తిరిగి వచ్చిన చరిత్ర 

నాడు రాష్టం రావణ కాష్టంలా ఉంది. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కరువు కాటకాలతో రాష్ట్రం అల్లాడుతోంది. ఆత్మహత్యలు, వలసలతో అన్నపూర్ణ రాష్ట్రం అధ్వాన్నంగా తయారైంది. అప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజల కష్టాలు చూడలేక నాడు వైయస్సార్ పాదయాత్ర చేపట్టారు. ప్రజాప్రస్థానం సాగించారు. ఇచ్ఛాపురంలో ఆ యాత్ర ముగిసింది...చంద్రబాబు పాలన అంతమైంది. ప్రజలకు మంచిరోజులొచ్చాయి. 
చూడండి మళ్లీ చరిత్ర తిరిగి వచ్చింది. 
నేడు కూడా రాష్ట్రం అలాంటి దుర్భర పరిస్థితుల్లోనే ఉంది. అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, రౌడీయిజం, గూడాయిజం, ఇసుక, మట్టి దోపిడీలు, అడ్డగోలు కబ్జాలు, ఆడవాళ్లపై అత్యాచారాలు, ప్రజలపై అప్పుల కుప్పలతో అతలాకుతలంగా ఉంది. ఇప్పుడూ అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజలకోసం ఆ రాజన్న బిడ్డ ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. తన తండ్రి పాదాల చెంత మొదలు పెట్టి అలుపెరగకుండా వేల కిలోమీటర్లు నడిచి మళ్లీ అదే ఇచ్ఛాపురం చేరుకున్నాడు. ఇక జరగాల్సింది బాబు పాలనకు చరమగీతం. జగన్ నాయకత్వానికి విజయగీతం. 
ఇచ్ఛాపురంలో విజయసంకల్ప స్ఫూపం ఆవిష్కరణ జరిగింది. జనహృదయాల్లో ఆనందం ఉప్పొంగింది. ప్రతి గుండెలో ఉద్వేగం ఉవ్వెత్తున లేస్తోంది. రాబోయే విజయానికి యువనేతకు శుభాకాంక్షలు అందిస్తోంది. 
 

తాజా వీడియోలు

Back to Top