అణిచి ఉన్న ఉద్వేగాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. బంధించి ఉంచిన భయాలు పటాపంచలౌతున్నాయి. కనురెప్పల చాటున దాగిన కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. కష్టాల భారాలను మోస్తున్న గుండెలు బరువు దింపుకుంటున్నాయి. చిగురించిన ఆశలు కళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరంభం అయ్యిన రోజు నుంచీ ప్రతి నిమిషం ఉద్వేగభరితమే. కలిసే ప్రతి మనిషీ ఓ ఉద్విగ్న తరంగమే. పాదయాత్రలో ప్రజల గోస ప్రజానాయకుడి గుండెను తాకుతోంది. ప్రజల పట్ల ఆ నాయకుడి స్పందన ఆ ప్రజల్లోనూ ధైర్యాన్ని నింపుతోంది. నాన్న ఇచ్చిన పెద్ద కుటుంబంకుటుంబంలో ఏదైనా కావాలంటే తండ్రిని అడుగుతారు. బాధ కలిగితే తల్లికి చెప్పుకుంటారు. సాయం కోసం తోడబుట్టిన వారి చేయి పట్టుకుంటారు. దారి చూపమని అవ్వా తాతల సలహాను కోరుతారు. అచ్చం అలాగే వైయస్సార్ అందించిన పెద్ద కుటుంబం జగన్ ను ఓ పెద్ద కొడుకులా భావిస్తోంది. తమ సొంత అన్నలా ప్రేమగా పిలుస్తోంది. ఆత్మీయంగా ఆదరిస్తోంది. తమ బాధలను, కష్టాలను అతడికి విన్నవిస్తోంది. మనవాడని, సొంతవాడని, ఇంటివాడని ప్రతి ఒక్కరూ భావించడమే అందుకు కారణం. ‘నా తండ్రి పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చాడు’ అని నాడు జగన్ అన్న మాటకు సాక్ష్యం ఈ ప్రజా సంకల్ప యాత్రలోని ప్రజల భాష్యం.తమ గోడు చెప్పుకుంటున్న ప్రజలుమద్దతు ధరలేదయ్యా అంటూ చేతులు పట్టుకునే రైతన్న. కూలీ గిట్టుబాటు కావడం లేదు బాబూ అంటూ ఓ రైతు కూలీ ఆవేదన. ప్రభుత్వం ఫీజు కట్టక చదువు ఆగిపోయిందన్నా అంటూ ఓ విద్యార్థి కన్నీరు. ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదు బిడ్డా అంటూ ఓ తల్లి ఆక్రోశం. ఉద్యోగాలు లేక వలసలు పోతున్నామంటూ ఓ నిరుద్యోగి ఆక్రందన. బంగారం విడిపించలేదని, పంట రుణం మాఫీ కాలేదని, బ్యాంకుల్లో అప్పు పుట్టడం లేదని, పింఛను అందడం లేదని ఒకటా రెండా అడుగడుగునా ప్రజల గోసే. వారి బాధలకు ఓదార్పు, అవి తీరుతాయనే నమ్మకానికి తోడ్పాటు రెండూ వైఎస్ జగనే. నువ్వొస్తేనే మాకు మేలు జరుగుతుంది అంటూ ముక్తకంఠంతో చెబుతోంది తెలుగు నేల. ఊళ్లలో వేధింపులు, ప్రభుత్వం చేసే మోసం, పూర్తి కాని ప్రాజెక్టులు, మధ్యలో వదిలేసిన పథకాలు, పడకేసిన పాలన, పనికిరాని ప్రభుత్వం ఇలా సమస్యలన్నిటినీ వింటూ, వాటి పరిష్కారాలను ప్రతిపాదిస్తూ ప్రజలకు కొండత ధైర్యాన్ని పంచుతూ ప్రజా సంకల్పయాత్ర నడుస్తోంది. ఇది మునుపెన్నడూ చూడని చరిత్ర. భవిష్యత్తు మరెప్పుడూ చూడలేని ప్రత్యేకత.