ఢిల్లీలో చంద్రబాబు దొంగ దీక్ష

నాలుగేళ్లు బీజేపీతో చంద్రబాబు కాపురం  

యువభేరిలకు హాజరైతే కేసులు పెడతామని బెదిరించడం

బీజేపీతో కలిసుంటే 2019 ఎన్నికల్లో జనం ఓటేయరని గ్రహించి ఏడాది ముందు తెగదెంపులు

నాలుగేళ్లు నవ నిర్మాణ దీక్షలు పేరుతో కాంగ్రెస్‌ను తిట్టిన నోటితోనే.. కాంగ్రెస్‌తో కాపురం

ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు మరోసారి కొంగ జపం చేయబోతున్నారు.  ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం నరేంద్ర మోడీని నిలదీస్తాడంట. అది కూడా ఎన్నికలు రాబోతున్న రెండు నెలల ముందు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని.., అది నెరవేరాలంటే ఢిల్లీలో దీక్ష చేయాలని ఇప్పటికి అనిపించింది. కొడుకు భవిష్యత్తు కోసం మూడేళ్లు ముందుగానే మంత్రి పదవి ఇచ్చుకున్నాడు. నోట్ల రద్దును దృష్టిలో పెట్టుకుని హెరిటేజ్‌ విషయంలో జాగ్రత్త పడ్డాడు. జగన్‌ ప్రాబల్యం తగ్గించాలన్న ఒకే ఒక్క కారణంతో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడు. బీజేపీతో కలిసుంటే 2019 ఎన్నికల్లో జనం ఓటేయరని గ్రహించి ఏడాది ముందు తెగదెంపులు చేసుకున్నాడు. కానీ ఏపీకి హోదా విషయం మాత్రం చంద్రబాబుకు ఇంత లేటుగా గుర్తురావడం బా«ధాకరం. 

గడిచిన నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టని కేసు లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 

జగన్‌ నిర్వహించే యువభేరిలకు హాజరైతే కేసులు పెడతామని బెదిరించడం తెలిసిందే. విద్యార్థులు చదువుకునే ఆయా కళాశాలల విద్యార్థులను యాజమాన్యాలు జగన్‌కు సపోర్టు చేస్తున్నారన్న కారణంతో ఇబ్బందులకు గురిచేశాయి. ఇదే చంద్రబాబు బీజేపీతో కలిసున్నంత కాలం కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీని ఎన్నిమాటలన్నారో చెప్పాల్సిన పనిలేదు. రాహుల్‌ గాంధీ ఏపీకి వస్తుంటే ఏ మొహం పెట్టుకుని వస్తారు.. పుండు మీద కారం చల్లుతారా అని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధికోసం బీజేపీతో జట్టుకట్టిన చంద్రబాబు ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలిని, కాంగ్రెస్‌ నాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. బీజేపీతో కలిసున్నంత కాలం నరేంద్ర మోడీ గ్రేట్‌.. ప్యాకేజీ బెస్ట్‌ అని ప్రచారం చేశాడు. అసెంబ్లీలో సైతం గంభీరంగా ప్రకటించాడు. అర్ధరాత్రి ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మరీ అరుణ్‌జైట్లీకి శాలువా కప్పి, తిరుపతి లడ్డూలు ఇచ్చి మరీ సన్మానం చే సి వచ్చిన ఘనత చంద్రబాబుది. నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రజల సొమ్మును 

అలాంటి భాబు.. ఎన్నికలు రాబోతున్న తరుణంలో సరిగ్గా ఏడాది ముందు బీజేపీతో  తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్‌తో కొత్త కాపురం పెట్టాడు. నాలుగేళ్లు నవ నిర్మాణ దీక్షలు పేరుతో కాంగ్రెస్‌ను తిట్టిన నోటితోనే.. కాంగ్రెస్‌తో కాపురం పెట్టాడో లేదో ధర్మ పోరాట దీక్షల పేరుతో నయ వంచనకు దిగాడు. 

చివర్లో పోరాడితే జనాలు నాలుగేళ్లు వంచనను మర్చిపోతారని చంద్రబాబు అభిప్రాయం. చివర్లో చేసిన హడావుడిని గుర్తుంచుకుంటారే తప్ప.. మోసాన్ని పట్టించుకోరని ఆయన నమ్మకం. ఇలాంటి చంద్రబాబు ఎన్నికలకు రెండు నెలల ముందు బీజేపీని ప్రశ్నిస్తే జనం నమ్మరు. 

నిన్ను నమ్మం బాబు

 

Back to Top