టీడీపీ నాయకుల అండతోనే మహిళలకు వేధింపులు

  • నిందితులకు టీడీపీ అండ ఉందని ఒప్పుకున్న నన్నపనేని
  • ప్రభుత్వంపై మండిపడుతున్న సొంత పార్టీ మహిళలు
  • మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులపై ఆగ్రహం

నిజం నిప్పులాంటిది.. అధికారం, డబ్బుతో అణచాలని చూసినా తాత్కాలికమే. మరుగున పడిందనుకున్న నిజం ఎప్పుడో ఒకప్పుడు దావానంలా పైకెగసి దహించకపోదు. కాకపోతే కొంచెం సమయం తీసుకుంటుంది అంతే.. ఇప్పుడు ఏపీలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. అధికారం, డబ్బు ప్రయోగించి ఎన్నో అరాచకాలను బయటకు రాకుండా తొక్కిపెట్టేస్తున్న సర్కారుకు ముచ్చెమటలు పడుతున్నాయి. సొంత పార్టీ నుంచే  ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. మహిళలపై రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం దాడులు జరుగుతున్నా పట్టించుకోని పోలీసు యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మహిళయితే చాలు.. 
మహిళలపై టీడీపీ నాయకులు దాడులను చూసి సొంత పార్టీలోని మహిళలకు కూడా భయం పట్టుకుంది.  సొంత పార్టీ మహిళలు, మహిళా ప్రతినిధులపై పలు చోట్ల జరగిన దాడుల ఘటనలే అందుకు ఉదాహరణ.  ఈ ఘటనల్లో మాచర్ల శ్రీదేవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. చిత్తూరు మేయర్‌ కటారి అనూరాధ హత్యకు గురైంది. బాపట్ల విజేతమ్మ.. టీడీపీ చైర్‌ పర్సన్‌ జానీమూన్‌ మంత్రి రావెల వేధిస్తున్నారని.. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని రెండు సార్లు మీడియా సమావేశం నిర్వహించి మరీ రక్షణ కల్పించాలని కోరింది. ఇవన్నీ ఒక ఎత్తయితే అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కోడలు ప్రెస్‌ మీట్‌ పెట్టి అత్తమామలు, భర్త వేధింపులను ఏకరువు పెట్టింది. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ నాయకులకు మహిళలంటే ఎంత చులకన భావమో అర్థమవుతోంది. 

మహిళలపై దాడులను ఒప్పుకున్న నన్నపనేని
ఇన్నాళ్లు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై ఎట్టకేలకు నన్నపనేని రాజకుమారి నోరెత్తారు. రాజకీయ నాయకుల అధికారం అండతోనే వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఒప్పుకున్నారు. అంటే నిందితులకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఆమె అంగీకరించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆవిడ ఆలస్యంగానైనా నోరెత్తడం మంచి పరిణామమే అయినా.. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉండి ఆమె బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారనేది ప్రశ్నార్థకం. ప్రొద్దుటూరులో ఆమె మాట్లాడుతూ మహిళలను వేధిస్తున్న వారిపై నిర్భయ కేసు పెట్టాలన్నారు. ఈమె చెప్పిన దాని ప్రకారం చూస్తే మొదట జైల్లో ఉండేది.. మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమలే. నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలని పోలీసులకు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని చెప్పడం మరీ దారుణం. పోలీసులు కూడా పచ్చ గూండాల్లా మారి టీడీపీ దాదాలకు సహకరిస్తున్నారనేది ఇక్కడ సుస్పష్టం. 
Back to Top