అక్రమ కేసులపై జనాగ్రహం

– వైయస్‌ జగన్‌పై కేసులు ఎత్తివేయాలని ధర్నా
– అన్ని మండల కేంద్రాల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులు 
– తహసీల్దార్‌లకు వినతిపత్రాలు సమర్పణ 
– జననేతకు అండగా రోడ్డెక్కిన జనం 

కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘనటకు సంబంధించి బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడిన ప్రతిపక్ష నాయకుడిపై కేసులు నమోదు చేయడాన్ని వైయస్‌ఆర్‌ శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ నిరంకుశంత్వంపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 11 మంది మృతుల కుటుంబాలకు న్యాయం చేయమని నిలదీసిన ప్రతిపక్ష నాయకుడిపై తప్పుడు కేసులు బనాయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం దారుణమని నినదించారు. 11 మంది ప్రానాలను కూడా తృణప్రాయంగా చూసి పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని కాపాడుకోవడానికే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని .. ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం ఆయా మండల తహసీల్దార్‌లకు వినతిపత్రాలు సమర్పించారు. ఆయా జిల్లాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల వివరాలు...

అనంతపురం జిల్లాలో..
అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో గురునాథరెడ్డి మాట్లాడారు. క్షతగాత్రులను పరామర్శించడం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తప్పా అని ప్రశ్నించారు. గతంలో అనంతపురం తహసీల్దార్‌ మహబూబ్‌బాషాపై టీడీపీ కార్యకర్త దాడి చేస్తే ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్‌ కానీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ సురేంద్రబాబుపై అధికార పార్టీ కార్పొరేటర్లు దుశ్చర్యలకు పాల్పడినా కలెక్టర్‌ స్పందించలేదన్నారు.  
– రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి..అనంతరం ధర్నా చేశారు.
– మడకశిర తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
– కదిరిలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్దారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
– కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి గంటపాటు నిరసన తెలియజేశారు.
– శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– ఉరవకొండ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– గుంతకల్లు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అక్కడికి వెళ్లి ఆందోళనకారులను విడుదల చేయించారు.
తూర్పు గోదావరి జిల్లాలో.. 
ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు కదం తొక్కాయి. జిల్లాలోని 64 మండల కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.
 వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు సర్పవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేసి, చంద్రబాబు సర్కార్‌ తీరును ఎండగట్టారు. రాస్తారోకోతో పిఠాపురం – కాకినాడ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి, ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  
– కాకినాడ సిటీ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆధ్వర్యాన ఆందోళన నిర్వహించారు.
∙– కొత్తపేట పాతబస్టాండ్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ, రాస్తారోకో చేశారు. సెక్ష¯ŒS–30 అమలులో ఉందంటూ పోలీసులు జగ్గిరెడ్డి సహా పలువురు నేతలను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
l– రంపచోడవరం నియోజకవర్గం వై.రామవరంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌లు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీఆర్‌ పురం, కూనవరం, చింతూరు తదితర విలీన మండలాల్లోని నేతలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
– రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రాగా, అర్బ¯ŒS తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒSలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, ట్రేడ్‌ యూనియ¯ŒS అధ్యక్షుడు అడపా వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.
l– రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు.
–∙సీతానగరంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి్మ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
– అమలాపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ పీఏసీ సభ్యుడు‡ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి తదితరుల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాస్, బొమ్ము ఇజ్రాయిల్, రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
–∙పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు; రాజమహేంద్రవరం రూరల్‌లో కో–ఆర్డినేటర్లు ఆకుల వీ్రరాజు, గిరజాల వీ్రరాజు(బాబు)ల ఆధ్వర్యాన రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ వెలుగుబంటి అచ్యుతరామ్, రాష్ట్ర కార్యదర్శులు మింది నాగేంద్ర, నక్కా రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
–∙ముమ్మిడివరంలో కో–ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, పి.గన్నవరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు తదితరులు ధర్నా నిర్వహించారు. రామచంద్రపురం తహసీల్దార్‌ కార్యాలయంలో వైద్య విభాగం అ«ధ్యక్షుడు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ, పట్టణ కన్వీనర్‌ గాదంశెట్టి శ్రీధర్‌ తదితరులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అనపర్తిలో కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యాన అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
–∙జగ్గంపేటలో కో–ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యాన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, ర్యాలీ, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించి, వినతిపత్రం అందజేశారు. గోకవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశాయి. మలికిపురం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి మంగెన సింహాద్రి, ఎస్సీ సెల్‌ కార్యదర్శి నల్లి డేవిడ్‌ తదితరులు ధర్నా చేశారు. కో ఆర్డినేటర్‌ పర్వత ప్రసాద్‌ ఆధ్వర్యాన ఏలేశ్వరంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మండపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. కో–ఆర్డినేటర్‌ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యాన తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాయవరంలో రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు.
కృష్ణా జిల్లాలో... 
కైకలూరు: నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలితీసుకున్న దారుణఘటనపై నిలదీసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని  పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) డిమాండ్‌ చేశారు.  అక్రమ కేసులను నిరసిస్తూ నియోజకవర్గవ్యాప్తంగా కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి మండల కేంద్రాల్లో ఉద్యమించారు. కైకలూరులోని పార్టీ కార్యాలయం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి తాలూకా సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు గురువారం ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎన్నార్‌ మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలు, బాధితుల పక్షాన నిలదీసిన జగన్‌పై అధికార పార్టీ నాయకులు బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 
కర్నూలు...
కర్నూలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లారు. ప్రమాద బాధితులను పరామర్శిస్తే కేసులు పెట్టేందుకు సీఎం చంద్రబాబునాయుడు దిగజారారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని హఫీజ్‌ఖాన్‌ పేర్కొన్నారు. 
నంద్యాల..
నంద్యాల, గోస్పాడు మండల్లాలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొని ధర్నాలు నిర్వహించారు. నంద్యాలో జరిగిన ధర్నా కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌ పాల్గొని చంద్రబాబునాయుడు తీరును తప్పుబట్టారు. 
ఆదోని..
– ఆదోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలు పార్టీ నాయకులు గోపాల్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, ప్రసాదరావు, మునిస్వామి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 
 పత్తికొండ  
తుగ్గలిలో పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. పత్తికొండలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, న్యాయవాదులు నరసింహయ్య ఆచారి, కారం నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీతో వచ్చి ధర్నా చేశారు. రెవెన్యూ సీనియర్‌ అధికారి టీఎండీ ఉశేన్‌కు వినతి ప్రతం అందజేశారు. మద్దికెరలో పార్టీ మండల కన్వీనర్‌ మురళీధర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు రాజశేఖర్‌రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 
మంత్రాలయం... 
మంత్రాలయంలో సర్పంచ్‌ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కౌళాలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. 
 ఆలూరు..  
– ఆలూలు నియోజకవర్గంలోని ఆలూరు, దేవనకొండ, ఆస్పరి, హోళగుంద, చిప్పగిరి తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించారు, ఆలూరులో నిర్వహించిన కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చిన్న ఈరన్న, ఎంపీపీలు బసప్ప, బీమప్ప, యూత్‌ నాయకుడు విక్రంత్‌ పాల్గొన్నారు. 
డోన్‌... 
డోన్‌లో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, ప్యాపిలిలో బోరెడ్డి శ్రీరామ్‌రెడ్డి, బేతంచెర్లలో ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఆయా మండలాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. 
ఎమ్మిగనూరు...
ఎమ్మిగనూరులో నిర్వహించిన ధర్నాలో పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. నందవరం, గోనెగొండ్ల తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట కూడా వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. 
నందికొట్కూరు.. 
నందికొట్కూరు, పాములపాడులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య పాల్గొని చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరామర్శకు వెళ్లిన వారిపై కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. కార్యక్రమంలో మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి పాల్గొన్నాడు. 
బనగానపల్లె.. 
బనగానిపల్లె, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండల్లాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో భారీ ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బనగానిపల్లెలో జిల్లా అధికార ప్రతినిధి రామ్మోహన్‌రెడ్డి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
శ్రీశైలం..
ఆత్మకూరులో జరిగిన ధర్నా కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి పాల్గొన్నారు. బండిఆత్మకూరు, మహానంది, సున్నిపెంటలో జరిగిన ధర్నాలో పలువురు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. 
ఆళ్లగడ్డ 
ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమ్రరి, శిరివెళ్ల మండలాల తహసీల్దార్‌ కార్యాలయలు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ధర్నాలు, నిరసనలతో హోరెత్తాయి. ఆళ్లగడ్డలో జరిగిన కార్యక్రమంలో నాయకులు పండిట్‌ చంద్రుడు, శంకరరెడ్డి, గుండా మణి, జఫార్‌రెడ్డి పాల్గొన్నారు. 
పాణ్యం
కల్లూరు, ఓర్వకల్, గడివేముల మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తమ పార్టీ అధినేతపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని ధర్నాలతో హోరెత్తించారు. కల్లూరులో జరిగిన ధర్నాలో అర్బన్‌ కన్వీనర్‌ బెల్లం మహేశ్వరరరెడ్డి, లీగల్‌ సెల్‌రాష్ట్ర కమిటీ సభ్యుడు పుల్లారెడ్డి, మైనార్టీసెల్‌ ఫైరోజ్‌ పాల్గొన్నారు.      
ప్రకాశం జిల్లా...
టంగుటూరు(కొండపి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ టంగుటూరులో గురువారం ధర్నా కార్యక్రమం జరిగింది.  
పొన్నలూరులో...: దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా కేసుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తీరుకు నిరసనగా పొన్నలూరులో  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
 మ్రరిపూడిలో..: మండల కేంద్రమైన మ్రరిపూడి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు, యూత్‌ అధ్యక్షుడు దొద్దాలి మల్లికార్జునరావు, వనిపెంట మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
సింగరాయకొండలో..:  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేసినందుకు నిరసనగా పార్టీ రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకు గురువారం ఉదయం 10 గంటలకు  మండల తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం  చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు తాండ్రరామ్మూర్తి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో.. 
అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడం సరికాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న రాక్షస పాలనను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట గురువారం ధర్నాలు జరిగాయి. ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆళ్ల నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలబడ్డ వారిపై కేసులు పెట్టడం ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు. వెఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనన్నారు. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లం గోళ్ల శ్రీలక్షి్మ, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్దాని శ్రీనివాస్, నగర శాఖ అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 
తణుకు నియోజకవర్గ పరిధిలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ, ధర్నాలు జరిగాయి. 
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ర్యాలీ అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. పెంటపాడులోనూ ధర్నా జరిగింది. 
ఆకివీడులో ఉండి నియోజకవర్గ కన్వీనర్‌ పాతపాటి స్రరాజు ధర్నాలో పాల్గొన్నారు. 
కొవ్వూరులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 
దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో పార్టీ కన్వీనర్‌ కొఠారు రామచంద్రరావు నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. 
పోలవరం నియోజకరవర్గంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు తెల్లం బాలరాజు నేతత్వంలో పలుచోట్ల ధర్నాలు జరిగాయి. 
చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు నేతృత్వంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
భీమవరం ప్రకాశం చౌక్‌లో వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ కోడే యుగంధర్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గోపాలపురం వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 
పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో నియోజకవర్గ కన్వీనర్‌ గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. 
ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు ప్రధాన కూడలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి, పెనుమంట్రలో ధర్నా చేశారు. ఉంగుటూరులో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు పాల్గొన్నారు. 
చిత్తూరు ...
తిరుపతిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పాల్గొనగా, రూరల్‌ మండలం ఎదుట జరిగిన ధర్నాలో వైయస్‌ఆర్‌ సేవాదల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొని ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు. గంగాధర నెల్లూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే నారాయణస్వామి, మదనపల్లి, వాల్మీకిపురం కార్యాలయాల ఎదుట ఎమ్మెల్యేలు దేశాయ్‌ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. 
గుంటూరు జిల్లాలో...
చిలకలూరిపేటలో.. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. 
నరసరావుపేటలో.. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేశారు. 
మాచర్లలో..  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. 
గుంటూరు నగరంలో.. తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మహ్మద్‌ ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నగరంలో ర్యాలీ నిర్వహించారు. వినుకొండలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా రావు, పార్టీ కన్వీనర్‌ ఎం. మల్లేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి, బత్తుల కుమారి ఆధ్వర్యంలో.. దుగ్గిరాలలో పార్టీ నాయకురాలు వై. విజయలక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు.
– తెనాలిలో పార్టీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ నేతృత్వంలో ర్యాలీ జరిగింది. 
– పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 
– ప్రతిపాడులో వైయస్‌ఆర్‌ విగ్రహం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరిగింది. 
– గురజాల నియోజకవర్గంలో కాసు మహేశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి పిలుపుమేరకు ధర్నాలు చేపట్టారు. 
– రేపల్లెలో.. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పిలుపు మేరకు రేపల్లె మండల కన్వీనర్‌ గడ్డ రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో తహసీల్దార కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 
సత్తెనపల్లిలో.. రాష్ట్ర ప్రధానకార్యదర్శి కళ్లం వీరభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 
– పెదకూరపాడలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. 
– తాడికొండ, తుళ్లూరు మండల తహసీల్దార్‌ కార్యాలయాల ఎదటు నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెని క్రిష్టినా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 
నెల్లూరులో..
సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిరసన తెలిపారు. వెంకటగిరిలో జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి.. కావాలి నియోజకవర్గంలో దగదర్తిలో మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి .. ఉదయగిరి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెలే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. గూడూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. సూళ్లూరుపేటలో నాయుడుపేట తహసీల్దార్‌ కార్యాలంయ ఎదుట మండల కన్వీనర్‌ తంబిరెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆత్మకూరులోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ అల్లారెడ్డి ఆనందరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
శ్రీకాకుళం.. 
పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస ఆధ్వర్యంలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పాలకొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రాజాం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరనస ప్రదర్శన నిర్వహించారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఇచ్ఛాపురం సమన్వయకర్తలు నర్తు రామారావు, పిరియా సాయిరాజ్‌ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. 
విజయనగరం.. 
చంద్రబాబు నిరంకుశ పాలనను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు కదంతొక్కారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల నేతృత్వంలో నిరసనలు జరిగాయి. కురుపాంలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో బస్టాండ్‌ కూడలి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 
– సాలూరులో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉన్న జాతీయ రహదారిపై నల్లబ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. 
– చీపురుపల్లిలో.. జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 
– విజయనగరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గల రోడ్డుపై చేపట్టిన ఆందోళనలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు ఆశపువేణు, నడిపేన శ్రీనివాసరావు, సీనియర్‌ కౌన్సిలర్‌ ఎస్‌వివి రాజేష్‌ పాల్గొన్నారు.  
– పార్వతీపురంలో నియోజకర్గ ఇన్‌చార్జి జమ్మాన ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న వైయస్‌ఆర్‌ విగ్రహం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 
– ఎస్‌ కోటలో షేక్‌ రెహ్మాన్‌ నేతృత్వంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి తహసీల్దార్‌ రాములమ్మకు వినతిపత్రం అందజేశారు. 
– గజపతినగరంలో మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావ, మాజీ జడ్పీటీసీ గార తౌడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. 
– నెల్లిమర్లలో కేంద్రపాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు చనమల్లు వెంకటరమణ ఆధ్వర్యంలో వందమందికి పైగా నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. 
– బొబ్బిలిలో.. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద «ధర్నా నిర్వహించారు. జైడ్పీ మాజీ చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఇంటి గోపాలరావుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. 

వైయస్ఆర్ కడప జిల్లా..
మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి, ప్రొద్దుటూరు, కమలాపురం, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు చొక్కాలకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్‌లకు వినతిపత్రాలు సమర్పించారు. రైల్వేకోడూరు టోల్‌గేటు సమీపంలోని వైయస్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ బాబుల్‌రెడ్డి గాంధీజి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పులివెందులలో డిప్యూటీ తహసీల్దార్‌కు మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఒంటిమిట్టలో జెడ్పీచైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి నేతృత్వంలో నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు. రాయచోటిలో వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. 
విశాఖపట్నం జిల్లాలో.. 
డాబా గార్డెన్‌ జంక్షన్‌లో జరిగిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు. విశాఖ తూర్పులో వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అరిలోవలో నిరసన ప్రదర్శన చేపట్టారు. విశాఖ పశ్చిమలో పార్టీ కో ఆర్డినేటర్‌ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ ఆధ్వర్యంలో మల్కాపురం ప్రకాష్‌నగర్‌లో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. విశాఖ ఉత్తర నియోజకర్గంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ ఆధ్వర్యంలో సీతమ్మధార తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. ప్రతిపక్ష నాయకుడిపై అక్రమంగా బనాయించిన కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ దక్షిణంలో..  పార్టీ కో ఆర్డినేటర్‌ కోలా గురువులు ఆధరవ్యంలో డాబా గార్డెన్స్‌లో ఎల్‌ఐసీ భవనం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాజువాకలో.. కో ఆర్డినేటర్‌ తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వంద అడుగుల రోడ్డులో మౌనప్రదర్శన చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నినాదాలు చేశారు. భీమిలిలో.. భీమిలి, ఆనందపురం మండలాల్లో పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. భీమిలి పట్టణాధ్యక్షుడు అక్కరమోని వెంకటరావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జిల్లా అధికా ప్రతినిధి ఎస్‌. కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెందుర్తిలో.. కోఆర్డినేటర్‌ అన్నంరెడ్డి అదీప్‌రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెందుర్తి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పెందుర్తి బీఆర్‌టీఎస్‌ రహదారి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నల్ల రిబ్బను ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ పాండురంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు. 
Back to Top