ఎవరీ లేడీ అడ్వకేట్

() రోజా కేసు లో అడ్వకేట్ గా వ్యవహరించిన ఇందిరా జైసింగ్

() మహిళలు, మానవ హక్కుల పోరాటంలో సుప్రసిద్ధులు

() మొదటి మహిళా అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా ఖ్యాతి

హైదరాబాద్) న్యాయం కోసం పోరాడి గెలిచిన మహిళా ఎమ్మెల్యే రోజా కు అండగా
నిలిచారు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన
దర్శకత్వంలో మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎమ్మెల్యే రోజా ను ఏ స్థాయిలో ఇబ్బందులు
పెట్టారో అందరికీ తెలుసు. ఈ కుట్రల్ని అధిగమించి న్యాయం దక్కించుకోవటంలో రోజాకు
ఇందిరా జైసింగ్ తోడ్పాటుగా నిలిచారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచిన
ఎమ్మెల్యే రోజాకు లాయర్ గా ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకొన్న ఇందిర తోడు గా
నిలిచారు.

ఇందిర ప్రస్థానం

ముంబై కు చెందిన ఇందిరా జైసింగ్ బాల్య విద్యాభ్యాసం అక్కడే గడిచింది. బెంగళూరు
విశ్వవిద్యాలయంలో లా లో పీజీ చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ముంబై హై కోర్టు లో మొదటి
మహిళా సీనియర్ అడ్వకేట్ అనిపించుకొన్నారు. భర్త తో కలిసి లాయర్స్ కలెక్టివ్ అనే
స్వచ్ఛంద సంస్థను స్థాపించి అణగారిన మహిళలు, అల్పాదాయ వర్గాల ప్రజల కు ఉచితంగా
న్యాయసహాయం అందించేందుకు పని చేస్తున్నారు. ద లాయర్ అనే పేరుతో మ్యాగజైన్
నడుపుతున్నారు. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా రాణించటంతో మొదటి మహిళా
అదనపు సొలిసిటర్ జనరల్ గా గతంలో నియమితులయ్యారు.

కెరీర్ లో అదే దూకుడు

మహిళలు, వారి సామాజిక అంశాల మీద న్యాయ పోరాటం చేయటంలో ఇందిరా జైసింగ్ పేరు
గాంచారు. ముఖ్యంగా పంజాబ్ లో ఎన్ కౌంటర్ ల స్పెషలిస్టు గా పేరు తెచ్చుకొన్న అప్పటి
డీజీపీ కేపీఎస్ గిల్ పేరు చెబితే అంతా గడగడలాడిపోయారు. అటువంటి గిల్ ఒక మహిళ పట్ల
అసభ్యంగా ప్రవర్తిస్తే ఆమె తరపున కేసును తీసుకొనేందుకు న్యాయవాదులు భయపడితున్న
సమయంలో.. ఆ కేసును టేకప్ చేసి గిల్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు
తాగించారు ఇందిర. ప్రసిద్ధి గాంచిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో బాధితుల తరపున
పోరాడి అంతర్జాతీయ సంస్థ యూనియన్ కార్బైడ్ ను గడగడలాడించారు. మహిళలకు న్యాయపరంగా
అండగా నిలుస్తున్న ఇందిరా జైసింగ్ కు పద్మశ్రీ అవార్డు దక్కింది.

ఫైర్ బ్రాండ్  కు తోడుగా..

అక్రమాలు, అహంకారంతో చెలరేగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ఆయన సహచరుడు
యనమల రామక్రిష్ణుడు విద్వేష పూరితంగా ఎమ్మెల్యే రోజా ను సస్పెండ్ చేయించారు.
తర్వాత రోజు కనీసం శాసనసభ ప్రాంగణంలోకి కూడా రానీయకుండా అవమానించి దుశ్శాసన
వారసులుగా నిలిచారు. తర్వాత న్యాయపోరాటం జరగకుండా ఏడిపించారు. అయినప్పటికీ న్యాయం
తన వైపు ఉండటంతో చంద్రబాబు గ్యాంగ్ చేసిన తప్పిదాల్ని ఇందిరా జైసింగ్ సాయంతో రోజా
ఎదుర్కొని విజయం సాధించారు. 



Back to Top