2018: ప్రజా సంకల్పయాత్ర రౌండప్‌

ప్రజల సమస్యలపై అహర్నిశలూ పోరాటం చేస్తూ.. వారి మధ్యనే ఎక్కువకాలం గడుపుతూ... అందరి బంధువుగా గుర్తింపు పొందిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్‌ 6వ తేదీన ఒక్క అడుగుతో మొదలైన ఈ యాత్ర.. వందలు.. వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు దాటుకుని 3,500 కిలోమీటర్లనూ అధిగమించింది. అశేష జనవాహిని సాక్షిగా కొనసాగుతున్న ప‍్రజా సంకల్పయాత్రను మరొకసారి గుర్తు చేసుకుంటూ 2018 రౌండప్‌..

01–01–2018
ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 49వ రోజుకు చేరుకోగా, ఆరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగింది. అప్పటికే వైఎస్సార్‌ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో యాత్ర ముగిసింది.

02–01–2018
పాదయాత్రలో 50వ రోజున పాదయాత్ర చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని జమ్ములవారిపల్లి వద్ద 700 కి.మీ మైలురాయి దాటింది.

06–01–2018
పాదయాత్రలో 54వ రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని కల్లూరు వద్ద ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
 
07–01–2018
పాదయాత్రలో 55వ రోజున చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌కు అసాధారణ రీతిలో స్వాగతం పలికిన ప్రజలు, అభిమానులు. చంద్రబాబు సొంత మండలంలో జగన్‌ వెంట ‘జన సునామీ’.. 7 కి.మీ పొడవునా అడుగడుగునా అభిమానం. మంగళహారతులు, మేళతాళాలు, కోలాటాలు, కర్రలపై నడకలు. 

09–01–2018
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

10–01–2018
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలంలోని నల్లవెంగనపల్లి వద్ద పాదయాత్రలో 800 కి.మీ పూర్తి చేసిన వైఎస్‌ జగన్‌.

11–01–2018
చిత్తూరు జిల్లాలోనే చంద్రగిరి నియోజకవర్గంలోని నెమ్మళ్లగుంటపల్లి వద్ద వైఎస్‌ జగన్‌.. రైతులతో ముఖాముఖిలో కార్యక‍్రమంలో పాల్గొని వారి సమస్యలపై చర్చించారు.

12–01–2018
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిమ్మరాజుపల్లి హరిజన వాడ మీదుగా ఎన్‌ఆర్‌ కమ్మపల్లి చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. కాసేపు పొలాల్లో రైతులతో కలిసి కలివిడిగా తిరిగారు. ఆ తర్వాత చంద్రబాబు అనే రైతుకు చెందిన పొలంలో మినీ ట్రాక్టర్‌ నడిపిన ఆయన వరి నాట్లు వేశారు.

13–01–2018
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

17–01–2018
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపనాయుడుపేట వద్ద బీసీలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌.

21–01–2018
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం, చెర్లోపల్లి వద్ద పాదయాత్రలో 900 కి.మీ పూర్తి చేసుకున్న ప్రజా సంకల్పయాత్ర. అదే రోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపం సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు.

23–01–2018
రాయలసీమలో పాదయాత్ర ముగించి కోస్తాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర. యాత్ర 69వ రోజున నెల్లూరు జిల్లా పీసీటీ కండ్రిగ వద్ద కోస్తాలోకి అడుగు పెట్టిన జననేత.

24–01–2018
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

28–01–2018
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొన్న  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

29–01–2018
నెల్లూరు జిల్లా వెంకటగిరి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం శివారు వద్ద పాదయాత్రలో 1000 కి.మీ పూర్తి చేసుకున్న ప్రజాసంకల్ప యాత్ర‌. ఈ సందర్భంగా అక్కడి కైవల్య నది పక్కన నిర్మించిన 25 అడుగుల ‘విజయ సంకల్ప స్థూపం’ను జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిఆవిష్కరించారు.పాదయాత్రలో 1000 కి.మీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఇదే రోజున అన్ని చోట్లా పార్టీ శ్రేణులు ‘వాక్‌ విత్‌ జగనన్న’ కార్యక్రమం నిర్వహించాయి.

30–01–2018
నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలిచేడుకు ముందు శివారులో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న  వైఎస్‌ జగన్‌.

31–01–2018
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండల కేంద్రంలో జరిగిన బహిరంగసభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

03–02–2018
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం, సౌత్‌ మోపూర్‌లో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.
 
04–02–2018
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని ములుముడి వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్‌‌. ఆ తర్వాత దేవరపాలెం ప్రారంభ శివారులో వైశ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 

05–02–2018
నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో బహిరంగ సభలో పాల్గొన్నజగన్‌.

06–02–2018
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో జగన్‌ పాల్గొన్నారు.

07–02–2018
 నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, ఏఎస్‌ పేట మండలం, కొలిమెర్ల క్రాస్‌ రోడ్స్‌ వద్ద 1100 కి.మీ మైలురాయి దాటిన ప్రజా సంకల్పయాత్ర.
 
10–02–2018
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం బోదగుడిపాడులో బహిరంగ సభలో పాలొన్న వైఎస్‌ జగన్‌.
 
13–02–2018
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, కలిగిరి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

14–02–2018
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, అదే మండలంలోని జంగాలపల్లిలో ఉదయగిరికి చెందిన హస్త కళాకారులు ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించిన వైఎస్‌ జగన్. హస్త కళాకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

15–02–2018
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేనుమాలలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

16–02–2018
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలంలోని రామకృష్ణాపురం వద్ద పాదయాత్రలో 1200 కి.మీ ప్రస్థానం చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

18–02–2018
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని అదే మండల కేంద్రంలో వైఎస్‌ జగన్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు.

20–02–2018
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని తిమ్మపాలెం శివారులో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

24–02–2018
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

25–02–2018
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నందనమారెళ్ల వద్ద పాదయాత్రలో 1300 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్‌ జగన్‌‌.

26–02–2018
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం, పొదిలి మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌‌.

28–02–2018
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని చీమకుర్తిలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌. మరోవైపు  అదే రోజున ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో 100 రోజులు పూర్తి చేసుకున్నారు.

03–03–2018
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని తాళ్లూరు మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు అదే నెల 5వ తేదీన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలకు ఆయన ఆరోజు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శివరాంపురం వద్ద సమావేశమైన జననేత ఆ తర్వాత వారి వాహనశ్రేణికి జెండా ఊపి, ఢిల్లీ యాత్రను ప్రారంభించారు. 

04–03–2018
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం, అదే మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

05–03–2018
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని నాగులపాడు వద్ద  1400 కి.మీ మైలురాయి దాటిన జననేత పాదయాత్ర.

06–03–2018
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం, ఇంకొల్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

10–03–2018
ప్రకాశం జిల్లా చీరాలలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

12–03–2018
ప్రకాశం జిల్లాలో యాత్ర ముగించుకుని గుంటూరు జిల్లాలో అడుగుపెట్టిన ప్రజా సంకల్పయాత్ర. 110వ రోజు పాదయాత్రలో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని స్టూవర్టుపురం వద్ద జిల్లాలోకి ప్రవేశించింది.

14–03–2018
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర 1500 కి.మీ మైలురాయిని దాటింది.

17–03–2018
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను శివారులో రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.
 
19–03–2018
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొమ్మూరు వద్ద ప్రజాసంకల్ప మానవహారంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌. అదే రోజు సాయంత్రం పెదనందిపాడులో బహిరంగ సభలో పాల్గొన్నారు. 

21–03–2018
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని కళామందిర్‌ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

24–03–2018
సాక్షి పత్రిక 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గంలోకి ఇర్లపాడు క్రాస్‌ వద్ద  వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా కేక్‌ కట్‌ చేశారు.

27–03–2018
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు వద్ద పాదయాత్రలో 1600 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్‌ జగన్‌.

28–03–2018
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని గుడిపూడి ప్రారంభ శివారులో బీసీలతో ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

29–03–2018
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

31–03–2018
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం, పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. 

03–04–2018
గుంటూరు నగరంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న కింగ్‌ హోటల్‌ సెంటర్‌ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

04–04–2018
గుంటూరు రూరల్‌ మండలం (ప్రత్తిపాడు నియోజకవర్గం) లోని మధ్యాహ్న భోజన శిబిరం వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసిన హోదా సాధన సమితి నాయకులు. సమితి నేత చలసాని శ్రీనివాస్‌ నేతృత్వంలో జననేతను కలిసిన నాయకులు. హోదా కోసం నాలుగేళ్లుగా నిరంతర పోరాటం చేసిన, చేస్తున్న వైఎస్సార్‌సీపీని అభినందించిన వారు, హోదా సాధన కోసం పోరాడుతున్న పార్టీలు, సంఘాలన్నింటినీ కలుపుకుని నేతృత్వం వహించాలని జననేతకు విజ్ఞప్తి చేశారు.

07–04–2018
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం, అదే మున్సిపల్‌ పరిధిలోని సుల్తానాబాద్‌ వద్ద పాదయాత్రలో 1700 కి.మీ పూర్తి చేసుకున్న జననేత.

10–04–2018
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం (పట్టణం)లోని ఒక స్కూల్‌ గ్రౌండ్స్‌లో చేనేత కార్మికులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

11–04–2018
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన సతీష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. అదే రోజున తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

14–04–2018
పాదయాత్ర 136వ రోజున కనకదుర్గమ్మ వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్‌ జగన్‌. ఆయన వెంట జన ప్రభంజనం కొనసాగడంతో కంపించిన వంతెన. వారధి వద్ద జగన్‌ను కలిసిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైఎస్సార్‌సీపీలో చేరారు. అదే రోజున సాయంత్రం విజయవాడ నగర పరిధిలోని విజయవాడ పశ్చిమం నియోజకవర్గం, చిట్టినగర్‌ సెంటర్‌లో బహిరంగ సభలో జగన్‌ పాల్గొన్నారు. 

17–04–2018
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

18–04–2018
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, అదే మండలంలోని గణపవరం వద్ద పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ 1800 కి.మీ. పూర్తి చేశారు.

21–04–2018
కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

22–04–2018
రాజీనామా చేసిన పార్టీ ఎంపీలతో పాటు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి శిబిరంలో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు.

24–04–2018
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

28–04–2018
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

29–04–2018
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తాడంకి వద్ద తన ప్రస్థానంలో 1900 కి.మీ పూర్తి చేసుకున్న జననేత ప్రజా సంకల్పయాత్ర.

30–04–2018
ఎన్టీఆర్‌ స్వగ్రామమైన నిమ్మకూరులో పర్యటించిన వైఎస్‌ జగన్‌. ఘన నీరాజనం పలికిన ప్రజలు. గ్రామ సమస్యలపై స్వయంగా వచ్చి ఫిర్యాదు చేసిన ఎన్టీఆర్‌ బంధువులు.

01–05–2018
కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం (పట్టణం)లో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

02–05–2018
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని పొట్లపాడులో విశ్వబ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

05–05–2018
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

06–05–2018
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని కౌతవరం, గుడ్లవల్లేరు మధ్య న్యాయవాదులతో జననేత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.  

07–05–2018
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నవైఎస్‌ జగన్‌‌.

09–05–2018
కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం, పెరికగూడెంలో దళితులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

10–05–2018
కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పర్యటనలో ఉన్న జననేతను మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్‌తో పాటు, ఆయన అనుచరులు వైఎస్సార్‌సీపీలో
చేరారు.

12–05–2018
కృష్ణా జిల్లా కైకలూరులో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

13–05–2018
కృష్ణా జిల్లాలో యాత్ర ముగించుకున్న జననేత కలకర్రు వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టారు.

14–05–2018
ఏలూరు నియోజకవర్గం, వెంకటాపురం వద్ద పాదయాత్రలో 2000 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్‌ జగన్‌.

15–05–2018
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

18–05–2018
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, నల్లజెర్లలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

19–05–2018    
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ప్రకాశరావుపాలెం వద్ద గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

21–05–2018    
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో జననేత పాల్గొన్నారు.

22–05–2018
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని పిప్పర వద్ద  2100 కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న విపక్షనేత.

23–05–2018
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

25–05–2018
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం, ఆకివీడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. 

27–05–2018
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

30–05–2018
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద పాదయాత్రలో 2200 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్‌ జగన్‌. అదే రోజు పట్టణంలో బహిరంగ సభలో పాల్గొన్న జననేత.

01–06–2018
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభకు హాజరైన వైఎస్‌ జగన్‌.

03–06–2018
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం, పెనుగొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ పాల్గొన్నారు.

05–06–2018
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

09–06–2018
పశ్చిమ గోదావరి జిల్లా నిడుదవోలు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

10–06–2018
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం, మల్లవరం వద్ద బీసీలతో ఆత్మీయ సమ్మేళనం.

11–06–2018
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు క్రాస్‌ వద్ద పాదయాత్రలో 2300 కి.మీ పూర్తి చేసుకున్న జననేత.

12–06–2018
రైల్‌ కమ్‌ రోడ్‌ వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్‌ జగన్‌ ప‍్రజా సంకల్పయాత్ర. 4.25 కి.మీ పొడవైన వంతెనపై అశేష జనవాహిని మధ్య రాజమండ్రిలోకి ప్రవేశించిన జననేత.అదే రోజు సాయంత్రం రాజమండ్రి నగరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ.

15–06–2018
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో బహిరంగ సభ.

18–06–2018
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

20–06–2018
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

21–06–2018
తూర్పు గోదావరి జిల్లా లక్కవరం క్రాస్‌ వద్ద పాదయాత్రలో 2400 కి.మీ పూర్తి చేసుకున్న జననేత.

26–06–2018
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

27–06–2018
200వ రోజుకు చేరుకున్న పాదయాత్ర. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జననేత ప్రజా సంకల్ప యాత్ర.

30–06–2018
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

07–07–2018
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ పాదయాత్ర.

08–07–2018
తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, పసలపూడి వంతెన వద్ద పాదయాత్రలో 2500 కి.మీ ప్రస్థానం చేరుకున్న జననేత.

09–07–2018
తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం, రాయవరం మండల కేంద్రంలో బహిరంగ సభ.

11–07–2018
మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి  వైఎస్సార్‌సీపీలో చేరిక.

14–07–2018
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో బహిరంగ సభ.

18–07–2018
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని సంతచెరువు ఎస్‌ఆర్‌కే సెంటర్‌ వద్ద బహిరంగ సభ. ఆ తర్వాత నగరంలో పర్యటన.

 21–07–2018
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అచ్చంపేట జంక్షన్‌లో మత్స్యకారులతో ఆత్మీయ సమ్మేళనం.

25–07–2018
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, వేములవారి సెంటర్‌లో బహిరంగ సభ.

28–07–2018
ప్రజా సంకల్పయాత్రలో 100వ నియోజకవర్గం అయిన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట చేరుకున్న వైఎస్‌ జగన్‌. సరిగ్గా అదే పట్టణంలో పాదయాత్రలో 2600 కి.మీ పూర్తి చేసుకున్న జననేత.

31–07–2018
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

05–08–2018
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, కత్తిపూడిలో బహిరంగ సభ.

11–08–2018
తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. మరోవైపు పట్టణంలోని సినిమా రోడ్డు వద్ద పాదయాత్రలో 2700 కి.మీ ప్రస్థానం చేరుకున్న వైఎస్‌ జగన్‌.

14–08–2018
విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర. నర్సీపట్నం నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన జననేత.

18–08–2018
విశాఖ జిల్లా నర్సీపట్నంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

20–08–2018
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం, అదే మండల కేంద్రంలో బహిరంగ సభ.

24–08–2018
విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.పట్టణంలోని కోర్టు సెంటర్‌ వద్ద పాదయాత్రలో 2800 కి.మీ పూర్తి చేసుకున్న జననేత.

29–08–2018
విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

30–08–2018
250వ రోజుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర. విశాఖ జిల్లా అనకాపల్లిలో జననేత పర్యటన.

01–09–2018
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

03–09–2018
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడులో బహిరంగ సభ.

05–09–2018
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం కేంద్రంలో బహిరంగ సభ. మరోవైపు అదే మండలంలోని పెదనాయుడుపాలెం పాత రోడ్డు వద్ద పాదయాత్రలో 2900 కి.మీ. పూర్తి
చేసుకున్న జననేత.

09–09–2018
విశాఖపట్నం–ఉత్తరం నియోజకవర్గం, కంచరపాలెం, మెట్టు సెంటర్‌ వద్ద బహిరంగ సభ.

10–09–2018
విశాఖపట్నం–తూర్పు నియోజకవర్గంలోని విజ్ఞాన్‌ కళాశాల వేదికగా బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం.

12–09–2018
గ్రేటర్‌ విశాఖ పరిధి, విశాఖపట్నం–తూర్పు నియోజకవర్గం అరిలోవ వద్ద ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమ్మేళనం.

17–09–2018
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండల కేంద్రంలో బహిరంగ సభ.

24–09–2018
విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర. ఎస్‌.కోట నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. కొత్తవలస మండలం, దేశపాత్రునిపాలెం వద్ద పాదయాత్రలో 3000 కి.మీ ప్రస్థానం చేరిన జననేత పాదయాత్ర.

30–09–2018
విజయనగరం నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.

01–10–2018
విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్‌లో బహిరంగ సభ.

03–10–2018
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలోని మొయిద జంక్షన్‌ వద్ద బహిరంగ సభ.

07–10–2018
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండల కేంద్రంలో బహిరంగ సభ.

08–10–2018
విజయనగరం జిల్లా గుర్ల మండలం, ఆనందపురం క్రాస్‌ వద్ద పాదయాత్రలో 3100 కి.మీ మైలురాయి దాటిన జననేత.

10–10–2018
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

17–10–2018
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

22–10–2018
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

24–10–2018
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం, అదే మండలంలోని బాగువలస వద్ద పాదయాత్రలో 3200 కి.మీ పూర్తి చేసుకున్న జననేత.
 
25–10–2018
విశాఖపట్నం విమానాశ్రయంలోని విఐపీ లాంజ్‌లో జగన్‌పై హత్యాయత్నం.


12–11–2018
17రోజుల విరామం తర్వాత తిరిగి పాదయాత్రలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాయకపాడు నుంచి యాత్ర పునః ప్రారంభం.

17–11–2018
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. విశాఖలో హత్యాయత్నం తర్వాత తొలిసారి సభలో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.

18–11–2018
300వ రోజుకు చేరుకున్న ప్రజా సంకల్ప యాత్ర. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో జననేత పర్యటన.

20–11–2018
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

24–11–2018
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం తురకనాయుడు వలస శివారులో పాదయాత్రలో 3300 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర.

25–11–2018
శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర. జిల్లాలోని వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద పాలకొండ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన జననేత.

28–11–2018
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

03-12–2018
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

0612–2018
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, చిలకపాలెంలో బహిరంగ సభ. మరోవైపు ఎచ్చెర్ల వద్ద పాదయాత్రలో 3400 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్‌ జగన్‌.

08–12–2018
శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభలో పాల్గొన్న జననేత.

11–12–2018
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

16–12–2018
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.

22–12–2018
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. అదే మండలంలోని రావివలస శివారులో పాదయాత్రలో 3500 కి.మీ ప్రస్థానం చేరిన ప్రజా సంకల్పయాత్ర.

24–12–2018
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం, మెళియాపుట్టి మండలం కేంద్రంలో బహిరంగ సభ.

30–12–2018
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో బహిరంగ సభ.

ఇతర వివరాలు

  • డిసెంబరు 30వ తేదీ, ఆదివారం నాటికి 333వ రోజుకు చేరుకున్న ప్రజా సంకల్ప యాత్ర.
  • డిసెంబరు 29వ తేదీ, శనివారం సాయంత్రానికి 3550.3 కి.మీ నడిచిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
  •  12 జిల్లాలలో పూర్తి చేసుకుని చివరిదైన 13వ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర
  • 135 నియోజకవర్గాలలో పూర్తైన పాదయాత్ర.
  • 136వ నియోజకవర్గం ‘పలాస’లో కొనసాగుతోంది.
  • మొత్తం 123 సభలు, సమావేశాలు
  • 42 ఆత్మీయ సమ్మేళనాలు
Back to Top