వైయస్ఆర్‌సిపి సమైక్య దీక్షలు.. ఎవరెక్కడ

పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆయన జయంతి రోజు అక్టోబర్‌ 2 నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సత్యాగ్రహాలతో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సమైక్య ఉద్యమ ప్రభంజ‌నాన్ని ఉధృతం చేస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రెండు నెలలుగా సమైక్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సమగ్ర కార్యాచరణతో పోరాటానికి మరింత పదును పెడుతోంది. సీమాంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలంతా ఒకే రోజున నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా సమైక్య ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. మహాత్మాగాంధీ జయంతి ‌నుంచి నవంబర్‌ ఒకటి రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

ఈ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, శ్రేణులు ఎవరెవరు ఎక్కడెక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారో వివరాలు ఇవీ...

హైదరాబాద్, 2 అక్టోబర్ 2013:

నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి దీక్షలో కూర్చుంటారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష చేపడతారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర కూడలిలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్షకు సిద్ధమయ్యారు. ఆయన సోదరుడు సీతారామిరెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డి ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి నేతృత్వంలో దీక్షలు జరుగుతాయి. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు జరగనున్నాయి. ఉరవకొండలో పార్టీ సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మంది దీక్ష చేపడుతున్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో తుడ సర్కిల్ వద్ద రెండు‌ రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపడతాన్నారు. వైయస్ఆర్ జిల్లా రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురంలో పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పులివెందులలో వైయస్ అవినా‌ష్‌రెడ్డి, రాజంపేటలో ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పెనగలూరులో కొరముట్ల శ్రీనివాసులు దీక్షలు చేపడతారు. గుంటూరులో నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి కలెక్టరే‌ట్ ఎదుట దీక్షకు ది‌గుతారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్ చిలకలూరిపేటలోని నరసరావుపేట సెంట‌ర్‌లో దీక్ష చేస్తారు. మాచర్లలోని అంబేద్కర్ సెంట‌ర్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లిలో తాలూకా సెంటర్‌లో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేస్తారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటారు. వైయస్ఆర్ ‌సిఎల్‌పి విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో దీక్ష చే‌స్తారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు కొండపిలో దీక్ష చేస్తారు.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆమరణ ‌నిరాహార దీక్ష చేపడతారు. మచిలీ„పట్నం కోనేరు సెంటర్‌లో నియోజవకర్గ సమన్వయకర్త పేర్ని నాని ఆధ్వర్యంలో రిలే దీక్షలకు సన్నాహాలు చేశారు. మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టనున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోవూరు నియోజకవర్గానికి సంబంధించి నార్తురాజుపాళెంలో జరిగే దీక్షల్లో ఎమ్మెల్యే నల్ల‌పురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొంటారు.

విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలతో నిరాహార దీక్షలు నిర్వహి‌స్తారని పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ సతీమణి విజయ, నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదా‌స్ దీక్షలో కూ‌ర్చుంటారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా బొబ్బిలి పాత పెట్రోలు బంకు ఆవరణలో నిరాహార దీక్ష చేస్తారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు నెల్లిమర్లలో దీక్ష ‌చేస్తారు.

పశ్చిమగోదావరి జిల్లా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గ నేతలతో కలిసి కొయ్యలగూడెంలో నిరాహార దీక్ష ‌చేస్తాన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ ‌చంద్ర‌ బోస్ ద్రాక్షారామ సెంట‌ర్‌లో వెయ్యి మందితో దీక్ష చేస్తారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ మసీదుసెంటర్‌లో నిరాహార దీక్ష చేపపడుతున్నారు. కాజానగరం సాయిబాబా గుడి వద్ద పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి దీక్ష చేస్తారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ కో ఆర్డినేటర్ బొమ్మన రా‌జ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో 500 మందితో దీక్షలు జరుగుతాయి.

తాజా వీడియోలు

Back to Top