తెలుగుదేశంలో ఆగస్ట్‌ అలజడి!

నారా కుటుంబ భజన సంఘం సభ్యులకు 27 సంవత్సరాల నాటి ఘటనలే గుర్తుకొస్తున్నాయి

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని అడ్డగోలుగా గుంజుకున్న చంద్ర‌బాబు  

ప్ర‌స్తుతం కుట్రలు, వెన్నుపోట్లకు అవకాశం లేని ఆంధ్రప్రదేశ్‌ రూపుదిద్దుకోవడం చంద్రబాబు ముఠాకు పిచ్చెక్కిస్తోంది

అమ‌రావ‌తి: ఆగస్ట్‌15వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ భారతదేశంలో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఉత్సాహం మిన్నంటుతోంది. అయితే, ఆగస్ట్‌ వచ్చిందంటే చాలు టీడీపీ నేత చంద్రబాబు నాయుడుకు, ఆయన అనుచర బృందానికి ఒకటే అలజడి, ఆందోళన. మాజీ సీఎం, ఆయన కొడుకు లోకేష్, ఇతర నారా కుటుంబ భజన సంఘం సభ్యులకు 27 సంవత్సరాల నాటి ఘటనలే గుర్తుకొస్తున్నాయి. అప్పుడు సొంత పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన నుంచి అధికారం అడ్డగోలుగా చంద్రబాబు గుంజుకున్న విషయం టీడీపీ నేతల కళ్లకు కనిపిస్తోంది. చంద్రబాబు  బుర్రకు పదునెంతో హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ సాక్షిగా వైస్రాయ్‌ హోటల్‌ శిబిరం పర్యవసానాలు నిరూపించాయి. అప్పటి నుంచి 2004 వేసవి దాకా సాగిన చంద్రబాబు విన్యాసాలు తెలుగుదేశం శ్రేణుల్లో తమ కొత్త నేత తెలివితేటలపై అచంచల విశ్వాసం నింపాయి. ఇదంతా పాత కథ. విభజిత ఆంధ్రప్రదేశ్‌ ను ఏదో ఒడ్డున పడేస్తాడని తెలుగు ప్రజలు 2014లో చంద్రబాబుకు చివరిసారిగా అధికారం అప్పగించారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారు చంద్రబాబు, ఆయన సలహా బృందం సభ్యులు. అధికారం పోయాక మూడో ఆగస్టు వచ్చింది. మళ్లీ పాత దిగులు. ఆలోచన. అధికారం లేనప్పుడు ఆగస్ట్‌ నెలే చంద్రబాబు బృందానికి అక్రమ చర్యలకు అనుకూల సమయంలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు వెన్నుపోట్లకు, కుట్రలకు అనువైన ప్రాంతంగా లేదు. ఇదే టీడీపీ నేతలకు కొత్త పూనకం తెప్పిస్తోంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా మతి తప్పి నోటికొచ్చినట్టు అభాండాలు వేస్తున్నారు. ప్రజలేమో అసలు ప్రతిపక్షం పిలుపులకు స్పందించడం లేదు. సంక్షేమాంధ్ర ప్రదేశ్‌ లో పచ్చ చొక్కాల ఆటలు సాగడం లేదు. దీంతో వారు పాలకపక్షంపై కులం పేరుతో, అవినీతి పేరుతో నిందలు మోపుతున్నారు. ఈ ఆగస్టు నెల పూర్తయ్యే దాకా తెలుగుదేశం నేతలకు నిప్పులు మీద కూర్చున్నట్టే ఉంటుంది. అధికారం లేదనే ఆక్రోశంతో వారు చేసే విన్యాసాలు, చెప్పే మాటలు రాజకీయ ఉన్మాదానికి చిహ్నాలు మాత్రమే. చంద్రబాబు తొలిసారి గద్దెనెక్కిన రోజు సెప్టెంబర్‌ ఒకటి వచ్చే దాకా తెలుగుదేశం పిచ్చి చేష్టలకు అంతు ఉండదేమో. ఇప్పుడు కుట్రలకు, వెన్నుపోట్లకు అవకాశం లేని ఆంధ్రప్రదేశ్‌ రూపుదిద్దుకోవడం చంద్రబాబు ముఠాకు పిచ్చెక్కిస్తోంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top