వైయ‌స్ఆర్ రైతు భరోసా కేంద్రాలుగా నామ‌క‌ర‌ణం

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

తాడేప‌ల్లి: రైతు భరోసా కేంద్రాలకు దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును పెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రైతు భరోసా కేంద్రాలను ‘డాక్టర్ వైయ‌స్సార్‌ రైతు భరోసా కేంద్రాలు’గా ప్రభుత్వం వ్యవహరించనుంది. రైతులకు మాజీ సీఎం వైయ‌స్సార్‌ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో రైతుల ముంగిటకే, వారు తమ ఊరి నుంచి అడుగు బయట పెట్టకుండానే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30న  సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.  వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా కేంద్రాలుగా నామ‌క‌ర‌ణం చేయ‌డం ప‌ట్ల అగ్రిమిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి, రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Back to Top