నేలకు కొట్టిన బంతి ఏమౌతుంది? కసిగా రెట్టింపు వేగంతో పైకి లేస్తుంది. ప్రవాహానికి అడ్డుపడితే ఏమౌతుంది? ఉత్తుంగ తరంగం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. ప్రజాసంకల్పానికి ఆటంకం కలిగిస్తే ఏమౌతుంది? ఇదిగో ఇలాగే జనవాహిని కదం తొక్కుతుంది. ఈ సంకల్పం సడలదు. ఆ నాయకుడి గుండెధైర్యం చెదరదు. ప్రజల అభిమానం శ్రీరామరక్షగా జనకవచంలో జననేత సంకల్పంముందుకుసాగుతోంది.మృత్యుంజయుడైఅధికార పక్షమో, మరే వైరి పక్షమో, మూకుమ్మడి పథకాలప్రయత్నమో...ఏదైనా కానీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే కుదిపేసింది. అధికారపక్షపు కూసాలు కదిలించేసింది. జననేత ఎంతో సంయమనంతో వ్యవహరించబట్టి కానీ లేకపోతే రాష్ట్రం పెద్ద అల్లకల్లోలం అయ్యేదే! దాన్ని సాకుగా చూపి బిజెపి, వైఎస్సార్ కాంగ్రెస్ కలిపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తున్నాయనే తమ బిరడా డ్రామాను ప్రచారం చేయాలనుకున్న ఎల్లోగ్యాంగ్ కి గొంతులో పచ్చివెలక్కాయే పడింది. విశాఖలో జరిగిన దాడి తర్వాత హుందాగా వెళ్లిపోయిన వైఎస్ జగన్ తీరు, విచారణ సమయంలో మౌనంగా ఉన్న తీరు ప్రభుత్వంలో ప్రకంపనలే పుట్టించింది. చివరకు కోడికత్తి కథ వెనకున్న వెర్రివెంగళప్పలను పట్టించింది. వారిచ్చిన స్క్రిప్టులోనే పూటకో మార్పు జరగడాన్ని ఎపి ప్రజ పసిగట్టింది. నిజానికి దీనిపై ప్రజలు తిరగబడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలజడి రేపితే బాబు మొత్తానికి బిచాణా ఎత్తేయాల్సి వచ్చేది. కానీ వైఎస్ జగన్ సహనం ప్రజలను ఆశ్చర్యంలో ముంచింది. అతడి శాంతియుత ధోరణే, న్యాయంపై గల నమ్మకమే వారిలోని ఆవేశానికి ఆనకట్టలు కట్టింది. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత మహాపాదయాత్రికుడి ప్రస్థానం తిరిగి ఆరంభంమైంది. మృత్యుంజయుడై తిరిగొచ్చిన యువనేతను చూసి రాష్ట్రమే ఉద్వేగంతో ఉరకలెత్తింది. నీ వెంటే కాదు, నిను కంటికి రెప్పలా చూసుకునేందుకు మేముంటామంటూ తరలి వచ్చింది. విశాఖ విమానాశ్రయానికి వచ్చిన వైఎస్ జగన్ కు విశాల జనాభిమానమే వెన్నంటి నిలిచింది. నా బిడ్డ జగన్ కు జనమే రక్ష అంటూ నమ్మకమనే తాయత్తు కట్టి పంపిన అమ్మ విజయమ్మ సాక్షిగా వేలమంది అభిమానులే రక్షకులై, సుశిక్షితులైన సైనికులై పహారా కాస్తున్నారు. పరిగెత్తిస్తున్న పాపంపచ్చ పాచికలు తునాతునకలయ్యాయ్. పిచ్చి ప్రచారాలు పనికిరాకుండా పోయాయ్. జాతిమీడియాను అడ్డుపెట్టుకున్నా జనాల ముందు నిజాలు బయటపడిపోయాయ్. దీంతోభయంతో బాబు భారతదేశం మొత్తం పరుగులు పెడుతున్నాడు. తనను కాపాడుకునేందుకు అందరి కాళ్లూ పట్టుకుంటున్నాడు. కోడికత్తి తన పీకమీదకు రాకముందే, డేగకన్ను తనపై పడకముందే, సిబిఐ కొరడా ఝుళిపించకముందే చంద్రబాబు పిక్కబలం చూపిస్తున్నాడు. చేసిన పాపం ఊరికే పోతుందా? ఇలాగే ఊళ్లన్నీ తప్పించదూ...చివరకు నిజాన్ని కక్కించదూ!!