మూడు నగరాలు ఎంపికమూడు చోట్ల పాలక మండళ్లు కరవుఎన్నికలు వాయిదా వేస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు ఎంపిక అయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలకు చోటు దక్కింది. అయితే ఈ మూడు నగరాల్లోనూ స్థానిక స్వపరిపాలన మండళ్లు లేవు. దీంతో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది.
స్మార్ట్ సిటీలకు అవకాశాలుకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా ప్రవేశ పెట్టిన పథకం కావటంతో స్మార్ట్ సిటీల పట్ల ఆసక్తి నెలకొంది. విరివిగా నిధులు వెచ్చించి ఈ నగరాల్ని సుందరంగా తీర్చి దిద్దాలని, అభివృద్ది వైపు తీసుకెళ్లాలని కేంద్రం తలపోస్తోంది. ఇందుకు తగినట్లుగా నిధులు విడుదల కానున్నాయి. ఆ నిధుల్ని సత్వరం సమర్థవంతంగా ఖర్చు చేసి నగరాల్ని అభివృద్ది చేసుకోవాలని నిర్దేశిస్తోంది.
పాలక మండళ్లులేని నగరాలువివిద కారణాలతో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన మూడు నగరాలకు పాలక మండళ్లు లేవు. ఈ మూడు కార్పొరేషన్లకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన కూడా కనిపించటం లేదు. అబద్ధపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అసలు గుట్టు చాలా త్వరితగతిన బయట పడింది. దీంతో ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో సక్రమ పద్దతిలో ఎన్నికలు జరిగితే ఈ మూడు కార్పొరేషన్లలోనూ ఓటమి తప్పదు. ఈ సంగతి గ్రహించి పరిస్థితుల్లో మార్పు వచ్చే దాకా ఎన్నికవు వాయిదా వేస్తున్నారు.
నారాయణ మంత్రమే మార్గంపాలక మండళ్లు లేక పోవటంతో మునిసిపల్ అధికారుల చేతిలో ఈ మూడు నగరాలు నడుస్తున్నాయి. మునిసిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ ఇప్పుడు చంద్రబాబు కోటరీలో కీలక సభ్యుడు. దీంతో స్మార్ట్ సిటీల రూపంలో కానీ, మరో రూపంలో కానీ నిధులు వస్తే వాటిని అక్రమ మార్గాల్లోకి తరలించేందుకు యంత్రాంగం సిద్దంగా ఉంది. అందుచేత నిధుల గోల్ మాల్ అంతా నారాయణ పర్యవేక్షణ లో జరుగుతుంది కాబట్టి ఈ మూడు నగరాలకు పాలక మండళ్లను నియమించకుండా సాధ్యమైనంత వరకు సాగదీయటానికి ప్రయత్నిస్తున్నారు.