కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న పచ్చ మీడియా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని టీడీపీకి జరిగిన భారీ అవమానాన్నీ తట్టుకోలేక విపరీత పోకడలకు దిగుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారం చేపట్టి పట్టుమని పదిరోజులు కాకుండానే పరిపాలన మీద పూటకో తీరుగా వాదనలు చేస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ అలజడులు సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచీ చేసిన ప్రతి పనినీ వక్రీకరిస్తున్న వారికి ఇవే సమాధానాలు.
ఇక తెలంగాణాలో ఆంధ్రా ఆస్తులు కేసీఆర్ కు అప్పజెబుతున్నాడని చేస్తున్న విష ప్రచారం కూడా అలాంటిదే. నిజానికి ఆంధ్రాకు కేటాయించిన ఆ పరిపాలనా భవనాలకు ఏపీ ప్రభుత్వమే అద్దెలు, పన్నులు చెల్లిస్తోంది. ఇన్నేళ్లుగా కోట్లాది రూపాయిలను ఉత్తి పుణ్యానికే తెలంగాణాకు చెల్లించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా హైదరాబాద్ లో నివాస భవనాలు, అధికారిక భవనాల కోసం కోట్ల రూపాయిలు వెచ్చించారు. అధికారులంతా అమరావతికి తరలి వచ్చాక, నాయకులంతా ఏపీలో పాలన చేస్తుండగా హైదరాబాద్ లో భవనాలకు అద్దెలు కట్టాల్సిన అవసరం ఏముంది? ఇది దారుణమైన ప్రజా దుర్వినియోగం కాదా? దీన్ని అరికట్టడానికే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ పరిపాలనా భవనాలను తిరిగి తెలంగాణాకు అప్పగించారు. దీన్ని మసిపూసి మారేడు కాయ చేసి ఆంధ్రా ఆస్తులను కేసీఆర్ కు కట్టపెడుతున్నారంటూ బాబు భజన మీడియా కోడై కూస్తోంది. దీని వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని మాత్రం మరుగు పరిచే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు భేషజాలకు కోట్ల రూపాయిలు ఎలా తగలబడ్డాయో, ప్రజల సొమ్ము ఎంత దుబారా ఖర్చు అయ్యిందో ఇప్పుడు లెక్కలు బయటపడుతున్నాయి. అవి పొక్కకూడదనే టీడీపీ వీరవిధేయులు అసలు విషయాలను పక్కదారి పట్టించి ఆంధ్రా ఆస్తులు తెలంగాణా పరం అంటూ అబద్ధపు ప్రచారాలకు తెగబడుతున్నారు. 

పాలన ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే తనదైన మార్కు వేస్తున్నారు యువ ముఖ్యమంత్రి. దీన్ని జీర్ణించుకోలేకే కోడి గుడ్డు మీద ఈకలు పీకే పనులు మొదలెట్టింది చంద్రబాబు ఆస్థాన మీడియా.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top