ఏపీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ మణిహారం

విద్యార్థులకు 42 రకాల నైపుణ్య కోర్సులు

 1.60లక్షల మంది విద్యార్థులకు సౌలభ్యం

 ప్రతి విద్యార్థికీ వంద డాలర్ల బహుమతి కూపన్

 మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇది తొలి ప్రయత్నం

కోర్సు పూర్తికాగానే విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్లు

'ప్రతి విద్యార్థి ఉద్యోగార్హత పొందే అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం

వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమం

అమరావతి: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, తన చరిత్రలో మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఆరంభించింది. రాష్ట్రంలోని విద్యావంతులైన యువతకు డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచి, నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచవ్యాప్తంగా అన్వేషిస్తున్న సంస్థలు, కంపెనీలకు ఒక చిరునామాగా ఏపీని తీర్చిదిద్దే బృహత్ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో విద్య, ఉన్నత విద్యారంగంలో తీసుకొస్తున్ విప్లవాత్మక మార్పులు మైక్రోసాఫ్ట్ సంస్థను ఆకట్టుకుంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శుక్రవారం వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, సీఎం కార్యాలయ విదేశీ విద్యావ్యవహారాల అధికారి డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య కో ఆర్డినేట్ డాక్టర్ కుమార్ అన్నవరపు, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ముందుకు రావడం ముదావహమన్నారు. రాష్ట్రంలోని విద్యా యువతకు మైక్రోసాఫ్ట్ అందించరే డిజిట్ నైపుణ్య సాధన ఎంతో ఊతమిస్తుందని, ఈ శిక్షణ పొందడం ద్వారా యువత ఉద్యోగం పొందే అవకాశాలు తప్పకుండా వస్తాయన్నారు. డిజిటల్ కనెక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ చేరువ కానుందని, దాదాపు 80 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు.

మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ..మైక్రోసాఫ్ట్ సంస్థలో జరిగిన ఈ అవగాహన ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు వృత్తి విద్యా కశాళాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోకరంగా ఉంటుందన్నారు. కళాశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ముందగానే మైక్రోసాఫ్ట్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడం సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా వారు మంచి అవకాశాలు పొందడానికి మార్గం సుగమమవుతుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని, ఉన్నత విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను యువతకు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాలకు ఇప్పడు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు జతకలవడం మరింత ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు 42 రకాలకు పైగా నైపుణ్య శిక్షణలు ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగై వారు మంచి అవకాలు పొందడానికి ఇది ఊతమిస్తుంది అన్నారు.

మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయడానికి తాము ఎంతో ఉత్సుకతతో ఉన్నామన్నారు. దేశంలో డిజిటల్ ఎకానమీలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే ఈ డిజిటల్ స్కింగ్ అనేది ఒక పునాదిలాగా పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని యువతలో

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top