ఆదర్శం..యువ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

సీఎం తీరును బయటపెట్టిన జెరూసలెం జీవో

జెరూసలేం పర్యటనకు సంబంధించిన సెక్యూరిటీ కోసం 23లక్షలు

మంగళగిరి పక్కనే పది కిలోమీటర్ల దూరం వెళ్లినా చంద్రబాబు ఖర్చు కోట్లలో

రాష్ట్రానికి భారమయ్యే ఏ చర్యనూ వైఎస్ జగన్ ప్రోత్సహించడం లేదు

 

వైఎస్ జగన్ జెరుసలేం టూర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీ అయ్యింది. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఇది. ఈ టూర్ పూర్తిగా వ్యక్తిగతం అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడే ఓ ఆశ్చర్యకరమైన విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే ఈ పర్యటన నిమిత్తం విడుదలైన ఒక జీవో.
అందులో ముఖ్యమంత్రి జెరూసలేం పర్యటనకు సంబంధించిన సెక్యూరిటీ కోసం 23లక్షలు సాంక్షన్ చేస్తున్నట్టుగా ఉంది. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు టిక్కెట్లు కొని దావోస్ కి వెళ్లినా, పెట్టుబడుల కోసం అంటూ దేశదేశాలూ చక్కర్లు కొట్టినా, విహార యాత్రకు వెళ్లినా, చివరకు మంగళగిరి పక్కనే పది కిలోమీటర్ల దూరం వెళ్లినా ఆయన ఖర్చు కోట్లలో ఉండేది. ప్రత్యేక విమానాలు, హెలీప్యాడ్ లు, మంది మార్బలం, హోటల్ ఖర్చులు తడిసి మోపడయ్యేవి. పదికోట్లకు తక్కువ లేకుండా ఒక్కో ప్రయాణ వ్యయం ఉండేది. సొంత పర్యటనకు, కుటుంబం కలిసి నెలల తరబడి హోటళ్లలో స్టే చేసినందుకు కూడా కోట్లాది రూపాయిల ప్రజాధానం విచ్చలవిడిగా ఖర్చు అయ్యేది. వందల కోట్ల రూపాయిల బిల్లులు సమర్పించే జీవోలు గత ప్రభుత్వ హయాంలో కుప్పలు తెప్పలుగా చూసాం. 
కానీ ఇందుకు విరుద్ధంగా తన సొంత పర్యటనకు తానే స్వయంగా ఖర్చు పెట్టుకునే ముఖ్యమంత్రిని తొలిసారి చూస్తున్నాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ముఖ్యమంత్రికి ప్రొటోకాల్ గా ఉండాల్సిన సెక్యూరిటీ కోసం మాత్రమే బహు తక్కువగా 23 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. బోర్డింగ్, లాడ్జింగ్ ల ఖర్చు ప్రస్తావనే లేదు. ఇజ్రాయిల్ లోని ఖీటజీpl్ఛ S ఖీౌuటట్చnఛీ ఖీట్చఠిl్ఛటకు ఈ డబ్బును బదిలీ చేయాలని ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ జీవోను జారీ చేసింది. అధికారిక పనులైనా లేదా వ్యక్తిగత పనులైనా పక్కదేశాలకూ, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రికి సెక్యూరిటీని అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ వైఎస్ జగన్ తన వ్యక్తిగత ప్రయాణానికి సంబంధించి ఖర్చును ఖజానా నుండి తీసుకోవడం లేదు. రాష్ట్రానికి భారమయ్యే ఏ చర్యనూ వైఎస్ జగన్ ప్రోత్సహించడం లేదు. తాగే నీటి నుంచి విధానపరమైన నిర్ణయాల వరకూ ప్రతి చోటా పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. ప్రభుత్వాధినేతలు ఖజానాకు ట్రెజరీలే కానీ గుత్తేదారులు కాదని తెలియజేస్తున్నారు. తన విభిన్న వ్యవహారశైలితో, సంస్కరణాత్మక పాలనతో ఆదర్శంతుడైన యువ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 

 

Back to Top