() సమకాలీన రాజకీయాల్లో కొత్త ఒరవడి() ప్రతీ ఇంటికి తరలుతున్న నాయకులు() నియోజకవర్గంలోని ప్రతీ ఇంటినీ పలకరిస్తున్న శ్రేణులు() 5 నెలల్లో ఇంటింటికీ పార్టీ సందేశం
హైదరాబాద్) చాపకింద నీరులా మొదలైన గడప గడపకూ కార్యక్రమం ఇప్పుడు మహోద్యమంగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వాడ వాడలా పార్టీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ సందేశం రాష్ట్రం నలుమూలలా విస్తరిస్తోంది
దిశానిర్దేశం చేసిన వైయస్ జగన్గడప గడపకూ కార్యక్రమానికి స్వయంగా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ నాందీవచనం పలికారు. విజయవాడ లో పార్టీ విస్త్రతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకుల్ని పిలిపించి మాట్లాడారు. నాయకులుగా నిలదొక్కుకోవాలంటే ప్రతీ గ్రామం తిరగాలని పిలుపు ఇచ్చారు. ప్రతీ గడపతోనూ స్వయంగా అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అప్పుడే ప్రజల మనస్సులో చోటు దక్కుతుందని సూచించారు. వైయస్సార్సీపీ నాయకులకు ఇదే తారకమంత్రం అని ప్రబోధించారు.
మనస్సులో అదే తారకమంత్రంఅధ్యక్షులు వైయస్ జగన్ స్వయంగా పిలుపు ఇచ్చిన కార్యక్రమం కావటంతో పార్టీ నాయకులు ఉత్సాహంగా ఇందులో పాలు పంచుకొంటున్నారు. వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైయస్ జగన్ స్వయంగా పాల్గొన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇడుపుల పాయ లో వీధి వీధీ పర్యటించారు. గడప గడపకూ పార్టీ సందేశాన్ని అందించారు. అధ్యక్షులే స్వయంగా పర్యటించటం పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచింది.
ఉత్సాహంగా సాగుతున్న పార్టీ కార్యక్రమంప్రతీ నియోజక వర్గంలోనూ నాయకులు ఇంటింటికీ తరలుతున్నారు. పార్టీ సందేశాన్ని గడప గడపకూ చేర్చుతున్నారు. తెలుగుదేశం పాలనపై ప్రజల ఆవేదనను తెలుసుకొంటున్నారు. సమస్యలపై పోరాటానికి మెరుగులు దిద్దుతున్నారు. గ్రామంలో ఒకరిగా కలిసిపోతూ నాయకత్వం అంతటా ప్రజల ముంగిట నిలిచింది. దీంతో ఒక రకంగా దేశ రాజకీయ ముఖచిత్రం మీద కొత్త సంప్రదాయాన్నిఆ విష్కరించిన ఘనత వైయస్సార్సీపీకి, అధ్యక్షులు వైయస్‌జగన్ కు దక్కుతుంది.