రైతుల ఉసురు పోసుకొంటున్న జోన‌ల్ విధానం


() వ్య‌వ‌సాయ దారుల ఉసురు పోసుకొంటున్న ప్ర‌భుత్వం
() గ్రీన్ జోన్ పేరుతో పొలాల అమ్మ‌కం మీద నిషేధం తెచ్చిన స‌ర్కారు
() బినామీల భూముల్ని సుర‌క్షితంగా ఉంచుకొని రైతుల్ని ఇరికించిన వైనం
() స్వ‌యంగా కొంద‌రు టీడీపీ నేత‌లే ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై మండిపాటు

రాజ‌ధాని పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విసిరిన మ‌రో పంజా గ్రీన్ జోన్ వ్య‌వ‌హారం. ఇందులోకి వ‌చ్చిన భూముల‌న్నీ మామూలు రైతులవి. ఈ ప్రాంతంలోని రైతులు త‌మ భూములు వ్య‌వ‌సాయేతర అవ‌స‌రాల‌కు అమ్మరాద‌ని నిషేధం తెచ్చారు. త‌మ బినామీల భూముల‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ జోన్ లోకి పెట్టారు. అంటే అక్క‌డ కోట్ల రూపాయిలకు అమ్ముకొని ప‌డ‌గ‌లు ఎత్తాల‌న్న యోచ‌న కు రంగం సిద్ధం చేశారు. 

అంతర్జాతీయ నిపుణులను నియమించి కోట్లు వెచ్చించి ‘మాస్టర్‌ప్లాన్’లు తయారుచేయించారు. బినామీలకు అచ్చివచ్చేలా నచ్చినచోట ఇష్టం వచ్చిన జోన్‌ను ప్రకటించుకున్నారు. వారి భూములున్న చోట్ల ‘డెవలప్‌మెంట్’ జోన్లు- పక్కా ‘కమర్షియల్’ జోన్లు. పేదరైతుల భూములున్న చోట గ్రీన్ జోన్లు. వారి భూముల ధరలు కోట్లకు చేరుకోగా రైతుల భూముల ధరలు లక్షలకు పడిపోయాయి. ధర లేకపోయినా అమ్ముకోకుండా కఠిన నిబంధనలు, వ్యవసాయం తప్ప మరో కార్యానికి పనికిరాకుండా కండిషన్లు అమల్లోకొచ్చాయి.  ఇదీ రాజధాని పేరుతో ‘పెద్దలు’ ఆడుతున్న రాక్షసక్రీడ..
 
 
పేద రైతుల పొట్టగొట్టిన గ్రీన్‌జోన్!
►అమరావతిలో పెద్దలు వేసిన జోన్‌ల ‘పథకం’ పేద రైతుల పొట్ట కొట్టింది.
►ఎకరా రూ. 4 కోట్లు ఉన్న భూమి ధర రాత్రికి రాత్రి రూ. 40 లక్షలకు పడిపోయింది.
►రూ. 2 కోట్లు పలికిన భూమిని రూ. 20 లక్షలకు కూడా కొనేవాళ్లు లేరు.
►విచిత్రమేమిటంటే పక్కపక్కనే ఉన్న భూములు కూడా ఇలా రకరకాల రేట్లు పలుకుతున్నాయి.
►ఒకరి భూమి కోట్లు పలుకుతుంటే పక్కనే ఉన్న మరొకరి భూమి లక్షలకు కూడా కొనేవారు లేరు.
►రాజధాని భూములను జోన్‌ల వారీగా వర్గీకరించిన ఫలితమిది.
►ఏ జోన్‌లో ఏం రాబోతున్నదనే విషయాన్ని గోప్యంగా ఉంచి అనుయాయుల చేత భూములు కొనిపించారు...
► బాబుగారి బినామీల భూములున్న చోట కమర్షియల్ జోన్.. పేదరైతుల భూములున్న చోట అగ్రికల్చర్ జోన్...
►దాంతో బాబుల భూముల ధరలకు రెక్కలొచ్చాయి..అగ్రికల్చర్ జోన్‌లోని పేద రైతుల భూముల ధరలు పడిపోయాయి..
►పెద్దల ఆర్జన వేల కోట్లకు పెరిగింది.. పేద రైతుల జీవితాలు ఊబిలో దిగబడ్డాయి... అదీ వాళ్ల స్కెచ్.
Back to Top