రైతన్నా నేనున్నా....

హామీ ఇచ్చా...బాధ్యుడినై ఉంటా

స్టేట్‌ ఫర్‌ ఫార్మర్‌

 

అమరావతి - ఆర్భాటాలకు అతీతంగా, ప్రచారప్రగల్భాలకు దూరంగా...ప్రజల మధ్యన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుదినోత్సవం జరుపుకున్నారు. జమ్మలమడుగులో జరిగిన సభ ముఖ్యమంత్రి మనోగతాన్ని స్పష్టం చేసింది. రైతులకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తన ప్రభుత్వం అపరిమిత శ్రద్దను కనబరుస్తుందన్న సంకేతాన్ని స్పష్టంగా పంపారు ముఖ్యమంత్రి. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిలానే రైతు సంక్షేమానికి పాటుపడే సంప్రదాయాన్ని చిత్తశుద్దితో కొనసాగించాలన్న తపన నవయువముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపించింది. 
తాను అధికారం చేపట్టి కేవలం ముప్పయిరోజులు మాత్రమే పూర్తయ్యాయి. కానీ, తాను సంకల్పించిన పనులన్నీ పూర్తిచేయాలన్న తపనతో..ఈ స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి ఎన్నెన్నో పథకాలను ఆచరణలోకి తేవడం మొదలుపెట్టారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు సున్నావడ్డీకే రుణాలు అందించే పధకం, పంటరుణాల కింద ఈసారి రూ.84,000కోట్లు ఇవ్వాలని నిర్ణయించి అమలు ప్రారంభించడం, రైతులకు తొమ్మిదిగంటల ఉచితవిద్యుత్‌ పగటిపూటే ఇవ్వడం, ఉచిత పంటల భీమా, ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు వంటివన్నీ పల్లెగడపల్లో వెలుగులు నింపాలన్న తపనతో చేసినవే. 
ముఖ్యమంత్రిగారి మరిన్ని వరాలుః
వైఎస్సార్‌ భరోసా పథకం కింద అందించదలచిన వార్షికసాయం రూ.12,500 మొత్తాన్ని ఏడునెలల ముందుగా, అక్టోబర్‌ నుంచే అమలు చేయాలని నిర్ణయించడం. 
గత ప్రభుత్వతప్పిదాల వల్ల ఏర్పడిన వేరుశెనగ విత్తనాల కొరతను తీర్చడానికి యుద్దప్రాతిపదికన వేరే రాష్ట్రాల్లో కొనుగోలు చేయించారు. నెలరోజుల్లోనే 3.57 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయడం, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరపై కొనుగోలు దారులతో మాట్లాడి ఒప్పించడం ముఖ్యమంత్రి జగన్‌ చిత్తశుద్దిని తెలియచేసే విషయాలే.
రైతులను అపారంగా నష్టపరుస్తున్న కల్తీవిత్తనాల దుర్మార్గం, నకిలీఎరువులు, నకిలీ పురుగుమందులను నిరోధించడానికి చర్యలు తీసుకోవడం వంటివన్నీ వ్యవసాయరంగపై ముఖ్యమంత్రి ప్రత్యేకశ్రద్దను పట్టిచూపుతున్నాయి. మరో అభినందనీయమైన ప్రయత్నానికీ శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌. రైతు కడగండ్లపై సంపూర్ణ అవగాహనవున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, మంత్రులు, అధికారులతో అగ్రికల్చర్‌మిషన్‌ ఏర్పాటు చేయడమే అ పధకం. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటైన మిషన్‌ ఇది. ఏపీ సీఎం అగ్రికల్చర్‌మిషన్‌ చాలా మంచిదని పాలగుమ్మిసాయినా«ద్‌లాంటి ప్రముఖులు ప్రశంసించడం గమనించాల్సిన విషయం. ఎవిరీబడీ లవ్స్‌ గుడ్‌ డ్రౌట్‌ అన్న పుస్తకాన్ని రాసిన సాయినాథ్‌ రామన్‌మెగసెసే అవార్డు విజేత కూడా. దేశవ్యాప్తంగా పల్లెగడపల్లోని రైతన్నల కడగండ్లను స్పష్టంగా చూసిన, తెలుసుకున్న మేధావి. ఆ దిశలో ..వ్యవసాయరంగాన్ని సంక్షోభంలో నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్న సీనియర్‌ జర్నలిస్టు సాయినాథ్‌. 
రాజన్న భీమాపథకం అమల్లోకి తెచ్చి చెప్పినమాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి, జమ్మలమడుగు సభలోనే బాధిత కుటుంబానికి ఏడులక్షల రూపాయల చెక్కును అందించారు. రైతు కుటుంబాల్లో విషాదానికి ముఖ్యమంత్రి అందిస్తున్న ఈ ఓదార్పు, పాలనలోని మానవీణకోణానికి అద్దం పట్టేది. 
వైయస్సార్‌ తర్వాత ప్రభుత్వాలు ఏటా ప్రకటించే భారీ బడ్జెట్లు, వార్షిక రుణప్రణాళికలు క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను తీర్చలేకపోయాయి. రైతులను పట్టిపీడిస్తున్న సమస్యలేమిటో, ఎక్కడెక్కడ వారికి సమస్యలు ఎదురవుతున్నాయో, పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు వైఎస్‌జగన్‌. ఆంధ్రప్రదేశ్‌లోని మూడుప్రాంతాల్లో రైతుల కష్టాలు, వ్యవసాయరంగ సంక్షోభంపై స్పష్టమైన అవగాహన వున్న ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన పనిచేస్తున్నారు. ఇచ్చినమాట తప్పని వైయస్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి...నాడు నేను వున్నాను అని ప్రజలకు ఇచ్చిన భరోసాను నిజం చేస్తున్నారు. రైతురాజ్యం...రాజన్న రాజ్యం సాకారమవుతుందన్న నమ్మకాన్ని ఇస్తున్నారు. రైతురాజ్యం తెచ్చే దిశలో అడుగులేస్తున్నారు. 
దేవుడి దయ, వైయస్సార్‌ ఆశీస్సులు, ప్రజల ప్రేమాభిమానాల తోడుగా తన సంకల్పబలంతో, ముఖ్యమంత్రి అనుకున్నవన్నీ సాధించాలి. అది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శ్రీరామరక్ష కావాలి.

తాజా వీడియోలు

Back to Top