చేనేత‌ల‌కు ద‌న్నుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ

దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక జనాభా చేనేత పరిశ్రమ పై ఆధార పడుతోంది. దుస్తుల తయారీ విధానంలో ఆధునిక యంత్రాల రాక‌తో ఇప్ప‌టికే కుదేలైన చేనేత రంగం కేంద్రం  ప్రవేశపెట్టబోతున్న జీఎస్టీ బిల్లు ద్వారా మరింత నష్టాలను చవిచూసే ప్రమాదమేర్పడబోతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మగ్గాలనే నమ్ముకున్న నిరుపేద నేతన్నలు తమ వృత్తి పరంగా ఆదాయం లేక అష్టకష్టాలు ప‌డుతున్నారు.  దుస్తుల ఉత్పత్తి పైనేకాకుండా అదనంగా  చేనేతలకు ముడిసరుకైన చిలప నూలు పై కూడా 5% జీఎస్టీ ని విధించబోతున్నట్లుగా కేంద్రం చెబుతోంది. ఈ నిర్ణయంతో చేనేతలు మరింతగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయి. గతంలో ఎన్టీఏ ప్రభుత్వం కూడా చిలప నూలు పై 9.6% టాక్స్ ను విధించగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినవెంటనే ముడిసరుకు పై ఉన్న టాక్స్ ను పూర్తిగా రద్దు చేసింది.

ప్రస్తుత టాక్స్ విధానంతో చేనేత దుస్తుల ధర చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగనుంది,ఆ భారం కొనుగోలుదారుని మీద పడితే చేనేత వస్త్రాల అమ్మకాలు తగ్గే ప్రమాదమేర్పడబోతోంది. చేనేత పరిశ్రమ చవిచూస్తున్న నష్టాలపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో పలుమార్లు గొంతెత్తారు. జీఎస్టీ విధానం పై కూడా నిరసన తెలుపుతూ నెల్లూరులో చేనేత కార్మికులతో పెద్దఎత్తున ర్యాలీని నిర్వహించారు.ఈ విషయం పై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్పటికే ప్రధానికి, అరుణ్ జైట్లీకి లేఖలు రాశారు, అనంతపురం జిల్లాలో ఇప్పటివరకూ 53 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా   వారి కుటుంబాలను పరామర్శించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. చేనేతల సమస్యల పై భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. 
Back to Top