అమ్మ ఒడి అద్భుతం..శుభోదయం.. మహోదయం

పేద బిడ్డల చదువుల వెలుగు..అమ్మ ఒడి

చదువుల విప్లవానికి నాంది

బిడ్డలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15వేలు

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న జగనన్న అమ్మ ఒడి పథకం

అమరావతి:  "అమ్మా, నోట్‌ బుక్‌ కావాలే. పెన్ను కొనాలే. రికార్డు బుక్‌ లేదే' ...ఇలా ఓ పేదింటి బిడ్డ అడిగినప్పుడల్లా..అవసరమయ్యే పదోపరకో డబ్బులకు కూడా తల్లడిల్లిపోయే తల్లులెందరో వున్న సమాజం మనది. అవును మరి, పేదరికం పార్శా్వలెన్నో...అవి పేదబిడ్డల భవిష్యత్తును అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించేవే. అందరూ చూస్తాం. ఆ బాధలు వింటాం. ఎవరి దారిన వారెళ్లిపోతాం. నాయకులైతే...ఓటు అవసరమైనప్పుడు మీకు సాయం చేస్తామని...హామీఈ ఇచ్చి, ఆ తర్వాత గద్దెనెక్కాక మరిచిపోవడం మామూలు తంతే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ తరహా రాజకీయాలకు, పాలనకు చోటు లేదిప్పుడు. ప్రభుత్వాధినేత ప్రజలకు పూర్తి స్థాయి బాధ్యత వహించాలని గట్టిగా సంకల్పించుకున్నారు. పేదలకోసం ప్రవేశపెట్టిన  అనేక సంక్షేమపథకాల వరుస క్రమంలో, మకుటాయమానంగా ఇప్పుడు అమ్మ ఒడి’ పథకం వస్తోంది. ఈ జనవరి 9నుంచి అమలు కాబోతున్న అమ్మ ఒడి పథకం ఓ నిశ్శబ్ద విప్లవానికి తెరతీస్తోంది. సామాజికంగా పేదల గడపల్లో చదువుల వెలుగులు పంచే గొప్ప దార్శనికతతో కూడిన పథకంగా...ఆంధ్రప్రదేశ్‌లో అమలు కాబోతోంది. వేలాది మంది అమ్మల కళ్లల్లో బిడ్డల చదువులు Ðð లిగిపోతూ కనిపించే ఓ అపూర్వ సమయాన్ని సీఎం జగన్‌ చిత్తూరు జిల్లాలో ఆవిష్కరించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థిలోకం థ్యాంక్యూ సీఎం అంటున్న సందర్భమిది.
చదువు – వెలుగుః
అమ్మ ఒడి పథకం లక్ష్యం నెరవేరేలా పటిష్ట కార్యాచరణకు ఏర్పాట్లు జరిగాయి. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టక...నాడు–నేడు పేరిట ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే గొప్ప ఆలోచన కూడా చేశారు సీఎం. అన్ని సౌకర్యాలతో, చదువుకునే వాతావరణంతో స్కూళ్లలకు మెరుగులు దిద్దాలన్న ఆయన సంకల్పానికి సెల్యూట్‌ కొట్టాల్సిందే. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో నాడు–నేడు పథకం కింద అభివృద్ది పనులు చేపడుతున్నారు. అలాగే బడిపిల్లలకు మధ్యాహ్న భోజనపథకం విషయంలోనూ...మనసున్న మనిషిగా ఆలోచన చేశారు సీఎం. సరైన పోషకాహారం అందించి తీరాలన్న ఆదేశాలు ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచడానికి రూ. 200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని సీఎం చెబుతున్నారు.  స్కూళ్లు తెరిచే నాటికి పాఠశాలల పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించాలని, స్కూల్‌కిట్‌లో మూడుజతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ఒక జత షూ, సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించడమూ జరిగింది. విద్యావ్యవస్థలో అందరినీ భాగస్వాముల్ని చేయాలని ఆలోచిస్తున్నారు.  పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదవాలి..పేద కుటుంబాల తలరాతలు మారిపోవాలని పాదయాత్ర దారెంబడి, చెబుతూ వచ్చిన జగన్, ముఖ్యమంత్రిగా ఆ దిశలో గట్టి అడుగులేస్తున్నారు. చదువు తలరాతల్ని మారుస్తుందన్న ఆయన గట్టి నమ్మకం...ఇప్పుడు పేదబిడ్డలకు వరమయింది. పేదపిల్లలు బడిలో ఉండేలా చూసేందుకు ఉద్దేశించిన అమ్మ ఒడి పథకం వంటివి,  గతంలో దేశంలో ఎక్కడా అమలు చేయలేదు. పేదకుటుంబాల్లోని పిల్లల విద్యకు ఆర్థికంగా ఏసాయం చేసినా మంచిదేనని, విద్యావేత్తలెందరో అమ్మ ఒడి పథకాన్ని ప్రశంసిస్తున్నారు. ఇంత మంచి పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.
అద్భుతమైన పథకం...అందరూ భాగస్వాములేః
అమ్మ ఒడి పథకం తల్లుల్లో చైతన్యం తీసుకొచ్చి, ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత ఎంఈవోలు, ఎంఆర్‌సీలు, సీఆర్సీలు, హెచ్‌ఎంలు, సబ్జెక్టు టీచర్లు..ఇలా అందరూ పూర్తిస్థాయిలో ఉండి, వారి విధుల్ని సక్రమంగా నిర్వహిస్తే, సీఎం జగన్‌ సంకల్పించిన సదుద్దేశం సక్సెస్‌ అయినట్టే. అది భావితరాలకు కచ్చితంగా వెలుగుబాట అవుతుందని ఏపీ ప్రజలందరూ గట్టిగా నమ్మాలి.
పేద పిల్లల చదువుకు వెలుగు ...అమ్మబడి పథకానికి జే కొడదాం. గొప్పలక్ష్యానికి, మంచి సంకల్పానికి జేజే కొడదాం. హేట్సాఫ్‌ టు సీఎం ఆఫ్‌ ఏపి.

జగనన్న అమ్మ ఒడి పథకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. నవరత్నాల్లో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రకటించారు. 
- ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వస్తోంది. ఈ పథకం కింద బడికి వెళ్లే పిల్లల తల్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.  

ఉద్దేశం: 
- డబ్బులు లేక ఏ ఒక్క చిన్నారి చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతోనే వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో అమ్మఒడి' పథకాన్ని ప్రకటించారు.  
- బిడ్డలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద ఏటా రూ.15వేలు అకౌంట్లో జమ చేస్తారు. 
- జనవరి 9న అమ్మ ఒడి పథకం చిత్తూరు జిల్లాలో ప్రారంభం కాబోతోంది.

అర్హతలు:
- దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు అర్హులు. అర్హులైన పిల్లల తల్లులకు ప్రతి ఏడాది జనవరిలో రూ.15 వేలు అందిస్తారు. తల్లిదండ్రులు లేనిపక్షంలో సంరక్షకులకు ఇస్తారు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు సహా ప్రభుత్వ, ప్రైయివేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్‌స్కూళ్లు, జూనియర్‌కాలేజీల్లో చదువుతున్న పిల్లల తల్లులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.  
- అమ్మ ఒడి స్కీమ్‌అర్హతకు తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉండాలి.  లబ్ధిదారులకు ఆధార్‌కార్డు తప్పనిసరి. స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే విద్యార్థులు కనీసం 75 శాతం హాజరును కలిగి ఉండాలి. 

తెల్ల రేషన్ కార్డు లేకపోయినా...
- అమ్మఒడి పథకం కోసం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. పేదరికంలో ఉండి తెల్లరేషన్ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అర్హత ఉందా లేదా అని విచారించి పరిగణలోకి తీసుకుంటారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి కూడా అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. 

ఇలా గుర్తించారు:
- విద్యార్థులు, తల్లి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుల వివరాలను ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 
- రేషన్ కార్డులు ఉన్న వారి వివరాలను ఒక నివేదిక, రేషన్ కార్డు లేని వారు, కార్డు ఉండి ప్రభుత్వ ఆదాయం ఎక్కువ ఉన్న వారి వివరాలతో మరో జాబితాను రూపొందించారు. 
- రేషన్ కార్డులు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువ ఉన్న వారు 8 లక్షల వరకు ఉన్నట్లుగా తేలిందట. గ్రామ వాలంటీర్లతో వీరి వివరాలను పరిశీలించారు. ఇందులో అరవై వేల మందికి పైగా లబ్ధిదారులు తేలారు.

 
ఎంత మందికి లబ్ధి:
 - అమ్మ ఒడి లబ్ధిదారుల తొలి జాబితా లో మొత్తం 42,80,823 మందిని ప్రభుత్వం గుర్తించింది.   
-  ఇంకా పరిశీలన కొనసాగుతున్నతల్లులు/ సంరక్షకులు 13,37,168
- అమ్మఒడి కోసం బడ్జెట్లలో రూ.6,455.80కోట్లు కేటాయించారు.  
- రాష్ట్రంలోని స్కూళ్లు 61,271 కాలేజీలు 3,083
 

Back to Top