సోషల్‌ మీడియా కింగ్ సీఎం వైయ‌స్ జగన్‌

ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానం..రెండో స్థానంలో ఏపీ సీఎం  వైయ‌స్ జగన్‌

 న్యూఢిల్లీ: అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేత అన‌తికాలంలోనే ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రికార్డు సృష్టించారు. సోషల్‌ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నారు.    ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను ‘చెక్‌బ్రాండ్స్‌’ సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో 95 మంది టాప్‌ పొలటికల్‌ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌ విశ్లేషించింది.

దాదాపు 10 కోట్ల ఆన్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, వికీ, యూట్యూబ్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ ప్రధాని మోదీ పేరుపైననే ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలవగా.. మోదీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తదుపరి స్థానాల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు.
 
 

Back to Top