 కోట్లు జమ. 

జగనన్న చేదోడు (రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులు):
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.583.78 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 2,98,428 మంది.
08.02.2022 న జగనన్న చేదోడు రెండో ఏడాది పథకం అమలు. 
– క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం.
– 2,85,350 మంది ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.285.35 కోట్లు జమ.

వైయస్సార్‌ లా నేస్తం:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.23.70 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 2,012 మంది.

వైయస్సార్‌ వాహనమిత్ర:
–ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.1032.02 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 2,74,015 మంది.
15.07.2022న – విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో వైయస్సార్‌ వాహనమిత్ర– 4వ ఏడాది అమలు:
– 2,61,516 మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ. 261.52 కోట్లు జమ. 

వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.767.31 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 12,84,238 మంది.

ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.2086.12 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 23,236 మంది.

అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు చెల్లింపు:
– ఇందులో ఇప్పటి వరకు రూ.905.57 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 10.40 లక్షల మంది.

వైయస్సార్‌ ఈబీసీ నేస్తం:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.589 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 3,92,674 మంది.
25.01.2022 న వైయస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. 
– అగ్రవర్ణాల్లోని దాదాపు 3.93 లక్షల నిరుపేద మహిళలకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.589 కోట్లు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి క్యాంప్‌ కార్యాలయం నుంచి జమ చేసిన సీఎం.

డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ:
– ఈ పథకంలో ఆరోగ్యశ్రీ కింద ప్రొసీజర్స్‌ ను 3,255కు పెంచారు.  ఇప్పటి వరకు రూ.7338.76 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 22,33,466 మంది.

అర్చకులు. ఇమామ్‌లు. మౌజమ్‌లు. పాస్టర్లకు చెల్లింపు:
– వీరందరికి ఒకసారి ఇప్పటి వరకు రూ.37.71 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 77,290 మంది.

వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫాః
30.09.2022న – అమరావతి  క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా– పథకంతో పాటు, వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి.

కోవిడ్‌ సమయంలో తెల్ల రేషన్‌కార్డుదార్లకు సహాయం:
– ఇందుకోసం రూ.1350.54 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 1,35,05,338 మంది.

నాన్‌ డీబీటీ పథకాలు:
జగనన్న తోడు:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.2059.58 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 15,03,558 మంది.
28.02.2022 న– జగనన్న తోడు పథకం వరసగా మూడో ఏడాది పథకం అమలు:
–చిరు వ్యాపారుల్లో అర్హులైన వారికి రూ.10 వేల చొప్పున రూ.510.46 కోట్లు వడ్డీ లేని రుణాలు. అలాగే తొలి రెండు విడతల వడ్డీ కింద రూ.16.16 కోట్లు చెల్లింపు.
03.08.2022న – క్యాంప్‌ ఆఫీస్‌లో వర్చువల్‌గా కార్యక్రమం.
 – జగనన్న తోడు– చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం.
– 3.95 లక్షల చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలు.
– గత ఆరు నెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ తిరిగి చెల్లింపు. 

జగనన్న గోరుముద్ద:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.3239.43 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 43,26,782 మంది.

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.4895.45 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 35,70,675 మంది.

జగనన్న విద్యా కానుక:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.2368.33 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 47,40,421 మంది.

నిరుపేదలకు ఇళ్ల పట్టాలు:
– ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రూ.75,670.05 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 30,76,018 మంది.

పేదలకు ఇళ్ల నిర్మాణం:
– ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రూ.53,296 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 21,26,176 మంది.
28.04.2022 న– నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు. 
– అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఇళ్ల పట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:

వైయస్సార్‌ కంటి వెలుగు:
– ఈ పథకంలో ఇప్పటి వరకు రూ.113.51 కోట్లు వ్యయం చేయగా, ప్రయోజనం పొందిన వారు 79,94,151 మంది.

19.07.2022.
అర్హత ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందకపోతే మరోసారి వెరిఫికేషన్‌ చేసి, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేత. 
– క్యాంప్‌ ఆఫీస్‌లో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 3,39,096 మంది ఖాతాల్లో రూ.136.92 కోట్లు జమ:
–ఇంకా 2,99,085 మందికి వైయస్సార్‌ పెన్షన్‌కానుక వర్తింపు, కొత్త సామాజిక పెన్షన్ల వల్ల ఏటా రూ.935 కోట్ల భారం.
– కొత్తగా 7,051 మందికి బియ్యం కార్డులు, 1,45,47,036కు చేరిన బియ్యం కార్డుల సంఖ్య.
– కొత్తగా 3,035 మందికి వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులు. 1,41,12,752 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు.

ఇక 2022లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన, కొనసాగించిన పథకాలు, కార్యక్రమాలు చూస్తే..:

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంః
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 23.11.2022న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష. మీ భూమి–మా హామి పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ప్రారంభించారు. 100 సంవత్సరాల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 2 వేల గ్రామాల్లో రైతులకు జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ చేశారు. అలానే  2 వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించారు.
– దశల వారీగా  వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకాన్ని చేపడుతూ... రెండో దశ ఫిబ్రవరి– 2023లో మరో  నాలుగువేల గ్రామాలకు సంబంధించిన రైతులందరికీ పూర్తిగా భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అలానే, మూడో దశలో మే 2023 నాటికల్లా 6వేల గ్రామాల్లో, పట్టణాలలో భూహక్కు పత్రాలను పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ఆగష్టు 2023 నాటికి మరో 9వేల గ్రామాలు, పట్టణాలకు సంబంధించి రైతులందరికీ భూహక్కు పత్రాలను అందిస్తారు. 
– మొత్తంగా 17,584 రెవెన్యూ గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ భూములన్నింటికీ సమగ్ర సర్వే పూర్తి చేసి, భూరికార్డులన్నీ ప్రక్షాళన చేసి డిసెంబరు 2023 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. 

18.01.2022 న– సమగ్ర భూ రీసర్వేలో భాగంగా, మొదటి దశలో పైలట్‌ ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, క్లియర్‌ టైటిల్స్‌ ను ముఖ్యమంత్రి ప్రజలకు అంకితం చేశారు. 

11.01.2022.
జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ లో ప్లాట్ల కేటాయింపును ప్రారంభిస్తూ, వెబ్‌సైట్‌ లాంbŒ   చేసిన ముఖ్యమంత్రి. క్యాంప్‌ కార్యాలయంలో కార్యక్రమం.

27.01.2022.
గ్రామ, వార్డు సచివాలయాల్లో సిటిజన్‌ సర్వీస్‌ పోర్టల్‌. 2.ఓ ఏపీ సేవ.
క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి:

28.01.2022.
జగనన్న పాలవెల్లువ. అనంతపురం జిల్లాలో అమూల్‌ పాల సేకరణ.
క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం:
–బాలామృతం, అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాపై ఎంఓయూలు:

15.02.2022.

2021 నవంబరులో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ:
5.97 లక్షల రైతులకు రూ.542 కోట్లు చెల్లింపు. 1220 రైతు గ్రూప్‌లకు వైయస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.57 కోట్లు జమ. 
క్యాంప్‌ ఆఫీస్‌లో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి మొత్తం రూ.571.57 కోట్లు జమ.

07.04.2022.
వాలంటీర్లకు వందనం– వరసగా రెండో ఏడాది పురస్కారాలు. సన్మానం:
– పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానోత్సవాన్ని ప్రారంభించిన సీఎం:

21.04.2022.
బిర్లా గ్రూప్‌ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌–క్లోర్‌ ఆల్కలీ మ్యానుఫ్యాక్చరింగ్‌ సైట్‌ (కాస్టిక్‌ సోడా యూనిట్‌)ను ప్రారంభించిన సీఎం:
– తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం, బలభద్రపురంలో ముఖ్యమంత్రి పర్యటన. కార్యక్రమంలో పాల్గొన్న ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా.

20.07.2022.
నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు పనులకు భూమి పూజ. 
– రూ.3736.14 కోట్లతో తొలి దశ పనులు. 4 బెర్త్‌ల నిర్మాణం.

16.08.2022.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ ఎస్‌ఈజెడ్‌లో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రై  వేట్‌ లిమిటెడ్‌ ఫస్ట్‌ ఫేజ్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:
– అక్కడే మరో 8 కంపెనీలకు భూమిపూజ నిర్వహించిన ముఖ్యమంత్రి.

06.09.2022.
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ. నెల్లూరు బ్యారేజీల ప్రారంభం. విగ్రహాల ఆవిష్కరణ.
– పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటన. 

20.10.2022.
22(ఏ) సబ్‌ సెక్షన్‌ ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న భూముల డీనోటిఫికేషన్‌. క్లియరెన్స్‌ పత్రాల అందజేత.
– ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాలలో 22(ఏ) నిషేధిత జాబితాలో ఉన్న 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం.
దీని వల్ల ఆయా భూముల్లో సాగుచేసుకుంటున్న 22,042 మంది రైతులకు, వారి భూమి మీద వారికి హక్కు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం.
కృష్ణ  జిల్లా అవనిగడ్డలో కార్యక్రమం.

27.10.2022.
నెల్లూరు జిల్లాలో ఏపీ జెన్‌కో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి.
నెల్లూరు జిల్లాలో పర్యటన. ముత్తుకూరు మండలం, నేలటూరు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌.

04.11.2022.
అస్సాగో ఇండస్ట్రియల్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌ (బయో ఇథనాల్‌)ప్లాంట్‌కు శంకుస్థాపన:
– రూ.270 కోట్ల పెట్టుబడితో, 20 కిలోలీటర్ల (కెఎల్‌పీడీ) సామర్థ్యంతో ప్లాంట్‌. 300 మందికి ఉపాధి. తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం, గుమ్మళ్లదొడ్డిలో ప్లాంట్‌.

Back to Top