సభాసమయం దుర్వినియోగం

హైదరాబాద్: ముందుగా ఊహించినట్లే శాసనసభా సమయం వృథా అయిపోయింది. ఐదు రోజుల సమావేశాల్లో4గంటల 10 నిమిషాలు మాత్రమే సభ జరిగింది. అన్ని రకాల ప్రశ్నలకు 44 సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. రెండు కమిటీల నివేదికలు సభలో ప్రవేశపెట్టారు.
సభలో మాట్లాడేందుకు పార్టీలు తీసుకున్న సమయాలిలా ఉన్నాయి.
కాంగ్రెస్ - గంటా 6 నిమిషాలు, టీడీపీ - 39, టీఆర్ఎస్ - 52, వైఎస్ఆర్ సీపీ - 18, ఎంఐఎం - 6 , సీపీఐ - 14, బీజేపీ - 20, సీపీఎం - 12, లోక్సత్తా -6, స్వతంత్రులు - 17 నిమిషాలు మాట్టాడారు. వ్యక్తిగతంగా సీఎం -3 నిమిషాలు, చంద్రబాబు -5, ఈటెల రాజేంద్ర - 11, వైఎస్ విజయమ్మ- 3, గుండా మల్లేష్ - 4, బీజేపీ నేత లక్ష్మీనారాయణ - 6 నిమిషాలు ప్రసంగించారు.
మొత్తం వృథా అయిన సమయం గంటా 13 నిమిషాలు
టీడీపీ - 14 నిమిషాలు, టీఆర్ఎస్ - 30, ఎంఐఎం - 1, సీపీఐ - 4, బీజేపీ - 8, సీపీఎం - ఒక నిమిషం వృధా చేశాయి. 
ప్రశ్నలు-సమాధానాలకు పట్టిన సమయం:
నక్షత్ర ప్రశ్నలకు మౌకిక సమాధానాలు - 28 నిమిషాలు
లిఖితపూర్వ సమాధానాలు - 27 నిమిషాలు
ఇతర ప్రశ్నలకు లిఖితపూర్వ సమాధానాలు- 27 నిమిషాలు

Back to Top