చంద్రబాబు టాప్ టెన్ మోసాలు

ప్రత్యేక హోదా అన్న విషయం వెలుగు చూసిన నాటి నుంచి చంద్రబాబు అనేక సార్లు మోసాలకు పాల్పడ్డారు. ప్రతీసారి ప్రజల్ని తప్పు దారి పట్టించారు తప్పితే స్పష్టత మాత్రం ఇవ్వనేలేదు. ఈ విషయంలో చంద్రబాబు చేసిన టాప్ టెన్ మోసాలు..
1. ఎన్నికల సభలో ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలంటూ ప్రచారం. ప్రజల్ని బుట్టలో వేసుకొనేందుకు అప్పట్లో అదొక ప్రధాన అస్త్రం
2. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పరిగెత్తుకొంటూ వస్తుందని బీజేపీ నేతలతో కలిసి ప్రచారం.
3. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి లాబీయింగ్ లు, కాంట్రాక్టర్ల పనులు తప్ప ప్రత్యేక హోదా మీద మౌనం
4. అప్పటికే కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందిన హోదా గురించి ప్రణాళికా సంఘంకు చెప్పకుండా దాటవేత
5. తీరా ప్రణాళికా సంఘం రద్దు అయిపోయాక అంతా అయిపోయిందంటూ సన్నాయి నొక్కులు

6. ప్రత్యేక హోదా మీద జగన్ పోరాటంతో ప్రజల్లో చైతన్యం రావటంతో చంద్రబాబు టీమ్ గందరగోళ ప్రకటనలు
7. మంత్రులు ఒక మాదిరిగా, ఎంపీలు ఒక విధంగా, ఎమ్మెల్యేలు మరో విధంగా ప్రకటనలు చేసేట్లుగా వ్యూహం
8. ఢిల్లీలో ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ ప్యాకేజీల గురించి పలవరించిన చంద్రబాబు
9. అమరావతి వేదికగా ప్రత్యేక హోదా గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించని బాబు
10. విజయవాడ ప్రెస్ మీట్ లో మాత్రం ప్రత్యేక హోదా అనబోయి ప్యాకేజీ అన్నానంటూ సన్నాయి నొక్కులు

Back to Top