అధికారమే వారి ఆయుధం

అధికారం, కులం తెస్తున్న దురహంకారం

తప్పు ఎత్తి చూపితే శివాలు

అధికార దుర్వినియోగం 

ఆరునెల్ల సావాసానికి వారు వీరౌతారంటారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆరు నెలలు ఉద్యోగం చేసాడో లేదో ఆ కానిస్టేబుల్ కు ఆ పార్టీ అధికార దురహంకారం అలవాటుగా అబ్బేసింది. సిటీబస్సులో వేలాడద్దన్నందుకు వెర్రెత్తిపోయి సర్రున తుపాకీ ఎత్తి కాల్పులు జరిపేసాడు. తప్పులు ఎత్తి చూపితే చిరాకుపడి చెలరేగిపోయే చంద్రబాబు నాయుడిలాగే ఆ కానిస్టేబుల్ నాయుడు కూడా గంగవెర్రులెత్తాడట. అధికారం చేతిలో ఉంటే ఆయుధం ఉన్నట్టే అని ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అనుకున్నట్టే, ఆయుధం చేతిలో ఉంటే ఎవరిపైనైనా అధికారం చెలాయించొచ్చు అని ఈ కానిస్టేబుల్ అనుకున్నట్టున్నాడు. యధారాజా తథా ప్రజ అన్నట్టు యధా బాబు తధా పోలీసులన్నమాట. 

అఫ్ కోర్స్ ఆ విషయం ఇవాళ కాదు ఎన్నాళ్లుగానో ప్రూవ్ అవుతూనే ఉందనుకోండి.. ప్రతిపక్ష నేతను విశాఖలో అడ్డుకున్నప్పుడు, రామ్ గోపాల్ వర్మను విజయవాడలో అక్రమంగా నిర్బంధించినప్పుడు, చింతమనేని రౌడీఇజాన్ని చూసీ చూడకుండా వదిలేసినప్పుడు, అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డం పడనప్పుడూ పోలీసుల తీరు బాబుకు జీ హుజూరు అని ప్రజలంతా అర్థం చేసుకున్నారు. పోలీసు బాసులు, ఇంటిలిజెంట్ ఛీఫ్ లే చంద్రబాబుకు వత్తాసులైనప్పుడు హెడ్ కానిస్టేబులు మాత్రం కాకుండా పోతాడా? మన భ్రమ కానీ...అందునా సొంత సామాజికవర్గం అనే మరో ప్రత్యేక లైసెన్సు ఉందాయె! అదుంటే చాలు ఎంతటి అమానుషం చేసినా చెల్లిపోతుందని ఎవరికి తెలియదు? అందుకే ఆ హెడ్డుగారు అలా పబ్లిక్ లో తన పవరు చూపించాలనుకున్నాడు. అధికారపార్టీ అండవుంది. ఆయుధం చేతిలో ఉంది..ఇంకేం కావాలి...జనాల మీద విరగబడితే అడిగేవాడెవ్వడు అని రెచ్చిపోయాడు. ప్రజల రక్షణ కోసం అంటే తటపటాయింపు ఉంటుందేమో కానీ అహంకారం చూపడానికి ఆలోచనెందుకు?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆ నాయుడిగారి కోసం ఈ నాయుడిగారి సెక్యూరిటీ పటిష్టంగానే ఉంది కానీ, అతడి చేతుల్లో ప్రజలకే సెక్యూరిటీ లేకుండా పోయిందన్నమాట. చేతిలో గన్నుంది కదా అని కన్నూమిన్నూ కానకుండా రెచ్చిపోయి, బస్సులో సర్వీస్ పిస్టల్ తో భీభత్సం చేసిన ఈ డాబు నాయుడిని తెలంగాణా టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తుపాకితో తూటాలతో బెదిరింపులు చేస్తున్న ఈ నాయుడిపై విచారణ జరుగుతున్నట్టే....అధికారం అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులను చేసిన ఆ నాయుడిగారి చర్యలపై ఎప్పుడు విచారణ జరుగుతుందో???

తాజా ఫోటోలు

Back to Top