సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. మీడియా పోల్స్ తో పాటు, వివిధ సంస్థలు చేస్తున్న సర్వేల వివరాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేస్తున్నాయి. రిపబ్లిక్ టివి మొదలు చాలా ఛానళ్లు చేస్తున్న సర్వేల్లో ఆసక్తికరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎపిలో మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను కనీసం 13కు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలున్నాయంటున్నాయి సర్వేలు. అలాగే 2019లో ycp కి 42 శాతం ఓటింగ్ లభిస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నాయి ఈ సర్వేలు. టిడిపికి 34, జన సేన ఇతరులు కలిసి 18 శాతం, కాంగ్రెస్, వామపక్షాలు, నోటా కలిపి మిగిలిన ఓట్లను పంచుకుంటాయంటున్నారు. వివిధ టివి ఛానెళ్లు చేస్తున్న పబ్లిక్ పోల్స, కొన్ని సంస్థలు డేటా మైనింగా ఆధారంగా చేస్తున్న సర్వేలు చెబుతున్న వాస్తవాలు ఇవి. <strong>డేటామైనింగ్ అంటే...</strong>సోషల్ మీడియాలో ప్రజల పల్స్ ఆధారంగా చేసే సర్వే ని డేటా మైనింగ్ అనొచ్చు. గూగుల్ లో అతి ఎక్కువగా వాడుతున్న సెర్చ్ కీ వర్స్డ్, ఫేస్ బుక్ లో పోస్టులు, కామెంట్లు, యూట్యూబ్ కామెంట్లు, ట్విట్టర్ పోస్టులు, ఇన్ స్ట్రాగ్రామ్ ల ఆధారంగా ఈ డేటా మైనింగ్ చేస్తారు. ఇందులో నెటిజన్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే అని ఈ సర్వేలు తెలుపుతున్నాయి. కొన్ని సంస్థలు విస్తృతంగా చేస్తున్న వివరణాత్మక సర్వేల్లొ టిడిపి పై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు ప్రజలు చెబుతున్న కారణాలు అనేకం ఉంటున్నాయి. మా భూమి సైట్లో రికార్డుల టాంపరింగ్. భూముల కబ్జాలుఇసుక, మట్టి దోపిడీ, డ్వాక్రా, రైతు రుణమాఫీలు జరగకపోవడం, చెప్పినట్టు ఉద్యోగాలు కల్పించలేకపోవడం, నిరుద్యోగభృతి నాలుగేళ్లుగా ఇవ్వకపోవడం, హోదాపై యూటర్న్లు, ప్రభుత్వోద్యోగులకు కాన్ఫరెన్సులు తప్ప పని చేసే అవకాశం ఉండకపోవడం, జన్మభూమి కమిటీ సభ్యులకు జవాబుదారీతనం ఏలేకపోవడం, ఏది కావాల్సి వచ్చినా ప్రజాప్రతినిధులను కాకుండా జన్మభూమి కమిటీలను కలవమని ప్రభుత్వాలు చెప్పడం, వాళ్లు సమస్యలు తీర్చకపోతే ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంఅవినీతి వ్యవస్థీకృతం కావడం, ఓ నీటి కుళాయి కనెక్షన్ కావాలన్నా, ఇల్లు కట్టాలన్నా, డెత్, బర్త్ సర్టిఫికెట్లకోసమైనా లంచాలివ్వాల్సిన దారుణమైన పరిస్థితులు, రేషన్ సరుకుల నిలుపుదల, మహిళల మీదా, మహిళా ఉద్యోగుల మీదా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం వాటిపై చర్యలే తీసుకోకపోవడం, దళితులను వేధిస్తున్నా, అవమానిస్తున్నా వారికి న్యాయం జరగకపోవడం...ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతున్నాయని సర్వేలు చెబుతన్నాయి. నవరత్నాలు, అన్ని వర్గాలకూ జగన్ ఇస్తున్న హామీలు ఆసక్తికరంగా ఉన్నాయని, వైఎస్సార్ లాగే జగన్ కూడా మాట ఇస్తే నిలబెట్టుకుంటాడనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల ప్రజల సానుభూతి పెరగడానికి కారణం అవుతోందటున్నాయి ఈ సర్వేలు. మునుముందు ప్రభుత్వం పై వ్యతిరేకత పెరగడమే తప్ప, టిడిపికి కలిసొచ్చే కాలం కాదని ఈ సర్వేల వల్ల తేటతెల్లం అయిపోయింది. రాబోయే రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ విజయ ఢంకాకు ఇవి ప్రమాణాలు. <br/>