విశాఖలో కొనసాగుతున్న ప్రజా సంకల్పం


ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగుతోంది. ప్రతి నియోజకవర్గం ఓ జనదుర్గంలా మారుతోంది. ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖలో ప్రజానాయకుడి పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆయన నడిచే ప్రతి గ్రామాన ఉత్సాహం వెల్లువెత్తుతోంది. యువనేత పరామర్శే తమకు కొండంత అండ అన్నంతగా భావిస్తున్నారు విశాఖ వాసులు. 12 నియోజకవర్గాలను గెలిపించి చంద్రబాబుకు ఇచ్చినా, మరో ఇద్దరిని ఈ జిల్లా నుంచే ఫిరాయింపు చేయించన చంద్రబాబు జిల్లాకు మాత్రం ఏం చేయలేదని వాపోతున్నారు జిల్లా ప్రజలు. అనుభవం, సమర్థత అని చెప్పుకుని చివరకు జిల్లాను దారుణంగా మోసం చేసాడంటున్నారు విశాఖవాసులు. ప్రజా సంకల్ప యాత్ర సాగుతున్న ప్రతి నియోజకవర్గంలోనూ జన ప్రభంజనం కనిపిస్తోంది. 
విశాఖ జిల్లా సమస్యల ఖిల్లా
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ గత వారం రోజుల్లో అనకాపల్లి, చోడవరం నియోజక వర్గాలు దాటి పెందుర్తి నియోజక వర్గంలో పాదయాత్ర సాగిస్తున్నారు. పట్నం పల్లె అనే తేడా లేకుండా ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ ప్రాంత వాసులు తమ కష్టాలను ప్రతిపక్ష నేతకు వివరిస్తున్నారు. ఉత్తరాంధ్రం మొత్తం విషజ్వరాల బారిన పడుతోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రంలో ఉన్న ఆసుపత్రుల్లోనూ సరైన వైద్యం అందడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ఈ ప్రాంతంలో కొండలు, గుట్టలు అని తేడా లేకుండా అన్నీ తవ్వేస్తున్నారని, ప్రభుత్వం అండతో స్థానిక ఎమ్మెల్యేలు, టిడిపి నేతలే ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారని జగన్ కు తెలియచేస్తున్నారు విశాఖ ప్రజలు. మీటింగులు, సదస్సులు పెట్టడానికేతప్ప విశాఖకు విలువలేకుండా చేసాడంటూ నిప్పులు చెరుగుతున్నారు యువత. ఉపాధి లేకుండా పోయిందని వాపోతున్నారు. స్మార్ట్ సిటీ అని నాలెడ్జ్ హబ్ అని, మెట్రో రైలని సవాలక్ష హామీ లిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. 
బహిరంగసభల్లో ప్రజాభిమానం
చోడవరం, మాడుగుల నియోజకవర్గం కోటపాడు, పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం ప్రాంతాల్లో బహిరంగ సభలు విజయవంతం అయ్యాయి. రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇసుకేస్తే రాలని జన సంద్రం పోటెత్తింది. వైఎస్ జగన్ ప్రసంగాలు వినేందుకు ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. జగన్ చెప్పే ప్రతిమాటా ఓ తూటాలా పేలుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి వైఎస్ జగన్ మాటల్లో బైటకు వస్తుంటే నలుదిక్కులా హర్షధ్వానాలు మిన్నంటుతున్నాయి. కాంగ్రెస్ తో మూడో పెళ్లికి చంద్రబాబు పరుగులు, పెదబాబు పర్మిషన్లు చినబాబు కలెక్షన్లు, ప్రశ్నిస్తే అరెస్టులు అంటూ ప్రతిసభలోనూ వైఎస్ జగన్ చెప్పే మాటపై ప్రజల్లోంచి భారీ స్పందన కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి ఈక్షణమే సభకు వస్తాం అంటూ సవాల్ చేయడాన్ని దమ్మున్న నాయకుడి తీరు ఇలా ఉంటుందంటూ అభినందనలు తెలిపారు. 

వైయ‌స్ఆర్‌సీపీ లోకి భారీ చేరికలు
టిడిపి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ లోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి. ప్రజాబలం ఉన్న నాయకుడి వెంట నడిచేందుకు ప్రజలతో పాటు అధికారపక్ష నేతలూ ఉత్సాహం చూపుతున్నారు. వైఎస్ జగన్ ను వ్యతిరేకించిన వారుసైతం నేడు జగన్ ప్రభంజనం చూసి తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ప్రజల మన్నన పొందిన నేత వెంట నడవాలని నిర్ణయించుకుంటున్నారు. కాదన్నచోటే అవుననిపించుకునే వ్యక్తిత్వం కల వైఎస్ జగన్ విజయం ఇది. టిడిపి నాయకుడు, మాజీ మంత్రి అయిన ఆనం రామనారాయణ రెడ్డి ఆయన అనుయాయులతో కలిసి వచ్చి విశాఖలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరడం ఓ శుభపరిణామం. ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, మరికొందరు టిడిపి నేతలు కూడా ఈ సందర్భంలో ప్రతిపక్ష నాయకుని సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. 
ప్రతి జిల్లాలోనూ వైఎస్ జగన్ నవరత్నాలతో పాటు మరిన్ని మెరుగైన పథకాలను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనారిటీ మహిళలకు 75,000 రూపాయిలు దఫాల వారీగా అందిస్తామని, సున్నా వడ్డీ విప్లవాన్ని తిరిగి తెస్తామని చెప్పారు యువనేత. 

 
Back to Top