నీరు-చెట్టు..నిధులు మూట‌క‌ట్టు

  • అడ్డగోలుగా అధికార పార్టీ నేత‌ల‌ దోపిడీ 
  • పనులు చేసినట్లు చూపించి ప్ర‌జాధ‌నం స్వాహా
  • టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీల‌కు కాసుల వ‌ర్షం
  • ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం ప్ర‌భుత్వం తాయిలాలు
విజ‌య‌వాడ‌: నీరు–చెట్టు పథకం అధికార పార్టీ నేతలకు వరంగా మారింది. పనులు చేయకుండానే చేస్తున్నట్లుగా బిల్డప్‌ ఇచ్చి నిధులు దోచుకుంటున్నారు. ఈ పథకం కింద చేపట్టిన పనుల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప‌నులు చేయ‌కుండానే ఈ ప‌థ‌కంలోని నిధుల‌ను అధికార పార్టీ నాయ‌కులు దోచుకొని మూట‌క‌ట్టుకుంటున్నారు. నీరు- చెట్టు ప‌థ‌కం కింద‌ మట్టిసరిచేసే పనులు రాష్ట్ర‌వ్యాప్తంగా జరుగుతున్నాయి. నీరు–చెట్టు పనులు చేపట్టిన వ్యక్తులు మట్టి తోలకుండానే తోలినట్లుగా చూపించి అడ్డగోలుగా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తోచుకుంటున్నారు. ఇదంతా కూడా అధికార పార్టీ నేత‌ల క‌న్నుస‌న్న‌ల్లో జ‌రుగుతోంది. త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల శాస‌న మండ‌లి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ వెలుబ‌డ‌నుండ‌టంతో టీడీపీ అదిష్టానం నీరు- చెట్టు ప‌థ‌కాన్ని ఆయుధంగా మ‌లుచుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స‌భ్యుల ఓట్లు కొల్ల‌గొట్టేందుకు ఈ ప‌థ‌కం ద్వారా నిధులు ముట్ట‌జెబుతూ..దోపిడీకి త‌లుపులు తెరిచింది. ఆయా చెరువుకు నీరు–చెట్టులో పూడికతీత పనులు చేయడానికి అనుమతినిచ్చారు. దీంతో ఈ చెరువు కట్టకు మట్టిని తోలడంతో పాటు కొంతవరకు బయటకు తోలుతున్నారు.. ఆ తరువాతే అసలు దోపిడీ పని ప్రారంభమ‌వుతోంది. చెరువు లోపలి భాగమంతా పొక్లెయిన్‌తో సరిచేయడం, బుల్‌డ్రోజర్‌తో సమానంగా సర్ధడం, అంచులను చెక్కడం తదితర పనులు చేస్తున్నారు. పని చేయకుండా పనిచేసినట్లుగా కొలతల కోసం ఇలా చేసి  దోచుకునేందుకే  చెరువులోని గోతులను పొక్లెయిన్‌తో సరిచేస్తున్నారు. పనులు మంజూరు కాని చెరువులో పొక్లెయిన్‌లతో గోతులను సరిచేయడం, అంచులను చెక్కడం తదితర పనులను చేశారు. ఇలా టీడీపీ నాయకులు అధికారం ఉందనే ధీమాతో వారి ఇష్టం వచ్చిన విధంగా నీరు–చెట్టు పనులను చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. 

చెట్లు నాటారా..నీరేదీ?
 నీరు చెట్టు అనే పథకం ప్రవేశ పెట్టి వాటిలో చెట్లు నాటుతున్నామని గొప్పలు చెప్పడమేగానీ అందులో చేసిందేమీ లేదు. నీరు చెట్టు పథకం క్రింద ప్రభుత్వ భూములలో, రోడ్లు ప్రక్కల, పాఠశాలల ఆవరణంలో చెట్లు  నాటే కార్యక్రమం ప్రజా ప్రతినిధులు ఎంతో ఆర్బాటంగా పేపరు ప్రకటనలకు ఫోజులు ఇస్తూ  పోటా పోటీగా చెట్లు నాటారు. అయితే పచ్చని చెట్లును ఎండపెట్టేశారు. వాటిని సంరక్షించుటలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. నర్సరీలలో లక్షలాది రుపాయలు వెచ్చించి  చెట్లు పెంచుటకు  ఖర్చు చేసి వాటిని రోడ్లు ప్రక్కల, పాఠశాలల ఆవరణంవలో ప్రభుత్వ భూములలో నాటారు. అయితే ఎక్కడ చూసినా ఎండిన మొక్కలే దర్శన మిస్తున్నారు. ఒక్కో మండ‌లానికి ల‌క్ష మొక్క‌లు నాటారు.  అయితే వీటిలో ఎక్కడ చూసినా ఎండిన మొక్కలే దర్శన మిస్తున్నాయి. ఈ చెట్లు నాటినంత ఉత్సాహం పెంచడంలో ప్రభుత్వ ప్ర‌జాప్ర‌తినిధులు చొరవ చూపలేదు.   కనీసం నాటిన చెట్లుకు నీరు పెట్టడంలో అధికారులు చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను సక్రమంగా అమలు చేసేలా ఇక నుంచి అయినా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. ఈ ప‌థ‌కంలో చోటు చేసుకున్న అవినీతిపై, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అడ్డుగోలుగా గెలిచేందుకు టీడీపీ నేత‌లు అనుస‌రిస్తున్న విధానాల‌ను ఇటీవ‌ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, వాసిరెడ్డి ప‌ద్మ త‌దిత‌రులు ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి భ‌న్వ‌ర్‌లాల్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. అయితే ఎంత‌వ‌ర‌కు నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారో అన్న‌ది వేచి చూడాలి.
Back to Top