ఇసుక..బాబు మస్కా!

ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి తెరలేపిన చిన్నబాబు, పెద్దబాబు

టీడీపీ సర్కార్‌ తీరు వల్లే ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా

ఇసుక దోపిడీపై ప్రశ్నిస్తే దాడులు

దోపిడీని అరికట్టేందుకు నూతన ఇసుక విధానం

వచ్చే వారం నుంచి ఏపీలో ఇసుక వారోత్సవాలు

అమరావతి: టీడీపీ ప్రభుత్వం 2016 మార్చి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ పథకాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని జారీచేసిన జీవోను పచ్చనేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చిన్నబాబు లోకేష్‌, పెద్దబాబు చంద్రబాబులు ఇసుకాసురుల నుంచి మామూళ్లు వసూలు చేసి దోపిడీకి తెర లేపారు. ఉచిత ఇసుకను  టీడీపీ నేతలు అత్తగారి  సొత్తులా అమ్మేసుకున్నారు. ఇసుకాసురుల కారణంగా అప్పటి వరకు మార్కెట్లో 3 క్యూబిక్‌ మీటర్ల ట్రాక్టరు ఇసుక (ఒక యూనిట్‌) ధర రూ.2500 నుంచి రూ.3500 వరకూ పెరిగింది. ఇసుక ఉచితంగా ఇస్తున్నా ఈ ధరలు తగ్గక పోవడానికి టీడీపీ నేతలే కారణం. ఇటు గుంటూరు జిల్లా మొదలు కర్నూల్ వరకు.. ఉభయ గోదావరి జిల్లాలు మొదలు ఉత్తరాంధ్ర ప్రాంతం వరకు అక్రమార్కులదే ఇష్టారాజ్యంగా మారింది. అందునా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, వారి అండదండలున్న వారికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. 

రాష్ట్ర సరిహద్దులు దాటించారు
ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా ముసుగులో విలువైన ఇసుక జిల్లా సరిహద్దులే కాదు.. ఏకంగా రాష్ట్ర సరిహద్దులను దాటి అక్రమంగా తరలిపోయింది. ఈ వ్యవహారంలో కొద్దిమంది ఇసుక కాంట్రాక్టర్లు భారీగా వ్యవహారాలు నడుపుతూ.. రెవెన్యూ, పోలీసులను అటువైపు రాకుండా చేశారు. బళ్లారి, బెంగళూరు వంటి నగరాలకు ఏపీ నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను రవాణా చేశారు.

ఉచిత ఇసుక విధానంతో రెచ్చిపోయిన పచ్చనేతలు
ఒకవైపు ఇసుక దందా.. మరోవైపు పోలవరం పేరిట వేల కోట్లు పక్కదారి.. అడ్డువచ్చిన అధికారులపై దాడులకు తెగబడిన ప్రజాప్రతినిధులకు అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు.. ఇవే ఏపీలో చంద్రబాబు పాలనను అంతం చేశాయి. ఏపీలో ఇసుకమాఫియా దోపిడీ రూ.12,500 కోట్లు ఉంటుందని ఒక అంచనా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించిందంటే ఈ దందా ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. సీఎం చంద్రబాబు అండతో ఏపీలో దాదాపు 500కుపైగా ఇసుకరీచ్‌లను టీడీపీ నాయకులు తమ దోపిడీకేంద్రాలుగా మార్చుకొన్నారు.

ప్రశ్నిస్తే దాడులు...
ఇసుక దోపిడీపై ఎవరైనా ప్రశ్నిస్తే టీడీపీ నేతలు దాడులకు దిగారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఇసుక మాఫియాకు అడ్డుపడినవారిని పోలీస్‌స్టేషన్ ఎదుటే ఇసుక ట్రాక్టర్లతో తొక్కించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇసుక అక్రమ తవ్వకాన్ని ప్రశ్నించినందుకు మహిళా తాసిల్దార్ వనజాక్షిపై దాడిచేసిన ప్రభుత్వవిప్ చింతమనేని ప్రభాకర్‌కు చంద్రబాబే అండగా నిలబడ్డారు. పర్మిట్లులేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకున్న అధికారులపై అనంతపురం జిల్లాలో దాడులు జరిగాయి. తుంగభద్ర నది మధ్యలో ఓ మంత్రి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా నాలుగు కిలోమీటర్లు రహదారిని ఏర్పాటుచేసి ఇసుకను తరలింపునకు పాల్పడ్డారు. ఇక్కడి నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు.

పాలసీనే మార్చేసిన పచ్చ నేతలు
వాస్తవానికి ఇసుక తరలింపును మహిళా సంఘాలకు కేటాయించి వారికి ఆదాయవనరుగా మార్చాలని నిర్ణయించారు. అయితే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చక్రం తిప్పి.. మహిళా సంఘాల పేరుతో బంధువర్గాన్ని రంగంలోకి దింపడంతో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. దీంతో చంద్రబాబు ఇసుక విధానాన్ని ఉచితం చేశారు. ఇదే టీడీపీ నేతలకు వరంగా మారింది. అవసరాల కోసమంటూ నదీ పరివాహక ప్రాంతాల్లో మధ్యనుంచి ఇసుకను తీసుకురావడం, అక్కడ నుంచి ప్రత్యేకప్రాంతాలను ఏర్పాటు చేసుకుని అమ్ముకోవడం పరిపాటిగా మారింది. ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేందుకు ప్రభు త్వం పచ్చనేతలకు అవకాశం కల్పించడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయింది. ఎన్నికలవేళ చంద్రబాబు సర్కారుకు ఇది అత్యంత శరాఘాతంగా మారింది.

దోపిడీకి అవకాశం లేకుండా ఇసుక పాలసీ
రాష్ట్రంలో కొత్తగా ఏర్పటైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇసుక దోపిడీకి అవకాశం లేకుండా కొత్త పాలసీ తీసుకువచ్చింది.  పూర్తిగా చెడిపోయిన వ్యవస్థను బాగుచేయడం, తక్షణమే ఇసుక దోపిడీ పూర్తిగా అరికట్టి అధోపాతాళానికి పడిపోయిన రాష్ట్ర ప్రతిష్టను కాపాడేందుకు సీఎం వైయస్‌ జగన్‌ నడుం బిగించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జ‌గ‌న్ చెప్పినట్టు నూతన ఇసుక విధానం 5, సెప్టెంబర్ నుండి అమలులోకి వచ్చింది. గత ప్రభుత్వ హ‌యాంలో అందుకున్న ధ‌ర‌ల కంటే దాదాపు 50 శాతం త‌క్కువ‌కు ఇసుక‌ను అంద‌జేసేలా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది.అయితే ఇటీవల వరద ప్రవాహం అధికం కావడంతో కొంత ఇసుక కొరత ఉంది. ఈ ఇబ్బందులను కూడా అధిగమించేందుకు ప్రభుత్వం ఇసుక వారోత్సవాలను నిర్వహించి కొరత తీర్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

Read Also: రాష్ట్ర మంత్రివర్గ భేటీ

Back to Top