స్పీకర్ కోడెలకు నోటీసులు

నిన్న చంద్రబాబు ఇవాళ కోడెల...కోర్టు తాఖీదులందుకోవడంలో టిడిపి నేతలు అధ్యక్షుడితో పోటీ పడుతున్నట్టున్నారు. ఎన్నికల్లో 11 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నారు స్పీకర్ కోడెల శివప్రసాద్. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అధికంగా ఖర్చు చేయడమే కాదు, ఆ విషయాన్ని పబ్లిక్ గా చెప్పిన కోడెలపై చర్యలు తీసుకోవాలంటూ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కరీంనగర్ కోర్టులో కేసు వేసారు. దాన్ని విచారణలోకి తీసుకున్న స్థానిక కోర్టు విచారణకు హాజరు కావాలని కోడెలకు నోటీసులు జారీ చేసింది. ఆ సమయంలో విచారణకు హాజరు కాకుండా కరీంనగర్ కోర్టు ఆదేశాలపై హైకోర్టు నుంచి కోడెల స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపిలపై విచారణకు ప్రత్యేక కోర్టు నాంపల్లి లో ఏర్పాటు అయ్యింది. దాంతో కోడెల కేసు అక్కడికి బదిలీ అయ్యింది. హైకోర్టు ఇచ్చిన స్టే గడువు 6 నెలలు పూర్తి కావడంతో ఎమ్మెల్యేలు, ఎంపిల ప్రత్యేక కోర్టుకు కోడెల వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. 
కోడెల శివప్రసాద్ తన పక్షపాతాన్ని దాచుకోడు. తనపై ఆరోపణలు చేస్తే ఊరుకోడు. న్యాయం కోసం ప్రశ్నిస్తే ఒప్పుకోడు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిచి కూడా బహిరంగంగా ఆ విషయాన్ని చెప్పడానికి సంకోచించడు. అధికారపార్టీ అన్యాయంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొన్నా స్పందించడు. దానిపై అసెంబ్లీలో ప్రశ్నించినా ప్రభుత్వాన్ని నిలదీయడు. ప్రతిపక్ష నేతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభలో అవమానిస్తున్నా, మహిళలను కించపరుస్తున్నా వారిపై చర్యలు తీసుకోడు. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, మైక్ కట్ చేస్తాడు. స్పీకర్ స్థానంలో ఉండి ప్రభుత్వం, ప్రతిపక్షాలను సమ రీతిలో చూడాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేస్తాడు. తాను అధికారపార్టీ పక్షపాతినని బహిరంగంగానే తన ఉద్దేశ్యాన్ని ప్రకటిస్తుంటాడు. ఇదీ గౌరవనీయమైన స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్ తీరు.
నిస్పక్షపాతంగా ఉండటం, నిర్ణయాధికారాన్ని ఇరు వర్గాలకు సమంగా వినియోగించడం, అధికార పార్టీ తొత్తుగా కాక, విచక్షణాపూరితంగా వ్యవహరించడం అనేవి కోడెల స్పీకర్ గా బాధ్యతలు తీసుకున్న నాటినుంచీ మచ్చుకైనా కనిపించని లక్షణాలు...ఇక ఎన్నికల్లో నిబంధనల అతిక్రమణ విషయంలోనూ అదే నిర్లక్ష్య వైఖరి. దీనిపై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో...లేక పచ్చపార్టీ నేతలు ఎప్పటిలాగే స్టేల ముసుగులో దాగి ఉండే అవకాశాన్ని కల్పిస్తుందో చూడాలి. 
 

తాజా వీడియోలు

Back to Top