బాస్ చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

ఆంధ్రప్రదేశ్ నలు చెరగులా రాక్షస పాలన రాజ్యమేలుతోంది. ప్రతిపక్ష పార్టీ ల
నాయకుల్ని అరెస్టులు చేయించటం, జైళ్లకు పంపించటం పరిపాటిగా మారింది. భయాందోళనలకు
గురి చేస్తేనే ప్రజా ఉద్యమాలు ఆగుతాయన్న ఆలోచనతో ఈ కుట్రలకు తెర దీస్తున్నారు.
ఎన్ని కుట్రలు చేసినా మరింత బలంగా ప్రజల తరపున ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ
నాయకులు అంటున్నారు.

శ్రీకాకుళం మొదలు అనంతపురం జిల్లా దాకా తెలుగుదేశం నాయకులు పోలీసుల్ని
గుప్పిట్లో ఉంచుకొని ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తున్నారు. అనంతపురం జిల్లాలో
ప్రత్యర్థి హత్యలు ఎక్కువ అయిపోయాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కి చెందిన నాయకుల్ని
ప్రభుత్వ యంత్రాంగం చాటున మాటు వేసి హత మారుస్తున్నారు. దీన్ని అడ్డుకొనేందుకు
ప్రయత్నించినప్పుడు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసి
రిమాండ్ కు తరలించారు. హత్య జరిగిన చోట స్థానిక ఎస్ ఐ నేమ్ బ్యాడ్జీ
దొరికినప్పటికీ, ఆయన మీద చర్యలు తీసుకోలేదు. కానీ, ప్రజల్ని సముదాయిస్తున్న మాజీ
ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.

కర్నూలు
జిల్లా లో ఎమ్ ఎల్ సీ ఎన్నికల సందర్భంగా మహిళా ఎమ్మెల్యే భూమా అఖిల
ప్రియ తో దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసుల్ని వారించేందుకు ఆమె తండ్రి
భూమానాగిరెడ్డి ప్రయత్నించారు.  డోన్ట్ టచ్
మీ అన్నందుకు గాను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి బెయిల్ రాని సెక్షన్ల
కింద
కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. కనీసం ఆయనకు మెరుగైన వైద్యం
అందించేందుకు కూడా వీలు లేకుండా చేసి పోలీసు అధికారులు కక్ష పూరితంగా
వ్యవహరించారు.  జిల్లా లో ప్రత్యర్థుల్ని
వేధించటమే తమ ధ్యేయం అన్నట్లుగా పోలీసులు వ్యవహరించారు.

గుంటూరు
జిల్లా పోలీసుల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది.
రాజధానిపేరు చెప్పి ప్రజల్ని కాల్చుకొని తింటున్నారు. భూ సేకరణకు
అంగీకరించని  రైతుల్ని వేధించేందుకు పోలీసులు పోటీ పడుతున్నారు. రైతుల
పొలాల్నితగలబెట్టిన పచ్చ
గూండాల జోలికి ఏమాత్రం వెళ్లటం లేదు. కానీ, ఫిర్యాదు చేసిన రైతు
కుటుంబీకుల్నే
వేధించి చిత్ర హింసలు పెడుతున్నారు. పచ్చ చొక్కా గూండాలతో కలిసి రైతుల్ని
భయపెట్టి
భూములు లాక్కోవటంలో ఉత్సాహం చూపుతున్నారు.

చిత్తూరు జిల్లా పోలీసులకు ప్రజల సమస్యల తరపున ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోరాడుతుంటే
ఏమాత్రం నచ్చటం లేదు. నగరి ఎమ్మెల్యే రోజా తో అనేకసార్లు పోలీసులు దురుసుగా
ప్రవర్తించారు. ఆందోళనలు చేస్తుంటే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర
రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

క్రిష్ణా జిల్లా లో కొన్ని రోజులుగా పోలీసులు అత్యుత్సాహంతో రెచ్చిపోతున్నారు.
సివిల్ మ్యాటర్ లో తల దూర్చి వైఎస్సాసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ని అరెస్టు చేసి
వేరే పట్టణానికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటంతో పాటు 200మంది
పోలీసులు వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొరబడి అప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించారు.
ఇటు, బందరులో పోర్టు భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవైఎస్సార్సీపీ
రాష్ట్రఅధికార ప్రతినిధి పేర్ని నాని మీద తప్పుడు కేసులు బనాయించి నాన్ బెయిలబుల్
సెక్షన్ల కింద కేసులు కట్టారు. ఆయన్ని రెండు వారాల పాటు రిమాండ్ కు  తరలించారు.


ఈ విధంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు.
నాయకుల్ని అరెస్టులు చేయించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజల
తరుపున పోరాటాన్ని విరమించేది లేదని, మరింత గట్టిగా పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ
నాయకులు చెబుతున్నారు.

Back to Top