ఏపీకి సంజీవని.. ప్రత్యేక హోదే

* విభజన చట్టంలోని హామీని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం
* హోదాపై మాట తప్పిన టీడీపీ, బీజేపీ నేతలు
* రెండున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక పోరాటం
* దశలవారీగా ఉద్యమాలు
* అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌
* ఈ నెల 19న విజయనగరంలో యువభేరి
హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విభజన సమయంలో అందరు ఒక్కటయ్యారు. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, విపక్షాలు హామీ ఇచ్చాయి. బీజేపీ, టీడీపీలు ఒక అడుగు ముందుకు వేసి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలంటే, చంద్రబాబు పదిహేనేళ్లు అవసరమని ఆనాడు డిమాండ్‌ చేశారు. ఇవే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టుకున్నారు. వీరి మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానే సంజీవిని. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఇందు కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండేన్నరేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దశల వారిగా పోరాడుతూ హోదా అంశాన్ని మరుగున పడకుండా ప్రభుత్వాలకు గుర్తు చేస్తూ సజీవంగా నిలుపుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు లభిస్తాయి. దీంతో పారిశ్రామిక వేత్తలు పరుగెత్తుకొని వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు. పరిశ్రమలు ఏర్పాటైతే..మన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమ బాట పట్టారు. ఇప్పటి దాకా ఆమరణ నిరాహార దీక్షలు, రాష్ట్ర బంద్‌లు, ధర్నాలు చేపట్టిన ప్రతిపక్ష నేత..అంతటితో ఆగకుండా చట్టసభల్లో హోదా అంశంపై ప్రభుత్వాలను నిలదీశారు. మరోవైపు పార్లమెంట్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల ద్వారా పోరాటం చేయించారు. ఇంత చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం రాకపోవడంతో యువభేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  సెప్టెంబర్‌ 15, 2015న మొట్ట మొదటి సారిగా తిరుపతి నగరంలోని ఎస్వీ యూనివర్సిటీలో యువభేరి నిర్వహించారు. ఇప్పటి దాకా ఏడు నగరాల్లో యువభేరి కార్యక్రమాలు నిర్వహించి యువత, విద్యార్థులను చైతన్యవంతం చేశారు. తాజాగా ఈ నెల 19న విజయనగరం జిల్లాలో యువభేరి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ సభకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరై హోదా వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించి, వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.  
హోదాను తాకట్టుపెట్టిన బాబు
ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇదే హామీని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా మారిపోయారు. ఆయనకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమయ్యాయి. రెండేళ్ల పాటు ఇదిగో హోదా..అదిగో హోదా అంటూ ప్రజలను మభ్యపెట్టారు. తీరా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన  హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. బాబు డైరెక్షన్‌లో అక్టోబర్‌ 7వ తేదీ అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ప్రకటించారు. చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులు ఇస్తామని జైట్లీ పేర్కొంటే..దాన్ని చంద్రబాబు అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ స్వాగతించారు. ఈయనగారికి రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు, పోలవరం కాంట్రాక్ట్‌ తన వారికి కట్టబెట్టి ప్రజాధనం దోచుకోవడమే బాబుకు ముఖ్యం. విభజన చట్టంలోని హామీ అయిన హోదా కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి.. హోదా రాకపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా వ్యవహరించడం దారుణం. 
 


Back to Top