లెక్కలు తేల్చేందుకు సిద్దమా..!

అమరావతి శంకుస్థాపన కు ఎంత ఖర్చు అయిందో చెప్పేందుకు ప్రభుత్వం సిద్దంగా కనిపించటం లేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు తలో ఒక లెక్కా చెప్పి తప్పించుకొనేందుకే తహ తహ లాడుతున్నారు. అందుకే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్ష నేతలు అడుగుతున్నా నోరు మెదపడం లేదు.

శంకుస్థాపన ఖర్చులు తక్కువలో తక్కువ చూసుకొన్నా 400 కోట్లు దాటిపోయిందని అంతా అంటున్నారు. జరిగిన హంగామాను చూస్తే ఎవరైనా దీన్ని అంగీకరించాల్సిందే.

ప్రయాణం ఖర్చులు..199 కోట్లు
దేశ విదేశాల నుంచి అతిథుల్ని పిలిపించారు. అంత మందికి అయిన ఖర్చులన్నీ ప్రజల నెత్తినే పడతాయి అనటంలో సందేహం లేదు. ప్రపంచంలోని అనేక నగరాల నుంచి విచ్చేస్తున్న అతిథులకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిక్కెట్లు, అక్కడ నుంచి విజయవాడకు అంటే గన్నవరం విమానాశ్రయానికి తరలించటానికి 10కు పైగా ప్రత్యేక చార్టర్డ్ విమానాలు, అక్కడ నుంచి శంకుస్థాపన ప్రాంతానికి తీసుకెళ్లటానికి 15కు పైగా హెలికాప్టర్లు ఉపయోగించారు. 3వేల కార్లు 2వేల బస్సులు, ఐదు వందల ప్రత్యేక వాహనాలు వీటికి అదనం.

బస, వసతి కోసం.. 78 కోట్లు
ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చిన అతిథుల కోసం నక్షత్రపు హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. శంకుస్థాపన పేరు చెప్పి నెల రోజులుగా రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, సీనియర్ ఎమ్మెల్యేలు విజయవాడ, గుంటూరుల్లోని టాప్ హోటల్స్ లో బస చేశారు. ఈ ఖర్చంతా ప్రభుత్వానిదే అని వేరే చెప్పనక్కర లేదు.

శంకుస్థాపన ప్రాంగణం, సభ..8 నుంచి 10 కోట్లు
శంకుస్థాపన ప్రాంగణం కోసం వందలాది ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నారు.
గొప్పలు అదిరిపోయేలా, సినిమా సెట్టింగ్స్ ను తల దన్నేలా వేదికలను ఏర్పాటు చేసుకొన్నారు. ఇందుకోసం కోట్లు కరిగిపోయాయి.

సాంస్క్రతిక కార్యక్రమాలు, అవగాహన.. 10 కోట్లు
రాజధాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కొంత కాలంగా ప్రచారం ఉర్రూతలూగించారు. వేదిక దగ్గర సినీ, టీవీ కళాకారులచే సాంస్క్రతిక కార్యక్రమాలు చేపట్టారు. దీనికి 10 కోట్లు దాకా ఖర్చు పెట్టారు.

రోడ్లు, మార్గాల నిర్మాణం.. 110 కోట్లు
శంకుస్థాపన వేదిక దగ్గరకు  మూడు డైరక్షన్స్ లో మార్గాలు ఏర్పాటు చేసుకొన్నారు. మెటల్ రోడ్లను యుద్ద ప్రాతిపదికన నిర్మించారు. ఇందుకోసం 110 కోట్లు దాకా ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు.

టీవీ, పేపర్ మాధ్యమాల ప్రచారం.. 30 కోట్లు
చంద్రబాబు కి ప్రచారం మీద ఉండే ప్రేమ ఎంతో వేరే చెప్పనక్కర లేదు. అసలు శంకుస్థాపన అన్నదే ప్రచారం కోసం చేస్తున్న హంగామా. అందుకే న్యూస్ పేపర్లు, టీవీ చానెల్స్ వంటి వాటిలో ప్రచారాన్ని మోతెక్కించారు. ఇందుకోసం డబ్బు వరదలా ప్రవహించింది.

పోలీసు శాఖకు.. 10 కోట్లు
శంకుస్థాపన పేరు చెప్పి 2 నెలల నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా గుంటూరు, విజయవాడ చుట్టూనే తిరుగుతోంది. మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడే తిష్ట వేశారు. దీంతో వీరికి బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పోలీసు బలగాల్ని మోహరించారు.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు ప్రచారపు హంగామా కోసం ప్రజల నెత్తిన 400 కోట్ల రూపాయిల చమురు వదిలింది. దీని మీద శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో కోరుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు. 

తాజా వీడియోలు

Back to Top