బాబును జనం నిలదీస్తే

ఇటీవల కొద్ది కాలంగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి , ఇతరులపై నిందలు వేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం రకరకాల ఆందోళనలకు పిలుపునిస్తూ, ముఖ్యమంత్రి హోదాలో సైతం  చంద్రబాబు దీక్షలు చేస్తున్నారు. మరి రాష్ట్రానికి తాను చేసిన అన్యాయంపై ప్రజలు నిలదీయడానికి...ఎన్నో...ఎన్నెన్నో .....

 రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా, ఆ తర్వాత ‘కోతలు’ పెట్టిన అంశంపై రాష్ట్ర  రైతులు చంద్రబాబు నిలదీస్తే? రుణమాఫీని పూర్తిగా అమలు చేయనందుకు రైతులు అడ్డం తిరిగితే?  సింగపూర్‌ కంపెనీలతో అమరావతిని నిర్మింపజేస్తానని చెప్పి, దేశీయ ఇంజినీర్లను ఎగతాళి చేసి, ఇపుడు దేశీయ కంపెనీలతో ఎందుకు నిర్మిస్తున్నారని నిలదీస్తే...?   నిరుద్యోగ యువతకు 2వేల రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చినా, చివరి ఏడాదితో తొలుత వెయ్యి అని ప్రకటించి..ఎన్నికలు వస్తున్నాయని 2వేలకు పెంచిన వైనంపై యువత నిగ్గదీస్తే?.
  నాలుగున్నరేళ్లకు పైగా డ్వాక్రా మహిళలను గాలికి వదిలేసి..ఎన్నికల ముందు పసుపుృ కుంకుమ పేరుతో హంగామా చేస్తున్న వైనంపై మహిళలు తిరుగుబాటు  చేస్తే?.  2018 డిసెంబర్‌కే  పోలవరం తొలిదశను పూర్తి చేస్తామని ఏకంగా అసెంబ్లీలోనే హామీ ఇచ్చి..ఇంకా సగం పనులు పెండింగ్‌ పెట్టారెందుకని  ప్రజలు ఎదురుతిరిగితే?.  పుష్కరాల నాటికి విజయవాడలో  కనకదుర్గ ఫ్లైఓవర్‌ ను పూర్తి చేస్తానని
హామీ ఇచ్చి..ఇప్పటికీ పూర్తి చేయని వైనంపై కృష్ణా జిల్లా ప్రజలు అడ్డం తిరిగితే?.  రాజధాని కోసమంటూ, తమ వద్ద లాక్కున్న  భూములను సింగపూర్ కంపెనీలకు..కార్పొరేట్‌ సంస్థలకు..ప్రైవేట్‌ వ్యాపారాలకు  దోచిపెడుతున్నారేంటి అని రైతులు నిలదీస్తే?.  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సాగిస్తున్న దోపిడీని జనం నిగ్గదీస్తే?.  పల్లెలకు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకుండా సింగపూర్‌ కు
విమానాలు నడిపేందుకు ప్రజల సొమ్మును వయబులిటి గ్యాప్‌ ఫండింగ్ (వీజీఎఫ్‌) కింద అప్పనంగా అప్పగించాల్సిన అవసరం ఏమిటని అని ఏపీ ప్రజలు తిరగబడితే?   చంద్రబాబు ఏం చెబుతారు. ప్రశ్నలకు జవాబు దొరక్క, ఆయన బయట కూడా అడుగుపెట్టలేరేమో? 

Back to Top