ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే కలెక్టర్లకు చాలా నీతి సందేశం వినిపించి పంపించారు. ఈ సందేశం మీద అధికారులకు సందేహం వచ్చినా మనస్సులోనే దాచుకొని వెనక్కి మళ్లారు. మనస్సున ఉన్నది చెప్పాలని ఉన్నది అని మౌన రాగం తీసుకొంటూ వెళ్లిపోయారు. ఇంతకీ చంద్రబాబు చెప్పిందేమిటి.. దీని మీద అధికారులు పైకి చెప్పుకోలేని సందేహాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..1) పోలీసులు , అధికారులు అప్రమత్తంగా ఉంటే ఈ కాల్ మనీ కానీ, కల్తీ మద్యం కానీ జరిగి ఉండేవి కావు.(అధికారుల సందేహం) కరెక్టే కానీ, రెండు నెలల క్రితం ఈ బాగోతం మీద స్వయంగా మీకే ఫిర్యాదు చేశారు. అయినా సరే, దీన్ని దాచి పెట్టడానికి ప్రయత్నించారని మరిచిపోయారా 2. జరిగిపోయిందేదో జరిగిపోయిందంటూ పోస్టు మార్టమ్ చేయటం కాదు, ముందుగానే ఇటువంటి వాటి మీద మేలుకోవాలి.(అధికారుల సందేహం) అదే బాబూ.. ప్రస్తుతం మీరు చేస్తున్నది అదే. ముందుగానే అధికారులు గుర్తించి పనిచేశారు. మీరే పోస్టుమార్టమ్ చేస్తున్నారు.3. ప్రభుత్వానికి చాలా ఏజన్సీలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఉంది, క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన పోలీసులు ఉన్నారు. వీటిని ఉపయోగించుకోవాలి.(అధికారుల సందేహం) అదే మరి, ఇంటెలిజెన్స్ ను మీరు ప్రతిపక్ష పార్టీ ల నాయకులు ఏం చేస్తున్నారో చూడటానికి వాడుకొంటున్నారు. విజయవాడ, గుంటూరు పోలీసులకు రాజధాని ప్రాంతంలో రైతుల్ని బెదిరించే పనే సరిపోతోంది కదా.4. ఎవరైతే తప్పు చేశారో, కచ్చితంగా యాక్షన్ మాత్రం ఉండాలి.(అధికారుల సందేహం) అంటే నటించటమా బాబు గారూ. మహిళా తహశీల్దార్ వనజాక్షిని ఇసుకలో కొట్టిస్తే మీరు మీడియా ముందు యాక్షన్ చేశారంతే, క్యాంపు ఆఫీసుకి ఆమెని పిలిపించి బెదిరించి పంపేశారు.5. డబ్బుకోసం హెరాస్ చేస్తే మాత్రం ఎవరు కట్టాల్సిన పని లేదండీ(అధికారుల సందేహం) ఈ మొత్తం కేసులో మహిళల్ని వేధించటం, మానాల్ని హరించటం అన్నది చాలా ముఖ్యం. కానీ మీరు ఆ ముక్క మాత్రం చెప్పకుండా డబ్బుల వ్యవహారంలా చిత్రీస్తున్నారు. 6. మహిళల్ని ఇక ముందు వేధిస్తే మాత్రం నిర్భయ కేసు పెడదాం.(అధికారుల సందేహం) ఇక ముందు సరే, ఇప్పటికే వందల మందిని వేధించి మానాల్ని హరించారు కదా. వీళ్ల మీద ఎందుకు నిర్భయ కేసులు బుక్ కావటం లేదు.7. రాష్ట్రంలో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు ఉండాల్సిందే(అధికారుల సందేహం) మహిళా అధికారుల్ని కొట్టించినా, అటవీ అధికారుల్ని తన్నించినా ఎమ్మెల్యే చింతమనేని ని ఏమన్నా అన్నారా.. పోర్టు బాధితుల్ని చితక బాదించిన ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను ఏమైనా అన్నారా. అటువంటప్పుడు చర్యలు ఎక్కడివి బాబూ8. తప్పు చేసినప్పుడు చాలా హార్ష్ గా వ్యవహరించి వాటిని ఆపించాలి. అంతే తప్ప ఊరుకోకూడదు.(అధికారుల సందేహం) కరెక్టే. చీకట్లో హంద్రీ నీవా పంపుల్ని ఎత్తుకెళ్లి పట్టిసీమ లో బిగించినప్పుడు అక్కడ వాళ్లకు ఆ విషయం తట్ట లేదు సుమా. లేదంటే చెంబుడు నీళ్లు పోసి నదుల అనుసంధానం అయిపోయిందని మీరు పచ్చమీడియాలో ప్రచారంచేసుకొన్నప్పుడు అన్నా ఇది చేయాల్సింది.9. సమాజంలో గవర్నెన్స్ అన్నది ముఖ్యం. పరిపాలనను బట్టి అంతా ఉంటుంది.(అధికారుల సందేహం) ఇప్పుడు మహిళలు భయంతో వణికి పోయే పరిపాలన సాగుతోంది. అదీ మీ గవర్నెన్స్.10. అవినీతి అన్ని సమస్యలకూ మూలం. అవినీతి ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు.(అధికారుల సందేహం) ఈ మాట తెలంగాణ ప్రభుత్వం అనుకొంటే కొంప మునుగుతుంది. ఓటుకి కోట్లు కేసులో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి మీరు అడ్డంగా దొరికిపోయినప్పుడు ఇవేమీ గుర్తుకు లేవా బాబూ. మొత్తం మీద చంద్రబాబు వినిపించిన నీతి సూక్తులు వింటూ అధికారులు వెనక్కి మళ్లారన్న మాట.